sonykongara Posted August 30 Author Share Posted August 30 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 8 Author Share Posted September 8 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 14 Author Share Posted September 14 Hyderabad-vijayawada national highway: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ.. గొల్లపూడి వరకు! ఆరు వరుసలుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ విస్తీర్ణం మరింత పెరగనుంది. Updated : 14 Sep 2024 07:05 IST హైదరాబాద్-విజయవాడ రహదారి పనులు మరో 40 కి.మీ. పొడిగింపు కన్సల్టెంట్ల ఎంపికకు ఈ నెల 24 వరకు గడువు ఈనాడు, హైదరాబాద్: ఆరు వరుసలుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ విస్తీర్ణం మరింత పెరగనుంది. తొలుత ఈ రహదారిని హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలనుకున్నా ప్రస్తుతం గొల్లపూడి వరకు పెంచాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. తొలుత దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా 181.5 కిలోమీటర్లకు సవివర నివేదిక (డీపీఆర్) తయారు చేయించాలని ఆదేశాలు జారీచేశారు. తాజాగా గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయించి మరో 40 కిలోమీటర్ల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. దీనికి ఈనెల 24వ తేదీని తుది గడువుగా నిర్ణయిస్తూ తాజాగా టెండర్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆహ్వానించింది. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న 17 ప్రమాదకర ప్రాంతాల (బ్లాక్ స్పాట్స్)ను రూ.325 కోట్లతో చక్కదిద్దే పనులను ఇటీవల జాతీయ రహదారుల సంస్థ చేపట్టింది. ఈ టెండరులో దిద్దుబాటు పనులను మినహాయించినట్లు కేంద్రం ప్రకటించింది. నందిగామ వద్ద నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డు పనులను కూడా ఈ టెండరు పరిధి నుంచి తొలగించింది. జగ్గయ్యపేట నుంచి గొల్లపూడి వైపు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఆరు వరుసలకు విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయని జాతీయ రహదారుల సంస్థ అధికారి ఒకరు శుక్రవారం ‘ఈనాడు’తో చెప్పారు. డీపీఆర్ తయారీ ప్రక్రియకు కన్సల్టెంట్ గుత్తేదారు ఎంపిక ప్రక్రియకు వచ్చే నెల చివరి వారం నుంచి అధ్యయనం చేపట్టాలన్నది ఆలోచనగా ఉన్నట్లు వివరించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 14 Author Share Posted September 14 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 15 Author Share Posted September 15 Ap news: వరదల నివారణకు.. బహుముఖ వ్యూహం అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలకు చిగురుటాకులా వణికిపోయిన విజయవాడ నగరం నెమ్మదిగా తేరుకుంటోంది. ఈ వరదలు అపారనష్టం మిగిల్చినా మనకొక గుణపాఠం నేర్పాయి. Updated : 15 Sep 2024 07:54 IST విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాలి ప్రకాశం బ్యారేజీ ప్రవాహ సామర్థ్యం పెంచాలి బుడమేరు ఆక్రమణలు తొలగించాలి రాజధాని అమరావతి నిర్మాణంలోనే సమగ్ర నీటిపారుదల వ్యవస్థ నిర్మించాలి ఈనాడు - అమరావతి అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలకు చిగురుటాకులా వణికిపోయిన విజయవాడ నగరం నెమ్మదిగా తేరుకుంటోంది. ఈ వరదలు అపారనష్టం మిగిల్చినా మనకొక గుణపాఠం నేర్పాయి. ‘మరక మంచిదే’ అని ఏదో ప్రకటనలో చెప్పినట్టుగా.. లోపాల్ని ఎత్తి చూపి కళ్లు తెరిచేలా చేశాయి. దశాబ్దాలుగా పెను నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. భవిష్యత్తులో ఇంతకు మించిన జల ప్రళయాలు సంభవించినా కూడా.. ఎదుర్కోవడానికి ఎంత సన్నద్ధంగా ఉండాలో చాటిచెప్పాయి. కృష్ణా నదికి ఒక ఒడ్డున ఉన్న విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మరో ఒడ్డున రాజధాని అమరావతి నగర నిర్మాణం వేగంగా జరగబోతోంది. ఈ రెండు నగరాలకు ముంపు సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన రక్షణ కవచం అవసరం. ఓ మాదిరి వర్షానికే విజయవాడలోని వీధులన్నీ కాలువల్లా ప్రవహిస్తుంటాయి. బుడమేరు ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. కృష్ణా నదికి భవిష్యత్తులో భారీ వరదలు పోటెత్తవన్న గ్యారెంటీ లేదు! వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక, సన్నద్ధత కావాలి. యుద్ధప్రాతిపదికన కార్యాచరణకు సిద్ధమవ్వాలి. వీటన్నింటికీ రూ.10 వేల కోట్లు ఖర్చయినా.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావించి చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. అవసరమైతే ప్రపంచబ్యాంకు వంటి సంస్థల రుణ సహకారంతో ఈ ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. 1. వచ్చిన వరద వచ్చినట్లే వెళ్లాలి ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి ప్రవాహ సామర్థ్యం 11.9 లక్షల క్యూసెక్కులు. 2009 అక్టోబరు 5న 10.94 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, ఈ నెల 2న బ్యారేజీ నుంచి రికార్డు స్థాయిలో నాలుగు గంటలపాటు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఒక దశలో 12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలూ జారీ అయ్యాయి. విజయవాడలోని కృష్ణలంక వంటి లోతట్టు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మధ్యలో మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు, కీసర, బుడమేరు వంటి వాగులు వచ్చి కృష్ణా నదిలో కలుస్తాయి. భవిష్యత్‌లో క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడితే వాగులు పొంగి.. ప్రకాశం బ్యారేజీకి ఇప్పటి కంటే ఎక్కువ వరద పోటెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జ్ సామర్థ్యాన్ని కనీసం 15 లక్షల క్యూసెక్కులకు పెంచాలి. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణా నది పొడవు 80 కి.మీ.లకు పైగా ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23వ కి.మీ. వద్ద వైకుంఠపురంలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలి. అది ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తకుండా అడ్డుకోవడంతోపాటు, అక్కడ నిల్వ చేసే నీరు ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. బ్యారేజీకి దిగువన 16 కి.మీ.ల వద్ద చోడవరం సమీపంలో 1.70 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 67 కి.మీ.ల దిగువన బండి కొల్లంక వద్ద 4.70 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలి. 2. అమరావతి రక్షణకు పటిష్ఠమైన కాంక్రీట్ కట్టడం కావాలి ఇటీవల వరదలకు రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం లేకపోయినా.. కృష్ణా కరకట్టకు గండి పడిందని, రాజధాని మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేశారు. కరకట్టకు దుండగులు గండి కొడతారేమోనన్న అనుమానంతో కాపలా పెట్టాల్సి వచ్చింది. అమరావతిలో నివసించేవారికి భవిష్యత్తులో అలాంటి భయాందోళనలు ఉండకూడదు. ప్రకాశం బ్యారేజీ వద్ద 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా.. రాజధానిలోకి చుక్క నీరు ప్రవేశించకుండా, డ్యామ్ కట్టినట్టుగా రాజధాని పొడవునా పటిష్ఠమైన కాంక్రీట్ కట్టడం నిర్మించాలి. కరకట్టను నాలుగు లైన్ల రహదారిగా విస్తరించే ప్రతిపాదన ఉంది. ఎంత వెడల్పుకు విస్తరించినా మట్టికట్ట మట్టికట్టే. ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసేందుకు ఇనుప బోట్లు వదిలిన దుండగులు.. భవిష్యత్తులో కరకట్టను పేల్చేసి రాజధానిని ముంచేసే కుట్రలు చేయరన్న గ్యారంటీ లేదు. అలాంటి దుర్మార్గుల నుంచి రాజధానిని కాపాడేందుకు గట్టి కాంక్రీట్ కట్టడం తప్పనిసరి. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ నగరం కాబట్టి నిర్మాణ దశలోనే అత్యాధునిక మురుగునీరు, వర్షపునీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. కొండవీటివాగుకు మెరుపులా వచ్చే వరదల నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సీడబ్ల్యూసీ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలి. వారు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమైనా పూనుకోవాలి. 3. బుడమేరు ప్రవాహ సామర్థ్యం పెంచాలి బుడమేరు వాగును మొదలైన దగ్గర నుంచి కొల్లేరులో కలిసే వరకు అవసరమైన మేరకు వెడల్పు చేయాలి. వాగులో పూడిక, ప్రవాహ మార్గంలోని అనధికారిక కట్టడాల్ని, ఆక్రమణల్ని తొలగించాలి. వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్ వద్ద బుడమేరు డిశ్చార్జి సామర్థ్యాన్ని ఇప్పుడున్న 6-7 వేల క్యూసెక్కుల నుంచి కనీసం 25 వేల క్యూసెక్కులకు పెంచాలి. బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచాలి. గత ప్రభుత్వం నిలిపివేసిన బుడమేరు విస్తరణ పనుల్ని తక్షణం చేపట్టాలి. భూసేకరణకు అవసరమైన రూ.200 కోట్లను విడుదల చేయాలి. విజయవాడ నగర పరిధిలో బుడమేరు ప్రవాహ మార్గంలో అటూ ఇటూ పటిష్టమైన కరకట్టలు నిర్మించి, నగరానికి ముంపు నుంచి రక్షణ కల్పించాలి హఠాత్తుగా వచ్చే బుడమేరు వరదల్ని అంచనా వేసే వ్యవస్థ లేదు. బుడమేరుపై సీడబ్ల్యూసీ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలి. బుడమేరు క్రాసింగ్స్ వద్ద కొత్త రైల్వే వంతెనల నిర్మాణానికి రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. 4. గ్రేటర్ విజయవాడగా మార్చి, నీటిపారుదల వ్యవస్థలు నిర్మించాలి విజయవాడ పేరుకు నగరమే అయినా కనీస మౌలిక వసతుల్లేకుండా కునారిల్లుతోంది. విజయవాడ కార్పొరేషన్‌తోపాటు దాని చుట్టూ, నగరంలో భాగంగా ఉన్న 15కి పైగా పంచాయతీల్లో కలిపి 30 లక్షలకు పైగా జనాభా ఉంటుంది. శివారు పంచాయతీల్ని కార్పొరేషన్‌లో విలీనం చేసి, గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలి. 30 లక్షల మంది అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ మురుగునీటిపారుదల, వాననీటి పారుదల వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలి. 2015లో తెదేపా ప్రభుత్వం రూ.470 కోట్లతో చేపట్టిన వర్షపు నీటిపారుదల ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపేసింది. దాన్ని ఇంకా మెరుగుపరిచి పూర్తి చేయాలి. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 19 Author Share Posted September 19 https://www.youtube.com/watch?v=JOFUfim9IQ8 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 19 Author Share Posted September 19 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 19 Author Share Posted September 19 https://hospitality.economictimes.indiatimes.com/news/hotels/lemon-tree-hotels-signs-a-new-property-in-vijayawada/113466899 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 19 Author Share Posted September 19 Mobile GOM and narens 2 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 20 Author Share Posted September 20 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 21 Author Share Posted September 21 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 21 Author Share Posted September 21 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 26 Author Share Posted September 26 Mobile GOM 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 28 Author Share Posted September 28 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 29 Author Share Posted September 29 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 29 Author Share Posted September 29 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 30 Author Share Posted September 30 PP SIMHA 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 30 Author Share Posted September 30 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 1 Author Share Posted October 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 1 Author Share Posted October 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 2 Author Share Posted October 2 Budameru: ‘కబ్జా కోరల్లో’ బుడమేరు! విజయవాడ నగర పరిధిలో బుడమేరు వాగు భూములు దాదాపు 80 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిలో చిన్నచిన్న ఇళ్ల మొదలుకొని బహుళ అంతస్తుల భవనాల వరకూ వేల సంఖ్యలో నిర్మించేశారు. Updated : 02 Oct 2024 06:48 IST రూ.800 కోట్ల విలువైన భూముల ఆక్రమణ అక్రమంగా 3,100 భవనాలు కట్టేశారు సర్వేలో వెల్లడైన వాస్తవాలు ఈనాడు, అమరావతి వరదల వేళ బుడమేరు కాలువ ఉగ్రరూపం విజయవాడ నగర పరిధిలో బుడమేరు వాగు భూములు దాదాపు 80 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిలో చిన్నచిన్న ఇళ్ల మొదలుకొని బహుళ అంతస్తుల భవనాల వరకూ వేల సంఖ్యలో నిర్మించేశారు. జక్కంపూడి కాలనీ నుంచి ఎనికేపాడు వరకు ఈ ఆక్రమణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. అంటే ఆక్రమిత స్థలాల విలువ రూ.800 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. గజాల చొప్పున చూస్తే ఈ విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంతే కాదు..గ్రామీణంలోనూ ఆక్రమణలు జరిగాయి. ఆపరేషన్ బుడమేరు దిశగా.. విజయవాడ నగరాన్ని వరదలు ఇటీవల ముంచెత్తిన విషయం తెలిసిందే. నగరంలో సగ భాగం దాదాపు 10 రోజులపాటు జలమయమైంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. భారీగా వర్షాలు పడటంతోపాటు ఊహించని విధంగా వరద ముంచెత్తడంతోపాటు.. బుడమేరు పరిధిలో జరిగిన ఆక్రమణలూ ప్రధాన కారణమే. అందువల్ల ఈ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు రాష్ట్రపురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. ఇందులోభాగంగా విజయవాడ నగరం, గ్రామీణం పరిధిలో బుడమేరు ఆక్రమణలపై కలెక్టర్ సృజన సర్వే చేయించారు. ఆ వివరాలతో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇదీ పరిస్థితి గంపలగూడెం, విస్సన్నపేట ప్రాంతంలో పుట్టి పలు వాగులను కలుపుకొని బుడమేరు ప్రవహిస్తుంది. ఈ నెల 1న అత్యధికంగా వరద రావడంతో బుడమేరు మళ్లింపు కాలువకు పలుచోట్ల గండ్లు పడి గ్రామాలు మునిగిపోయాయి. 40 గ్రామాల మీదుగా ప్రవహించే బుడమేరు పరీవాహక ప్రాంతం జిల్లాలో 2,930 ఎకరాలుగా గుర్తించారు. అయితే ఆక్రమణల కారణంగా బుడమేరు చాలామేరకు కుంచించుకుపోయింది. ఈ కబ్జాల నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ, జలవనరుల శాఖల సిబ్బందితో సర్వే నిర్వహించారు. వారం రోజుల పాటు సర్వే జరిగింది. బుడమేరు వాగు పలుచోట్ల కుంచించుకుపోయింది. నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో 30 మీటర్ల వరకు తగ్గిపోయింది. విజయవాడ గ్రామీణంలో 260 ఎకరాల మేర బుడమేరును ఆక్రమించి సాగు చేస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా ఈ వివరాలు సేకరించారు. ఇదే ప్రాంతంలో 40 ఎకరాల పట్టా భూములు సైతం కబ్జాలకు గురైనట్లు సర్వే బృందం దృష్టికి వచ్చింది. ఇది బుడమేరు విస్తరణకు సేకరించాల్సిన భూమి కావడం గమనార్హం. సింగ్‌నగర్, ఆర్‌ఆర్‌పేట నుంచి ఎనికేపాడు టన్నెల్ వరకు 80 ఎకరాలను కబ్జా చేశారు. బుడమేరు వాగు వెంట.. బుడమేరు భూమిలో 3,100 భవనాలను కట్టేశారు. వీటిలో పదుల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటికి రోడ్లు వేసేందుకు కూడా ఇక్కడి స్థలాలను ఆక్రమించారు. ఇదంతా జరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఒకవైపు బుడమేరు.. మరోవైపు ఏలూరు కాలువలు నిండుగా ప్రవహిస్తూ.. తీసుకోవాల్సిన చర్యలు ఇవీ..! బుడమేరు వాగు వెడల్పు (50 నుంచి 120 మీటర్లు) ప్రామాణికంగా ఉండేలా నిర్ణయించాలి. ఇది అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండేలా చూడాలి. కొన్ని ప్రాంతాల్లో హెయిర్‌పిన్ తరహాలో వంకర్లు తిరిగింది. సరి చేయాలి. బుడమేరుకు సమాంతరంగా పాముల కాలువ నుంచి ఒక వాగు ఉండేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇది కనుమరుగైంది. దీనిని పునరుద్ధరిస్తే.. కొంత వరద దీని ద్వారా వెళుతుంది. దీనిని గుర్తించి పునరుద్ధరించాల్సి ఉంది. బుడమేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ముందుగా ఆక్రమణలను తొలగించి బుడమేరు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు బుడమేరు ఆపరేషన్ చేపట్టనున్నారు. తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి తెలియజేశానని కలెక్టర్ జి.సృజన ‘ఈనాడు’కు చెప్పారు. బుడమేరు పరీవాహక ప్రాంతం: 2,930 ఎకరాలు వాగు వెడల్పు: 50 నుంచి 120 మీటర్లు ఆక్రమణలకు గురైన భూమి: 380 ఎకరాలు సేద్యం చేస్తున్న పొలాలు: 260 ఎకరాలు నిర్మాణాలు జరిపిన విస్తీర్ణం: 80 ఎకరాలు ప్రైవేటు భూమి ఆక్రమణలు: 40 ఎకరాలు భవన నిర్మాణాలు: 3,100 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 2 Author Share Posted October 2 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 2 Author Share Posted October 2 Mobile GOM 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 3 Author Share Posted October 3 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted Monday at 09:00 AM Author Share Posted Monday at 09:00 AM AndhraBullodu 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted Monday at 09:00 AM Author Share Posted Monday at 09:00 AM పై వంతెనపైనే.. మెట్రో వారధి విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు మళ్లీ తెరమీదకు రావడంతో జాతీయ రహదారుల సంస్థ సమన్వయంతో ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. Updated : 07 Oct 2024 07:53 IST భూసేకరణ భారం లేకుండానే నిర్మాణం సుదీర్ఘ పైవంతెన ఆకృతులే కీలకం... మెట్రో, ఎన్‌హెచ్‌ఏఐల సమావేశం నేడు ఈనాడు, అమరావతి మహానాడు జంక్షన్ విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు మళ్లీ తెరమీదకు రావడంతో జాతీయ రహదారుల సంస్థ సమన్వయంతో ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు జాతీయ రహదారుల సంస్థ నిర్మించనున్న సుదీర్ఘ పైవంతెన ఆకృతులు కీలకంగా మారనున్నాయి. ఇందుకు భూసేకరణ అవసరం లేకుండా నిర్మించాలనేది ప్రతిపాదన. అదే మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన ఉండటంతో ముందే ఒక అవగాహనకు రావాలని నిర్ణయించారు. దీనిపై ఏపీ మెట్రో కార్పొరేషన్ అధికారులు, ఇంజినీర్లు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఇంజినీర్లు, రాష్ట్ర రహదారుల సంస్థ అధికారులు, ఇంజినీర్లు సోమవారం సమన్వయ భేటీ నిర్వహించి.. సుదీర్ఘ పైవంతన, మెట్రో కారిడార్ నిర్మాణ ఆకృతులపై చర్చించనున్నారు. భూసేకరణ లేకుండానే..! మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు దాదాపు 6.50 కిలోమీటర్ల సుదీర్ఘ పైవంతెన నిర్మాణం భూసేకరణ భారం లేకుండా చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా విజయవాడకు బైపాస్ నిర్మిస్తున్నారు. కాజా నుంచి చిన్నఅవుటపల్లి వరకు ఆరు వరసల బైపాస్ ఉంటుంది. దీని నిర్మాణం పూర్తయ్యాక గన్నవరం నుంచి కాజా వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారులు భవనాల శాఖకు (జాతీయ రహదారుల విభాగం) అప్పగించనున్నారు. ఇదే ప్రతిపాదన జాతీయ రహదారుల సంస్థ రోడ్లు రవాణా శాఖ ముందుంచగా.. తమకు అప్పగించే ముందు ట్రాఫిక్ రద్దీ మేరకు మార్పులను సూచించింది. ఈమేరకు రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు వద్ద అండర్‌పాస్‌లు లేదా పైవంతెనల నిర్మాణం లేదా సుదీర్ఘ పైవంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. విమానాశ్రయానికి వెళ్లే.. వీఐపీ మార్గం కావడంతో అంతరాయం లేని ట్రాఫిక్ నడిచేలా రూపొందించాలని ప్రతిపాదించారు. ఖర్చు మరింత తగ్గే వీలు.. భూసేకరణ లేకుండా నిర్మించే పైవంతెన మీదనే మెట్రో ప్రాజెక్టు పైవంతెన నిర్మించాలనేది ఓ ప్రతిపాదన. పైవంతెనకు నిర్మించే.. పిల్లర్లను రెండు అంతస్తుల వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. వీటిని మరింత ఎత్తు పెంచి నిర్మించే బాధ్యత మెట్రో సంస్థదే. ముందే గట్టి పునాదులు వేయాలని నిర్ణయించారు. ఇది ఎంత సాధ్యమనేది చర్చించనున్నారు. ఈ తరహాలో నిర్మిస్తే.. ఖర్చు బాగా తగ్గి.. భూసేకరణ పని ఉండదని చెబుతున్నారు. సమన్వయ సమావేశంలో అన్ని అంశాలు చర్చిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. మెట్రో కదలికతో.. గత తెదేపా ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల వరకు వెళ్లింది. తర్వాత ప్రభుత్వం మారడంతో మెట్రో ప్రాజెక్టుకు ఉరేశారు. భూసేకరణనూ గత ప్రభుత్వం ఉపసంహరించింది. తాజాగా కూటమి ప్రభుత్వ రాకతో మెట్రో ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని నియమించారు. విజయవాడలో లైట్ మెట్రోకు మళ్లీ ప్రతిపాదిస్తున్నారు. పీఎన్‌బీఎస్ నుంచి ఒక కారిడార్ ఏలూరు రోడ్డులో, మరో కారిడార్ బందరు రోడ్డులో రానుంది. ప్రస్తుతం సుదీర్ఘ పైవంతెన ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించనుంది. మెట్రో లైనుకు ఆటంకం లేకుండా ఆదిలోనే చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఆరు వరసల పైవంతెనకే మొగ్గు... రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు నగరంలో కలిశాయి. ఇక్కడ రాష్ట్ర కార్యాలయాలూ వెలిశాయి. విమానాశ్రయమూ ఉండడంతో రాకపోకలు ఎక్కువే. ఈమేరకు మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు 6.5 కిమీ మేర పైవంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. అంచనా వ్యయం.. సాధ్యాసాధ్యాలను డీపీఆర్‌లో పొందుపర్చాలి. గత ఆగస్టులోనే డీపీఆర్ టెండర్లను పిలవగా ప్రస్తుతం సవివర ప్రాజెక్టు తయారీలో నిమగ్నమయ్యారు. మహానాడు జంక్షన్ నుంచి రామవరప్పాడు వరకు భూసేకరణకు ఇబ్బంది లేదు. కానీ.. అక్కడి నుంచి నిడమానూరు వరకు కనీసం సర్వీసు రోడ్లు లేక జాతీయ రహదారి కుంచించుకుపోయింది. భవనాలు ఎక్కువగా ఉన్నాయి. భూసేకరణ రూ.కోట్లలో ఉంటుంది. దీంతో భూసేకరణ లేకుండా కనకదుర్గ పైవంతెన తరహాలో ఆరు వరసల పైవంతెన నిర్మించాలనేది ప్రతిపాదన. Mobile GOM 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted Tuesday at 03:01 PM Author Share Posted Tuesday at 03:01 PM Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted Tuesday at 03:02 PM Author Share Posted Tuesday at 03:02 PM Mobile GOM 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted Wednesday at 01:52 PM Author Share Posted Wednesday at 01:52 PM Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now