Jump to content

Manginapudi beach


Recommended Posts

  • 1 month later...
  • 2 months later...
అందమైన లోకముంది.. 
బీచ్‌ పర్యటకానికి పెద్దపీట 
రూ.140 కోట్లతో ప్రతిపాదనలు 
సమగ్ర నివేదిక సమర్పణ 
మచిలీపట్నం, న్యూస్‌టుడే 
amr-gen1a.jpg

మంగినపూడి బీచ్‌ కేంద్రంగా నీటి మీద తేలియాడే రిసార్టు, అమ్యూజ్‌మెంట్‌ పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యటకులకు ఆకట్టుకొనే దిశగా రూ.140 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెరికా టెక్సాస్‌ రాష్ట్రానికి చెందిన హైసీ నావల్‌ ఆర్కిటెక్ట్స్‌ (హెచ్‌ఎస్‌ఎన్‌ఏ) సంస్థ సమగ్ర నివేదిక మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడ)కు సమర్పించింది. ఆ ప్రతిపాదన కార్యాచరణలోకి వచ్చే విధంగా ముడ చర్యలు చేపడుతోంది.

అందరినీ ఆకట్టుకునేలా..: ఆహ్లాదం, ఆనందాలను పంచడమే కాకుండా ప్రధాన ఆదాయవనరుగా ఉండటంతో పాటు విస్తారంగా ఉపాధి అవకాశాలు కల్పించే పర్యటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. నూతన రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజధాని అమరావతికి సమీపంలో ఉండే మంగినపూడి బీచ్‌ పర్యటక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న మచిలీపట్నం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముడ ఆధ్వర్యాన మచిలీపట్నం పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. బందరుకు ఉన్న పర్యటక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మంగినపూడి బీచ్‌ అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టారు. 
* ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన బీచ్‌ ఫెస్టివల్‌కు మచిలీపట్నం చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనంత ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో అమెరికా టెక్సాస్‌లో ఉంటున్న ప్రవాసాంధ్రులకు చెందిన హెచ్‌ఎస్‌ఎన్‌ఏ సంస్థ మంగినపూడి తీరంలో ఉన్న అనుకూలతలతో బీచ్‌ ఆధారిత పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. నీటిమీద తేలియాడే రిసార్టులు, బీచ్‌ తీరంలో ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, రిసార్టులు, తదితరాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెలకొల్పేందుకు సంసిద్థతను తెలిపింది. 
* కానూరు సమీపంలో 16.5 ఎకరాలు, పెదపట్నం వద్ద 8 ఎకరాలు సమకూర్చాలని కోరింది. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు రెండు పాంత్రాల్లో పర్యటించి అక్కడి వనరులు, ఫ్లోటెల్‌ మెరైన్‌ రిసార్టుకు ఉన్న సానుకూలతపై సంతృప్తి వ్యక్తం చేశారు. 
* రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్య పర్యటక కేంద్రంగా రూపుదిద్దుకొనే అవకాశాలను క్రోడీకరించుకున్న సంస్థ అందుకు తగ్గ విధంగా సిద్ధం చేసిన సమగ్ర నివేదికను ముడకు సమర్పించింది. హౌస్‌బోట్లు, రివర్‌ ఫ్రంట్‌ రిసార్టులు, మిని గోల్ఫ్‌ కోర్టు, వాటర్‌ టాక్సీలు, బీచ్‌ ఫ్రంట్‌ రిసార్టులు, జెట్‌ స్కైలు, తదితర అత్యానిధుక వసతులతో కూడిన తమ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇస్తే ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని,  వచ్చే ఏడాది నవంబరు నాటికి పూర్తిచేస్తామని సంస్థ ప్రతినిధులు డీపీఆర్‌ ద్వారా స్పష్టం చేశారు.

amr-gen1b.jpg

కార్యాచరణ దిశగా ముడ 
పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చొరవకు అనుగుణంగా ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు కార్యాచరణ వేగవంతం చేశారు. వీటికి సమాంతరంగా పర్యటక అభివృద్ధి దిశగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. హెచ్‌ఎస్‌ఎన్‌ఏ సంస్థ ప్రతిపాదించిన స్థలాల విషయంలో ముడ వీసీ విల్సన్‌బాబు ఇప్పటికే సర్వే చేయించారు. ఆ సంస్థ కోరిన ప్రభుత్వ భూములు అప్పగించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో, సంస్థ సమర్పించిన డీపీఆర్‌ను ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి రవీంద్ర, ముడ ఛైర్మన్‌ వేదవ్యాస్‌లు పర్యటక ప్రాజెక్టుపై తగు సమాలోచనలు చేసి ఉన్న దృష్ట్యా  త్వరలో బీచ్‌ వేదికగా ఫ్లోటెల్‌ మెరైన్‌ రిసార్ట్సు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల ఏర్పాటు సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...