sonykongara Posted May 21, 2017 Posted May 21, 2017 బీసీలకు అండ లక్ష మందికి స్వయం ఉపాధి యూనిట్లు! లబ్ధిదారులకు ఆధునిక పరికరాలు.. శిక్షణ బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఫెడరేషన్ల ద్వారా పంపిణీకి సర్కారు చర్యలు ఇక గ్రూపు సభ్యుల సంఖ్య ఐదుకు పరిమితం పెద్దవైతే ఉమ్మడిగా.. చిన్నవి విడిగా ప్రాజెక్టులు అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): బీసీ కులాల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. బీసీ యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి దన్నుగా ఉంటున్న బీసీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి.. వారికి అండగా నిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులోభాగంగా ఇప్పటికే 11 బీసీ ఫెడరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఆయా బీసీ సమాఖ్యల్లోని గ్రూపు సభ్యుల సంఖ్యను ఐదుకు పరిమితం చేసింది. ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రయోజనం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే రెండేళ్లలో లక్ష మందికి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం బీసీ ఫెడరేషన్ల ద్వారా అందిస్తున్న రూ.30 లక్షల యూనిట్ల సైజును తగ్గించి చిన్న యూనిట్లు స్థాపించేందుకు విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ఇప్పుడున్న గ్రూపుల్లో 15-30 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో సభ్యుడికి రూ. లక్ష సబ్సిడీ, మరో లక్ష రుణం ఇస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు ఉండటం వల్ల గ్రూపుల్లో సమన్వయం లోపించిందని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గ్రూపులను పునర్నిర్మాణం చేయాలని యోచిస్తున్నారు. ఒక్కో గ్రూప్‌ను ఐదుగురితో ఏర్పాటుచేసి, వారిలో ఒక్కొక్కరికి రూ.లక్ష సబ్సిడీ, లక్ష రుణంగా ఇవ్వాలని భావిస్తున్నారు. రూ.10 లక్షల యూనిట్ అయితే అందరూ కలిపి, లేకపోతే విడి విడిగా యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం కల్పించనున్నారు. స్వయం ఉపాధి యూనిట్లకు ఎక్కువచోట్ల బ్యాంకుల సహకారం అందడం లేదు. ఈ సమస్యను అధిగమించకుండా ఏ చర్యలు తీసుకున్నా ఫలితాలు రావని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బ్యాంకులపై ఆధారపడకుండా ఎన్‌బీసీఎ్‌ఫడీసీ ద్వారా రుణం తీసుకుని.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తక్కువ వడ్డీతో రుణాలివ్వాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులతోపాటు గత ఏడాది ఎన్‌బీసీఎ్‌ఫడీసీ నుంచి రూ.150 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఈ ఏడాది మరో రూ.500 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఇవికాకుండా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) ద్వారా ఫెడరేషన్ల ఎండీలు నిధులు సమీకరించనున్నారు. దీంతోపాటు కార్పొరేట్ సంస్థల నుంచి సీఎ్‌సఆర్ నిధులను సమీకరించడం ద్వారా బీసీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఓఎన్‌జీసీ లాంటి సంస్థలతోపాటు ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నిధులు సమీకరించాలని భావిస్తున్నారు. శాస్త్రీయంగా ఉపాధి యూనిట్ల ఎంపిక బీసీలకు స్వయం ఉపాఽధి యూనిట్ల ఎంపికలో శాస్త్రీయత ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. దుస్తులు ఉతికేందుకు ఆధునిక యంత్రాలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటారు. దోబీఘాట్లను డిజిటలైజ్ చేస్తారు. దోబీఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.60 లక్షల వరకు ఇచ్చేది. ఇకపై ఈ పరిమితిని రూ.10 లక్షలకు పొడిగించనున్నారు. సగర/ఉప్పర కులాల వారికి బుల్‌డోజర్లు, ఎక్సకవేటర్లు, క్రషర్లు వంటి యూనిట్లు ఇస్తారు. సూపర్ మార్కెట్లు, మోడ్రన్ ల్యాండ్రీలు, కిరాణా, ఆటోమొబైల్ షాపులు, సెలూన్‌లు, జేసీబీలు, మిల్లర్లు, ఇటుక తయారీ, టైల్ తయారీ, లేత మెషిన్లు నెలకొల్పేలా ప్రోత్సహించనున్నారు. ఆయా యూనిట్ల నిర్వహణలో లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 ఫెడరేషన్ల ద్వారా 29 వేల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. రజకుల ఫెడరేషన్ ద్వారా 3525 మందికి, నాయీబ్రాహ్మణ 3566, వడ్డెర 2500, ఉప్పర/సగర 2500, బోయి/వాల్మీకి 2500, కృష్ణబలిజ/పూసల 2000, భట్రాజు 1500, మేదర 2000, విశ్వబ్రాహ్మణ 3000, కుమ్మరి/శాలివాహన 3000, కల్లుగీత ఫెడరేషన్ ద్వారా 3500 మందికి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన వారి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంచార జాతుల వారికి ఏ యూనిట్లు మంజూరుచేస్తే స్వయం ఉపాధి కల్పించవచ్చో అధ్యయనం చేస్తున్నారు. SELF ADVT
sonykongara Posted May 21, 2017 Author Posted May 21, 2017 http://www.nandamurifans.com/forum/index.php?/topic/401932-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8225-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8D/
sonykongara Posted May 21, 2017 Author Posted May 21, 2017 వాల్మీకి సహకార సమాఖ్యకు రూ.25 కోట్లుసమాఖ్య ఛైర్మన్ బీటీ నాయుడు వెల్లడి ఈనాడు, అమరావతి: కొత్తగా ఏర్పాటు చేసిన వాల్మీకి/బోయిల సహకార సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించిందని సమాఖ్య ఛైర్మన్ బీటీ నాయుడు తెలిపారు. కొత్తగా నియమితులైన ఛైర్మన్‌తోపాటు సమాఖ్య సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ తనపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయక రాష్ట్రంలోని వాల్మీకి/బోయిల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వాల్మీకి, బోయిలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కులంగా గుర్తించాలన్న విజ్ఞప్తిపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, గాంధీ జయంతి నాటికి తీపి కబురు అందించే వీలుందని నాయుడు వివరించారు.
sonykongara Posted June 8, 2017 Author Posted June 8, 2017 బీసీ సంక్షేమ లబ్ధిదారులకు శుభవార్త రూ.150 కోట్ల ఎన్‌బీసీఎఫ్‌డీసీ సాయం ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకాలకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) నుంచి రూ.150 కోట్ల సాయాన్ని తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. ఈ మేరకు ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంస్థ నుంచి సమ్మతి లేఖను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాల కింద ఏటా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా బ్యాంకర్ల సహకారం లోపించడంతో చాలావరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం తరఫున సబ్సిడీ విడుదలవుతున్నా లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయని పరిస్థితి. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోలా ఎన్‌బీసీఎఫ్‌డీసీ నుంచి ఈ ఏడాది రూ.150 కోట్ల సాయం తీసుకోవాలని నిర్ణయించింది.
sonykongara Posted July 19, 2017 Author Posted July 19, 2017 వాల్మీకులకు 50 కోట్ల రుణాలు19-07-2017 02:16:43 వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ నాయుడు అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): వాల్మీకి ఫెడరేషన్ ద్వారా రూ.50 కోట్ల రుణాలు అందజేయనున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ వాల్మీకులను ఆదుకోలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబు వాల్మీకుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వాల్మీకులకు ఫెడరేషన్ ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల రుణాల్వివడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. రిజిస్టరైన గ్రూపు సభ్యులు ఈ నెలాఖరులోగా www.apobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాల్మీకి జయంతిని జాతీయ స్థాయిలో నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు
sonykongara Posted August 31, 2017 Author Posted August 31, 2017 బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక వివాహానికి 25వేల సాయం ‘ఆదరణ’లో పరికరాలు కాపులకు ఉపకారవేతనాలు సంక్షేమశాఖల సమీక్షలో సీఎం ఈనాడు, అమరావతి: బలహీనవర్గ కుటుంబాలకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించింది. ఇక నుంచి ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు పెళ్లి ఖర్చులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వెల్లడించారు. తన కార్యాలయంలో బీసీ ఫెడరేషన్లు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వీరి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకంలో బలహీనవర్గాలకు అత్యంత అధునాతన పరికరాలను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాపు విద్యార్థులందరికీ బీసీల మాదిరిగానే ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. బీసీ ఫెడరేషన్ నుంచి ఐదుగురి సభ్యులతో కూడిన బృందానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టే ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో జీవో జారీ చేస్తామని, సంక్షేమ పథకాల అమలును తరుచూ సమీక్షిస్తానని అధికారులతో ఆయన అన్నారు. అభివృద్ధి పథకాల అమలులో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు, ఉపకార వేతనాలకు రూ.1,474.75 కోట్లు, వసతి గృహాలకు రూ.845 కోట్లు, బీసీ ఫెడరేషన్లకు రూ.300 కోట్లు, స్వయం ఉపాధికి రూ.5,013.50 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది 8.80 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయిస్తే ఇప్పటివరకు 6,77,976 మంది నమోదు చేయించుకున్నారని, 3.30 లక్షల లక్ష్యంలో ఈబీసీ విద్యార్థులు 2,34,132 మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు రూ.137.25 కోట్లు విడుదల చేశామని, ఆగస్టు 16 వరకు బకాయిల కోసం రూ.76.35 కోట్లు వెచ్చించామని తెలిపారు. బోధన రుసుంల కింద బడ్జెట్‌లో రూ.1,042 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.521 కోట్లు విడుదల చేశామన్నారు. ఈబీసీ విద్యార్థులకు రెండు విడతలుగా రూ.216.37 కోట్లు, పాత బకాయిల కోసం రూ.216.14 కోట్లు ఇచ్చిన విషయాన్ని వివరించారు. నంద్యాల విజయానికి తోడ్పడిన వారికి సన్మానం: మంత్రి అఖిలప్రియ భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా నంద్యాల ప్రజలు మా భాద్యతను మరింత పెంచారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం వెలగపూడిలో ఏపీ సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. విజయానికి తోడ్పడిన నాయకులను నంద్యాలకు ఆహ్వానించి సత్కరించడంతోపాటు, ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.
sonykongara Posted October 4, 2017 Author Posted October 4, 2017 బోయలకు మహర్దశ! రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి రేపు ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు బోయలకు 50% సబ్సిడీతో రుణాలు అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రామాయణ గ్రంథకర్త, మహాకవి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడా నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు వాల్మీకి జయంతి వేడుకలను ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా వాల్మీకి(బోయ) ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రతి సంవత్సరం ఈ జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, అఖిలాంధ్ర వాల్మీకి కులస్తుల తరఫున సీఎం చంద్రబాబుకి అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. వాల్మీకి కులస్తులలో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బోయలను పూర్తిగా ఎస్టీల జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధ్యక్షతన ఒక కమిటీ రాష్ట్రంలో పర్యటించిందని తెలిపారు. వాల్మీకి ఫెడరేషన్ ద్వారా బోయ కులస్తులకు 50% సబ్సిడీతో రుణాలు అందజేస్తున్నామని నాయుడు తెలిపారు. కాగా, రాష్ట్రంలో త్వరలో వాల్మీకి సాంస్కృతిక నిర్వహించనున్నట్లు వాల్మీకి ఫెడరేషన్ ఎండీ నాగభూషణం చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా బోయ విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు అందిస్తామన్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించడం పట్ల మంత్రి కాల్వ శ్రీనివాసులు హర్షం వ్యక్తంచేశారు. తమ వినతిపై వెంటనే స్పందించి ఉత్తర్వులు విడుదల చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు
sonykongara Posted April 29, 2018 Author Posted April 29, 2018 నాయిబ్రాహ్మణ యువతకు రూ.140 కోట్లు29-04-2018 03:37:42 తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 28: నాయి బ్రాహ్మణ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నదని నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పడాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ రూ.140 కోట్లలో రూ.70 కోట్ల మేర సబ్సీడి, 70 కోట్లు బ్యాంకు రుణాలు ఇస్తున్నట్టు వివరించారు. కాగా, పాదయాత్రలో బీసీ కుల సంఘాలతో కుర్చొని టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని చెబుతున్న జగన్ ముందుగా ఆయన తండ్రి చేసిన అన్యాయం చెప్పాలన్నారు. అందుకు బీసీ కులాల వారికి క్షమాపణలు చెప్పి ఆ తరువాత బీసీల గురించి మాట్లాడాలని సూచించారు.
Ruler Posted April 29, 2018 Posted April 29, 2018 Eeee Govt lo anni ... free/pension/ pellikanukalu/reservations lu etc .... anni free gaaa echi OC lalo koodaa reddy luu kammalanu sankanakistharaa enteee ... jaffa CBN ???? chanti149 1
Ruler Posted April 29, 2018 Posted April 29, 2018 (edited) School and college education fees meedhaa control tesukunee raaa mundu.... edee anni kulalkee use auyyeddee.... prajalakee upyogapadee pane cheyyali kani... kulalaa varegaa upyogapadee panulu chestharu ente raa ??? Edited April 29, 2018 by Ruler chanti149 1
Ruler Posted April 29, 2018 Posted April 29, 2018 Malli meetings lo andharu samanam antaru... kani naa bondaa padakam eee kulad vallakee.... naa devasam padakam eee kulam ki... nee pindakoodu nee thaddinam chanti149 1
sonykongara Posted April 29, 2018 Author Posted April 29, 2018 ఇళ్ళ పట్టాలను పంపిణీ చేసిన నారాయణ29-04-2018 17:42:45 నెల్లూరు: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక దేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంస్కరణలు రెవెన్యూశాఖలో తీసుకువచ్చిందని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం నెల్లూరు పట్టణంలో పర్యటించారు. ఇళ్ళ పట్టాల పంపిణీ ఏర్పాటు చేసిన కార్యక్రమాంలో ఆయన పాల్గొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసముంటున్న వారికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలో 6 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సొంత స్థలం లేని పేదవాళ్ళ కొసం రాష్ట్రంలో 6 లక్షల 80వేల ఇళ్ళు నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక నెల్లూరు జిల్లాలో 73వేల ఇళ్ళు, పట్టణంలో 43వేల ఇళ్ళను నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ వివరించారు.
Raaz@NBK Posted April 29, 2018 Posted April 29, 2018 1 hour ago, Ruler said: School and college education fees meedhaa control tesukunee raaa mundu.... edee anni kulalkee use auyyeddee.... prajalakee upyogapadee pane cheyyali kani... kulalaa varegaa upyogapadee panulu chestharu ente raa ??? Okka development ee chesthe votes veyadam ledhu ga uncle Mee lanti vallu.. andhuke ee schemes, 2004 lo CBN vodipovadaniki 2009 lo Malli YSR gelavadaniki ee schemes ee main Reason. Simham 1
Raaz@NBK Posted April 29, 2018 Posted April 29, 2018 1 hour ago, Ruler said: Eeee Govt lo anni ... free/pension/ pellikanukalu/reservations lu etc .... anni free gaaa echi OC lalo koodaa reddy luu kammalanu sankanakistharaa enteee ... jaffa CBN ???? Aa Reddy kammalaki kuda schemes vunnai Jara wait cheyundri ala vuurake noru paresukokunda
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now