sonykongara Posted September 3, 2016 Share Posted September 3, 2016 హేమమాలినికి బాలయ్య సర్ప్రైజ్ హైదరాబాద్: నటి హేమమాలినిని నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ చేశారట. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లో ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ తొలిరోజున బాలకృష్ణ.. హేమమాలినికి తన నియోజకవర్గ ప్రాంతమైన లేపాక్షిలో నేసిన ఓ చీరను బహూకరించి సర్ప్రైజ్ చేసినట్లు సమాచారం. దీన్ని అందుకున్న హేమమాలిని చాలా థ్రిల్ అయ్యారట. ఆ చీరను చూసి బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావుతో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకున్నారట. హేమమాలిని దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రమిది. ఆమె గతంలో నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుతో కలిసి ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణ విజయం’ చిత్రాల్లో నటించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో శ్రియ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్రను హేమమాలిని పోషిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted September 3, 2016 Share Posted September 3, 2016 Nice honour Link to comment Share on other sites More sharing options...
viswanatha Posted September 4, 2016 Share Posted September 4, 2016 super... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.