Jump to content

వెండి కరెన్సీ నోట్ల కడ్డీలు


srinelluri

Recommended Posts

Endi ra idi em chestunnara miru office lo, ikkada mamuga month end vachesariki chethilo emi leka edustunnam kani miru............ :blink:  :blink:

 

బజారే బేజారయ్యేలా! 
125 జతల చెప్పులు...300 జతల దుస్తులు 
రూ.500, రూ.1000 నోట్ల రూపంలో వెండి కడ్డీలు 
రెండోరోజు లాకర్లలో రూ.3 కోట్ల విలువైన 8 ఫ్లాట్ల పత్రాల గుర్తింపు 
పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్‌ బయ్యవరపు సురేష్‌ అక్రమసొత్తు ఇదీ 
ఏసీబీ సోదాల్లో వెలుగులోకి 
ఈనాడు - అమరావతి 
6ap-main4a.jpg

ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో ఏసీబీకి పట్టుబడ్డ ఏపీ పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్‌ బయ్యవరపు సురేష్‌ ఇంట్లో లభ్యమైన చెప్పులు, దుస్తులు, వెండి వస్తువులు అధికారుల మతులు పోగొట్టాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని సురేష్‌ ఇంట్లో సోదాల సందర్భంగా ఏకంగా 125 చెప్పుల జతలు, 300 జతల దుస్తులు, వెండి నోట్ల కడ్డీలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ వస్తువులను చూస్తే ఓ బజారే తలపించింది. మరోపక్క రెండోరోజైన మంగళవారం సురేష్‌కు సంబంధించి లాకర్లలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు సీఐయూ జాయింట్‌ డైరెక్టర్‌ జగన్నాథరెడ్డి, డీఎస్పీ రమాదేవిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. ఇప్పటికే రూ.40 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించిన విషయం తెలిసిందే. అమీర్‌పేట్‌లోని ఆర్‌ఎల్‌బీ బ్రాంచిలో లాకరును తెరవగా..మొత్తం 8 ఫ్లాట్లకు సంబంధించిన ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒకటి నల్గొండలోనూ, మిగతా 7 ఫ్లాట్లు గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోనూ ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.30.18 లక్షలుగా తేల్చారు. అయితే మార్కెట్‌ విలువ ప్రకారం రూ.3 కోట్లపైనే ఉంటోందని అంచనా. హైదరాబాద్‌లోని సైనికపురి బ్రాంచిలో మరో లాకరును ఇంకా తెరవాల్సి ఉంది. సురేష్‌పై అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాలు ఆయనపై దృష్టిసారించాయని, ప్రభుత్వానికి నివేదిక అందజేశాయని కొన్ని రోజుల కిందటే ఓపత్రికలో కథనాలు వచ్చాయి. దీంతో ఆయన అప్రమత్తమై లాకర్లలో సొమ్ములను ముందే తరలించేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

నిఘా కెమెరాల్లో దృశ్యాల విశ్లేషణ 
సురేష్‌ పేరిట మొత్తం 15 లాకర్లు ఉండగా...వాటిలో రెండు, మూడు లాకర్లను ఆయన గతంలోనే మూసేశారు. మిగతా లాకర్లను మాత్రం వినియోగిస్తున్నారు. అయితే ఏసీబీ సోదాలు జరిగే అవకాశముందని ముందే పసిగట్టిన ఆయన అన్ని లాకర్లను గత పది రోజుల వ్యవధిలో పూర్తిగా ఖాళీ చేసేశారు. ఎప్పుడెప్పుడు, ఏయే లాకర్ల నుంచి సొమ్ము తరలించాడనేది గుర్తించేందుకు ఆయా బ్యాంకుల్లో ఏర్పాటైన సీసీ కెమెరాల దృశ్యాలను ఏసీబీ అధికారులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగా ఓ బ్యాంకు నుంచి భారీ బ్యాగును తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. మరోవైపు సురేష్‌ కుమారుడు పరారీలో ఉండటంతో ఆయనే లాకర్లలోని సొమ్మును తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.

6ap-main4b.jpg

చెప్పుల దుకాణం కాదు కదా? 
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో సురేష్‌ ఇంట్లో సోదాలు చేస్తే ఏకంగా 125 జతల చెప్పులు బయటపడ్డాయి. ఇవి కుటుంబ సభ్యులు అందరవీ కాదు...కేవలం ఆయన కుమార్తెకు సంబంధించినవి మాత్రమే కావడం గమనార్హం. వీటిలో సగానికి పైగా చెప్పులకు ధర ట్యాగ్‌లు కూడా ఇంకా తొలగించలేదు. వీటిలో ఒక్కో జత రూ.4 వేలు ఖరీదు చేసే చెప్పులు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం ఈ చెప్పులన్నింటి విలువ రూ.లక్ష వరకూ ఉంటుందని అంచనా!

10..20..30 కాదు 
ఓ సామాన్య వ్యక్తికి ఎన్ని దుస్తులంటాయి. మహా అయితే ఓ పది జతలు. ఇంకా బాగా ఉన్నాయనుకుంటే 30 జతలు. కానీ సురేష్‌ కుమార్తెకు సంబంధించిన 300 జతల దుస్తులను ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించారు. వీటిల్లో రూ.10 వేలు, అంతకు మించి ఖరీదు చేసే దుస్తులు 100 జతలపైనే ఉన్నాయి. ఒక్కోటి రూ.50 వేల విలువైన చీరలు ఉన్నాయి. మొత్తం దుస్తుల విలువ రూ.3 లక్షలపైనే.

6ap-main4c.jpg

వెండి కరెన్సీ నోట్ల కడ్డీలు 
రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లు మీరు చూసొండొచ్చు! కానీ రూ.500, రూ.1000 వెండి కరెన్సీ నోట్లు మీరెప్పుడైనా చూశారా! సురేష్‌ ఇంట్లో దేవతామూర్తులతో ప్రతిమలతో కూడిన ఇలాంటి వెండి కరెన్సీ నోట్ల కడ్డీలే అనేకం బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ కిలో, అరకిలో ఉంటాయి. పూజగదిలో దేవాలయాల్లో ఉన్న తరహాలో ఖరీదైన పూజాసామగ్రి, దేవతా మూర్తుల విగ్రహాలు లభించాయి.

సౌందర్య సాధనాలు ఖరీదే రూ.20 వేలు 
ఫేస్‌ క్రీములు, పౌడర్లు, అత్తర్లు, లిప్‌స్టిక్‌లు, నెయిల్‌ పాలిష్‌లు ఇలా ఒకటి రెండు కాదు...కొన్ని వందల రకాల సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్‌) బయటపడ్డాయి. వాటి విలువ ఎంతో తెలుసా! రూ.20 వేలు పైనే.

Link to comment
Share on other sites

daughter ki Cosmetics/Beauty Pichi....

 

Wife ki pooja samagri Pichi...Vendi notes pattu batti mari cheyinchindi anta... 

 

Mamool esaaalu kaavu Janala sommu tho

Acharana lo leni bakthi pooja samagri tho vastunda valla pichi kakapothe. God sees everything kotha mandiki doola teerchataniki koncham late avochu kani doola teeratam matram pakka

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...