Jump to content

మంత్రి పదవి ఆశించడం లేదు: బాలకృష్ణ


Ramesh39

Recommended Posts

మంత్రి పదవి ఆశించడం లేదు: బాలకృష్ణ 

7brk105a.jpg

విజయవాడ: మంత్రివర్గ విస్తరణ జరిగితే కేబినెట్‌లో తాను స్థానం ఆశించడం లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తనకు ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి చాలని... లోకేశ్‌ పట్ల అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా ఎవరు మార్చారో ప్రజలందరికీ తెలుసన్నారు.

హిందూపురం అభివృద్ధిపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. హిందూపురం నియోజకవర్గానికి నాలుగు నెలల్లోనే తాగునీటి సమస్యను పరిష్కరించి పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామన్నారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. తన వందో చిత్రం పూర్తయినందున ఇకపై నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...