Jump to content

‘రైతు’లో అమితాబ్‌ బచ్చన్‌ రాష్ట్రపతి పాత్ర


Ramesh39

Recommended Posts

‘రైతు’లో రాష్ట్రపతి? 

23tollywood11b.jpg23tollywood11a.jpg

ప్రస్తుతం తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. మరోవైపు 101వ చిత్రం కోసం కసరత్తులు మొదలెట్టేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్ణ ‘రైతు’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తరవాత ‘రైతు’ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల బాలకృష్ణ, కృష్ణవంశీ... అమితాబ్‌ని కలసి ‘రైతు’ కథ గురించి చర్చించారు. అప్పటి నుంచీ ఈ సినిమాలో బిగ్‌బీ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయంపై తెలుగు చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా చర్చించుకొంటున్నాయి. ‘రైతు’లో అమితాబ్‌ బచ్చన్‌ రాష్ట్రపతి పాత్రలో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతు నాయకుడిగా బాలకృష్ణ రాష్ట్రపతిని కలుసుకొనే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, ఆ పాత్ర కోసమే అమితాబ్‌బచ్చన్‌ని సంప్రదించారని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...