Jump to content

10వేలమంది శత్రువులతో పోరాడిన 21మంది


Ramesh39

Recommended Posts

10వేలమంది శత్రువులతో పోరాడిన 21మంది 

19brk72aa.jpg

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో ఒక్క సేనాని 100మంది సైనికుల్ని అడ్డుకుంటే ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఒక్కడే అంతమందితో ధైర్యంగా పోరాడటం చూసి గొప్పగా భావించారు. అలాంటిది కేవలం 21 మంది 10వేల శత్రుసైన్యంతో వీరోచితంగా పోరాడిన ఓ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. ఆ 21 మంది ఎవరో కాదు.. మన భారతీయ సైనికులే. ఈ సంఘటన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అసలేం జరిగిందో చదవండి..

బ్రిటీష్‌ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలమది. ఈశాన్య తిరాహ్‌ ప్రాంతం(ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో సరగర్హి అనే చిన్న ప్రాంతముంది. ఈ ప్రాంతం అఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ దేశాల సరిహద్దులో ఉన్న లాకర్ట్‌-గులిస్థాన్‌ కోటల మధ్య సమాచార మార్పిడికి అందుబాటులో ఉండేది. అక్కడ 21 మంది సైనికులతో కూడిన 36వ సిక్కు రెజిమెంట్‌ కాపాలాగా ఉండేది. ఆ బృందానికి హవాల్దార్‌ ఇషార్‌ సింగ్‌ నాయకుడు. అఫ్ఘనిస్థాన్‌ అప్పట్లో సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తుండేది. ఈ క్రమంలో 1897 సెప్టెంబర్‌ 12న ఉదయం 9గంటలకు 10వేల మంది సైన్యంతో అఫ్ఘనిస్థాన్‌.. సరగర్హి ప్రాంతంపైకి దండెత్తింది. దీంతో సర్దార్‌ గుర్ముఖ్‌ సింగ్‌ అనే సైనికుడు లాకర్ట్‌ కోటకు సమాచారం అందించాడు. శత్రుసైన్యం సరగర్హి సమీపంలోనే ఉండటంతో ఏమీ చేయలేనని.. బలగాలు రావడానికి చాలా సమయం పడుతుందని నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దాంతో 21మంది సైనికులే శత్రువులతో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

వెంటనే వారు ఏర్పాటు చేసుకున్న గడిలోంచే తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరపడం ప్రారంభించారు. మూడు గంటలపాటు శత్రువులను లోపలకి చొరబడకుండా అడ్డుకోగలిగారు. ఈ పోరాటంలో 180 మందిని హతమార్చి.. చాలా మందిని గాయపరిచారు. ఆ తర్వాత బలగాలు వచ్చి వీరికి తోడుగా ప్రత్యర్థ సైన్యంతో పోరాడాయి. మొత్తం ఈ యుద్ధంలో 600మంది మృతి చెందగా.. వేల మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే 21 మంది వీర జవాన్లు తమ చివరి క్షణం వరకూ పోరాడి అమరులయ్యారు.

వీరి వీరోచిత పోరాటానికి గుర్తుగా బృందంలోని 21మందికీ ఆనాటి అత్యున్నత పురస్కారమైన ‘ఇండియన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ అవార్డును ప్రకటించారు. ఒక బృందంలో ఉన్న సైనికులందరికీ ఈ అవార్డులు దక్కడం ప్రపంచంలోనే అది తొలిసారి. ఇప్పటికీ సెప్టెంబర్‌ 12న ‘సరగిర్హిడే’ పేరుతో ఆ వీరజవాన్లకు నివాళులర్పిస్తూ.. వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు.

ఈ సంఘటనను చిత్రంగా మలిచేందుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ప్రయత్నిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...