Jump to content

ప్రత్యేకమంటూ అధిక ధరలకు విక్రయిస్తే కుదరదు


av_rao369

Recommended Posts

 

ఒకే వస్తువు.. ఒకే ధర! 

ప్రత్యేకమంటూ అధిక ధరలకు విక్రయిస్తే కుదరదు 

మల్టీప్లెక్స్‌లు, సినిమాథియేటర్లపై ఆగ్రహం 

ఓ యువకుడి పోరాటం 

 

 హైదరాబాద్‌: వినియోగదారుడి జేబుకు చిల్లులేస్తోన్న మల్టీప్లెక్స్‌లు, థియేటర్లకు చెంపపెట్టు వంటి తీర్పిది. ఒకే పరిమాణం, బ్రాండ్‌, రకానికి చెందిన వస్తువును మార్కెట్‌లో లభించే మొత్తానికి మల్టీప్లెక్స్‌లూ విక్రయిచాలి. లేని పక్షంలో కఠిన చర్యలుంటాయని హైదరాబాద్‌ జిల్లా-1 వినియోగదారుల ఫోరం నగరంలోని మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు, ఇతర వాణిజ్య కేంద్రాలనుద్దేశించి తీర్పు వెలువరించింది.

ఒకే వస్తువుకు రెండు వేర్వేరు ధరలు ఉండటంపై తార్నాక కిమెట్టీ కాలనీకి చెందిన విజయ్‌గోపాల్‌(28) వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. జూన్‌ 25, 2016న విజయ్‌ స్నేహితునితో కలిసి బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1లోని జీవీకే మాల్‌ నాలుగో అంతస్తులో ఉన్న ఐనాక్స్‌ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. అంతకు ముందు అదే మాల్‌లో రూ.20లు వెచ్చించి నీళ్ల సీసా కొన్నారు. ఆ సీసాను థియేటర్‌లోకి సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లనివ్వలేదు. విరామంలో బయటకొచ్చి నీళ్లు తాగాలని ప్రయత్నిస్తే అక్కడున్న కౌంటర్‌లో లీటరు బాటిల్‌ ధర రూ.50గా ఉంది. పలు మల్టీప్లెక్స్‌ల్లోనూ ఇలాంటి దోపిడీయే జరుగుతుందని విజయ్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

చట్టప్రకారం రూ.50లకు.. 

ఐనాక్స్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ను ప్రతివాదిగా చేర్చుతూ విజయ్‌ ఫిర్యాదు చేశారు. వాదనలు వినిపించిన మేనేజర్‌ ‘‘నీటి సీసాలను భద్రత రీత్యా అనుమతించడం లేదు. అధిక ధర విషయానికొస్తే.. వినియోగదారులకు కనిపించేట్లు నీళ్ల సీసా ధరను కౌంటర్‌లో ప్రదర్శించాం. అందులో ఎలాంటి దాపరికం లేదు. ‘ఫర్‌ సేల్‌ ఇన్‌ సెలెక్టెడ్‌ ఛానెల్స్‌’ అనే విభాగం కింద చట్ట ప్రకారం నీళ్ల సీసాను రూ.50లకు విక్రయిస్తున్నాం’’ అని తెలిపారు.

ముమ్మాటికీ అక్రమమే.. 

ఇరువైపులా వాదనలు, ఆధారాలను పరిశీలించిన ఫోరం అధ్యక్షుడు టి.సింహాచలం, సభ్యురాలు లతాకుమారి బహిరంగంగా ఒకే వస్తువుకు రెండు వేర్వేరు ధరలు ముద్రించి అమ్ముతుండటం నేరంగా పరిగణించారు. ఫిర్యాదుదారుకు 40 రోజుల్లో రూ.5 వేల నష్టపరిహారం, రూ.1,000 ఖర్చుల నిమిత్తం చెల్లించాలని తీర్పునిచ్చారు.

ఫోరం ఇచ్చిన ఆదేశాలు.. 

* రూ.20ల నీళ్ల సీసాను మల్లీప్లెక్స్‌లో రూ.50కి విక్రయించడంపై విజయ్‌గోపాల్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి ఇతర మల్టీప్లెక్స్‌లలో జరుగుతోన్న వ్యవహారాన్నీ కదిలించారు. 

* బయటి మార్కెట్‌లో నీటి సీసాలను ఏ ధరకు విక్రయిస్తారో.. థియేటర్లు, మాల్స్‌ లోపల అంతకే అమ్మాలి. 

* సినిమా స్క్రీన్‌కు వెళ్లి, వచ్చే మార్గాలతోపాటు వినియోగదారునికి అనువుగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ ఉచిత మంచినీటి సదుపాయం కల్పించాలి. 

* తీర్పు ప్రతిని జంటనగరాల్లోని అన్ని థియేటర్లకు పంపాలి. వారంతా తీర్పును అనుసరించాలి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...