Jump to content

వేడెక్కిన చీరాల..


Ramesh39

Recommended Posts

వేడెక్కిన చీరాల.. 

ప్రజాప్రతినిధిపై ఆరోపణలతో మాసపత్రికలో కథనం.. 

ఆయన కోసం ఎమ్మెల్యే సోదరుడు, అనుచరుల గాలింపు 

పోలీసుస్టేషన్‌ ఎదుటే వాహనంతో ఢీకొట్టి దాడి 

pks-top1a.jpg

చీరాల అర్బన్‌, చీరాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రజాప్రతినిధిపై ఆరోపణలతో ఒక మాస పత్రికలో కథనం.. దానిపై నేత అనుచరుల్లో తీవ్ర ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు... అనంతరం దానికి కారకుడైన వ్యక్తి కోసం గాలింపు.. కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెంబడించి పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే కారుతో ఢీకొట్టి దాడి.. పోలీసులకు ఫిర్యాదు.. కేసుల నమోదు.. ఆదివారం ఉదయం నుంచి చోటు చేసుకున్న ఈ పరిణామాలతో చీరాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉద్రిక్తత నెలకొంది.

నేపథ్యం ఇదీ.. 

శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌పై ఒక మాసపత్రిక(మట్టిచేతల బాస)లో పలు ఆరోపణలు చేస్తూ నాయుడు నాగార్జునరెడ్డి కథనాన్ని ఇచ్చారు. ఆయనే స్వయంగా చీరాలలో పంపిణీ చేశారు. దీనిపై శాసనసభ్యుడు సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు(స్వాములు) తన అనుచరులతో చీరాల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. తర్వాత అక్కడ కాదంటూ డీఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు.

పాలేటి ఇంట్లో గాలింపు.. రంగంలోకి పోలీసులు 

ఇదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు నాగార్జునరెడ్డి కోసం వెదుకులాట ప్రారంభించారు. మాజీ మంత్రి పాలేటి రామారావు ఇంట్లో ఉంటాడనే ఉద్దేశంతో కొంత మంది ఆయన ఇంట్లోకి ప్రవేశించి గాలించారు. ఈ విషయాన్ని గమనించిన పాలేటి తన ఇంటికి ఎందుకు వచ్చారని వారితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమంచి అనుచరులను అక్కడి నుంచి పంపివేశారు.

వాహనాన్ని ఢీకొట్టి దాడి.. 

పోలీసుల జోక్యంతో ఎమ్మెల్యే సోదరుడు స్వాములు తన అనుచరులతో పాలేటి ఇంటి నుంచి మళ్లీ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు బయలుదేరారు. పోలీసు స్టేషన్‌ సమీపంలో వారికి కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న నాగార్జునరెడ్డి కనిపించారు. దాంతో వారు కారుతో నాగార్జునరెడ్డి వాహనాన్ని ఢీకొట్టి.. అనంతరం అతడిపై దాడి చేశారు. ఘటనలో నాగార్జునరెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే పోలీసులు చేరుకుని బాధితుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే ఫిర్యాదు కోసం అంటూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన స్వాములు ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి నాగార్జునరెడ్డి కోసమే వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదులు.. 

జరిగిన సంఘటనపై పోలీసులకు ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. తనపై ఆమంచి స్వాములు, బండు, రాజేంద్ర, కె.శ్రీను,.శివ, ఎస్‌.రాంబాబు మరికొంత మంది దాడిచేసి హత్య చేయడానికి ప్రయత్నించారని బాధితుడు నాగార్జునరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

* తనను కులం పేరుతో దూషించి దాడి చేయటానికి నాయుడు నాగార్జునరెడ్డి ప్రయత్నించాడని శీలం శ్యాంబాబు అనే వ్యక్తి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాలు కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

* తమ శాసనసభ్యుడిపై అసత్య ఆరోపణలు చేస్తూ నాయుడు నాగార్జున ఒక కథనం రాశాడని, అవాస్తవాలు ప్రచురించిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వేటపాలెం సర్పంచి కర్పూరపు రమాదేవి, మాజీ మండల ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరెడ్డి వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

* నాగార్జునరెడ్డిపై దాడి ఘటనలో స్వాములుతోపాటు 28 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. తన ఆసుపత్రికి వచ్చి భయభ్రాంతులకు గురిచేశారని మాజీ మంత్రి పాలేటి రామారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వాములు, మరికొందరిపై కేసు నమోదైందన్నారు. శీలం శ్యాంబాబు ఫిర్యాదుపై నాగార్జునరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సీసీ కెమెరాల్లో వివరాలు..! 

చీరాలలో చోటుచేసుకున్న పరిణామాలు ఉదయం నుంచి సామాజిక ప్రసారమాధ్యమాల్లో వెల్లువెత్తాయి. ఇదే సమయంలో దాడి ఘటనతోపాటు మాజీ మంత్రి పాలేటి ఇంటిపైకి వెళ్లి గాలింపు.. కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. వీటన్నింటి ఆధారంగానే పోలీసులు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

దాడి జరిగిందని తెలిసింది: ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్యే, చీరాల 

దాడి జరిగిందని తెలిసింది. ఇలాంటి ఘటనలను సమర్థించే ప్రసక్తే లేదు. పాలేటి రామారావు ప్రోద్బలంతో ప్రజాసామ్యవ్యవస్థలో ప్రజలు మాట్లాడలేని భాషతో నాగార్జునరెడ్డి కథనం రాశాడు. ఇతనిపై వేటపాలెం పోలీసుస్టేషనులో ఆరుగురు మహిళలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో తన వద్దకు రావద్దని దూరంగా పెట్టాను. ఆరోజు నుంచి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు.:నాగార్జునరెడ్డి, బాధితుడు 

అవినీతి, అక్రమాలను ఎదుర్కొంటున్నానన్న ఉద్దేశంతో కావాలనే ఆమంచి శ్రీనివాసరావు(స్వాములు), ఆయన కుమారుడు రాజేంద్ర, బంటు, కర్పూరపు శ్రీను, ఎస్‌.రాంబాబు, వాసు, శివ మరికొందరు కలిసి నాపై దాడిచేసి గాయపరిచారు. అయినా నా పోరాటం ఆపను. ఇలాంటి వాటికి భయపడను.

Link to comment
Share on other sites

Asalu ee rowdy batch ni party loki thesukovatame pedha thappu. I wonder why CBN is so silent on this. This guy should not be in TDP. Vadu congress lo unnappudu oka community vallani ni ela ibbadhi pettado chirala lo adigithe cheptharu.

 

CBN should step in and suspend these assholes from party.

 

Party ni brastu pattistunnaru kadhara...chi

Link to comment
Share on other sites

Asalu ee rowdy batch ni party loki thesukovatame pedha thappu. I wonder why CBN is so silent on this. This guy should not be in TDP. Vadu congress lo unnappudu oka community vallani ni ela ibbadhi pettado chirala lo adigithe cheptharu.

 

CBN should step in and suspend these assholes from party.

 

Party ni brastu pattistunnaru kadhara...chi

 

Vadu indipendent ga poti chesi gelichadu

chirala prajalu votelu vesi gelipincharu

Geliche candidates ni vodulu kovatam waste

Link to comment
Share on other sites

Asalu ee rowdy batch ni party loki thesukovatame pedha thappu. I wonder why CBN is so silent on this. This guy should not be in TDP. Vadu congress lo unnappudu oka community vallani ni ela ibbadhi pettado chirala lo adigithe cheptharu.

 

CBN should step in and suspend these assholes from party.

 

Party ni brastu pattistunnaru kadhara...chi

Inthaki amanchi ey community ...and ey community vallani ibandhi petaadu??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...