Jump to content

Calling trade enthusiasts on BB2


Phoenix456

Recommended Posts

  • Replies 193
  • Created
  • Last Reply
బాహుబలి రెండో పార్ట్‌ ఇప్పుడు సినిమా వ్యాపారంలో పెద్ద సంచలనం. సినీ ట్రేడ్‌ వర్గాల నుంచి సేకరించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఆంధ్రా, సీడెడ్‌ (రాయలసీమ, వగైరా) ఏరియాలకు మాత్రం ముద్దరముడుపుగా అవుట్‌ రైట్‌కు అమ్మేశారట. అయితే, నైజామ్‌ (తెలంగాణ, వగైరా), కర్ణాటక, ఓవర్‌సీస్‌ ఏరియాల్లో మాత్రం అడ్వాన్సులు తీసుకొని, కమిషన్ పద్ధతిలో డిస్ట్రి‌బ్యూషన్‌కి ఇచ్చి, నిర్మాతలే సొంతంగా రిలీజ్‌ చేసుకుంటున్నట్లు భోగట్టా.
 
ఏరియాల వారీగా విడి విడిగా చూస్తే, ఆంధ్రా ఏరియా హక్కుల్ని దాదాపు రూ.50 నుంచి 55 కోట్ల రేంజ్‌లో అమ్మారు. ఇందులో వైజాగ్‌ ఏరియా ఒక్కటే 12 కోట్ల దాకా పలికింది. ఇక, సీడెడ్‌ ఏరియాను 22 కోట్ల దాకా అమ్మారట. ఈ వైజాగ్‌, సీడెడ్‌ ఏరియాలు రెంటినీ వారాహి చలనచిత్రం అధినేత అయిన నిర్మాత, డిస్ట్రి‌బ్యూటర్‌ కొర్రపాటి సాయి అవుట్‌ రైట్‌కు కొన్నారు. అలాగే, కృష్ణా జిల్లా రైట్స్‌ నిర్మాతలతో వ్యాపార ఒప్పందాలు పెట్టుకొని, రూ.9 కోట్లకు ఆయనే కొన్నట్లు చెబుతున్నారు.
 

నైజామ్‌ విషయానికొస్తే... రూ.40 కోట్లపైగా రికవరబుల్‌ అడ్వాన్స్‌ తీసుకొని, తక్కువ కమిషన్ (దాదాపు 4 శాతం) మీద డిస్ట్రి‌బ్యూషన్ పద్ధతిలో నిర్మాతలు సొంతంగా రిలీజ్‌ చేసుకుంటున్నారు. ఫస్ట్‌పార్ట్‌ రిలీజ్‌ టైమ్‌లోనే ఫస్ట్‌పార్ట్‌, సెకండ్‌ పార్ట్‌ రెండూ కలిపి, రూ.28 కోట్లకు ‘మా’ టీవీకి (ఇప్పటి ‘స్టార్‌ మా’ టివి) అమ్మేశారు. రెండు పార్ట్‌లకూ చెరి సగం వేసుకున్నా శాటిలైట్‌ రైట్స్‌ అమ్మకం ద్వారా ఈ రెండో పార్ట్‌ 14 కోట్లు పలికిందనుకోవచ్చు. వెరసి అవుట్‌ రైట్‌ అమ్మకాలు, తీసుకున్న అడ్వాన్సులు, శాటిలైట్‌ రైట్ల లెక్క చూస్తే... బాహుబలి రెండోపార్ట్‌ తెలుగు వెర్షన్ ఒక్కదాని మీదే దాదాపు రూ.175 కోట్ల పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా. (ఇది కాక నిర్మాతలు ఒప్పందాలు కుదుర్చుకొని జాయింట్‌గా రిలీజ్‌ చేసిన చోట్ల అసలైన డబ్బుల లెక్కలు సినిమా రిలీజ్‌ తర్వాత కానీ తేలవు). నిజానికి, బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌ తెలుగు వెర్షన్ వసూళ్ళే... అప్పట్లో కాస్త అటూ ఇటూగా నికరంగా రూ.150 కోట్ల పైగా అని సాంప్రదాయిక ట్రేడ్‌ వర్గాల విశ్లేషణ. అంటే, ఇప్పుడీ రెండో పార్ట్‌ను ప్రతి చోటా మునుపటి వసూళ్ళ కన్నా ఎక్కువ రేట్లకు అమ్మారన్న మాట. పణంగా పెట్టిన ఇంత భారీ మొత్తాన్ని వెనక్కి రాబట్టడం అంత ఈజీ కాదు. కాబట్టే, రెండు తెలుగు రాష్ట్రా‌లతో సహా ప్రతి చోటా ఇప్పుడు అధికారికంగా, అనధికారికంగా బాహుబలి టికెట్‌ రేట్లు పెంచేస్తున్నారు. ప్రదర్శించే షోల సంఖ్యను పెంచేశారు. ఒక్క వైజాగ్‌లోనే హాలులోనే టికెట్లు అయిదొందలు, వెయ్యి రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం. అలా పెట్టిన భారీ పెట్టుబడుల్ని భర్తీ చేసుకోవాలన్నది ప్లాన్. ఇది కాక, బాహుబలి రెండోపార్ట్‌ మలయాళం (6 నుంచి 10 కోట్ల మధ్య అమ్మారట), తమిళ, హిందీ వెర్షన్‌ల వ్యాపారం కూడా చూసుకొంటే, ఈ ప్రాజెక్టుపై మొత్తంగా ఎంత భారీగా వ్యాపారం జరిగిందో ఊహించుకోవచ్చు.

Link to comment
Share on other sites

 

samantha manager oka anaya vunadu le. Prasad labs lo monna chusaru...Ayana aiyhe 1500 anadu ma frnd tho matladithe... 1314 number bavundi.. count9 ani esa anthe :P and ippatiki highest naade avtundi ga :P

 

Inside infoo motham vachesindhi gaa broo neeku! Good going!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...