Jump to content

Recommended Posts

Posted
ఇన్నాళ్లకు వెంకన్న కరుణ!636120406514200267.jpg
  • దుర్గామల్లేశ్వర దేవస్థానానికి టీటీడీ 2.10 ఎకరాల భూమి
  • ప్రతిఫలంగా టీటీడీకి గూడవల్లిలోని భూమి
  • జీవో జారీ చేసిన దేవాదాయశాఖ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఏడేళ్లుగా కుమ్మరిపాలెంలోని రెండెకరాల భూమి కోసం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం చేస్తున్న ప్రయత్నానికి వెంకన్న కరుణ లభించింది. దేవస్థానం ఈవో సూర్యకుమారి కృషితో కుమ్మరిపాలెంలోని టీటీడీకి చెందిన 2.10 ఎకరాల భూమి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానానికి అప్పగిస్తూ, ప్రతిఫలంగా విజయవాడకు సమీపంలోని గూడవల్లిలోని 2.10 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగిస్తూ గురువారం దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ జీవో జారీ చేశారు.
 
 
పట్టి పీడిస్తున్న పార్కింగ్‌ సమస్య
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి పార్కింగ్‌ సమస్య వెంటాడుతోంది. ఆలయ సమీపంలో స్థలాభావం ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయానికి చెందిన కొంతభూమి పోయింది. ఇరుకుగా ఉన్న అర్జున వీధిని విస్తరిస్తున్నారు. దీనికోసం స్థల సేకరణ చేశారు. రాజధానిలో ప్రధాన ఆలయం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి కూడా పెరగనుంది. దీంతో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. మరోవైపు టీటీడీ తరహాలో డిజైనర్‌ బస్సులను దేవస్థానం కొనుగోలు చేయనుంది. ఈ బస్సులకు పార్కింగ్‌ ప్రదేశం కావాలి. డిజైనర్‌ బస్సులను ఘాట్లు, కొండపైకి ఉచితంగా తిప్పేందుకు కూడా సంకల్పించారు. వాస్తవంగా ఏడేళ్ల కిందటే కుమ్మరిపాలెంలోని స్థలాన్ని కోరినా టీటీడీ సాంకేతిక కారణాలను చెబుతూ వచ్చింది. దేవస్థానం ఈవోగా వచ్చిన సూర్యకుమారి లేఖ రాస్తూ ఇబ్బందులను వివరించారు. కుమ్మరిపాలెంలోని స్థలం నిరుపయోగంగా ఉందని, పార్కింగ్‌కు ఇమ్మని కోరారు. ప్రభుత్వం అంగీకారం తెలపడంతో జీవో జారీ చేసింది.
 
 
శ్రీవారి నమూనా ఆలయం, కల్యాణమండపం?
కుమ్మరిపాలెంలోని టీటీడీకి చెందిన 2.10 ఎకరాల భూమిని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి అప్పగించడంతో ప్రత్యామ్నాయంగా గూడవల్లిలో దుర్గామల్లేశరస్వామి దేవస్థానానికి చెందిన 2.10 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగిస్తూ జీవో జారీ చేశారు. టీటీడీ దేవస్థానం ఇక్కడ నమూనా ఆలయం లేదా కల్యాణమండపాన్ని నిర్మించే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. తిరుమల తరహాలోనే ఇక్కడ పూజాదికాలు, ప్రసాదాల పంపిణీలు అన్నీ జరుగుతాయి.
  • 1 month later...
Posted

విద్యుత్ కాంతులలో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి

 

 
 

kanaka-durga-temple-1.jpg

ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్ర‌కీలాద్రి పై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విద్యుత్ కాంతులలో మెరిసిపోతుంది. భవానీ దీక్ష విరమణ ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా మెరిసిపోతుంది.

వయసు తారతమ్యం లేకుండా చిన్నారులు, మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా జ‌గ‌న్మాత దుర్గమ్మ నామ స్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతుంది.

డ్రోన్ కెమేరాతో కొంత మంది నగరానికి చెందిన ఔత్సాహికులు తీసిన ఫోటోలు ఇంద్రకీలాద్రి అందాలను మన ముందు ఉంచాయి.

kanaka-durga-temple-2.jpg

kanaka-durga-temple-3.jpg

kanaka-durga-temple-4.jpg

kanaka-durga-temple-5.jpg

kanaka-durga-temple-6.jpg

kanaka-durga-temple-7.jpg

kanaka-durga-temple-8.jpg

kanaka-durga-temple-9.jpg

 
 
 
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
Posted

రూ.46.92 కోట్లతో ఇంద్రకీలాద్రి పై అభివృద్ధి... దుర్గగుడి సుందరీకరణ దిశగా చర్యలు..

 

 
indrakeeladri-development-27022017.jpg
share.png

నవ్యాంధ్రలో తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై అధికారులు దృష్టిని కేంద్రీకరించారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో రూ. 46.92 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆలయ అధికారులు అంచనాలు రూపొందించారు. పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రకు నూతన రాజధానిగా అమరావతి ఖరారు కావడంతో విజయవాడలోని దుర్గగుడికి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. తిరుమలలో నిత్యం సుమారు 60 వేల మంది కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటుండగా, ఇంద్రకీలాద్రిలో వెలసిన ఆదిశక్తి కనకదుర్గమ్మను దాదాపు 30 వేల మంది వరకు నిత్యం దర్శించుకుంటున్నారు. దీనితో పెరిగిన భక్తులకు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆలయ పరిసరాల అభివృద్ధి తప్పనిసరి అయింది.

ఆలయ అధికారులు పలు దఫాలుగా పరిశీలన జరిపిన అనంతరం తుదిగా అభివృద్ధి పనుల నిధుల అంచనాలను విడుదల చేశారు. శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం అభివృద్ధి ప్రాకార మండపం పునఃనిర్మాణం నిమిత్తం రూ.3.90 కోట్లు, శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కొలనుకొండ నిర్మాణం నిమిత్తం రూ.45 లక్షలు, శ్రీ దుర్గమ్మ వారి దర్శనార్ధమై వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం కుమ్మరిపాలెం సెంటర్లో పార్కింగ్ నిమిత్తం రూ.3.70కోట్లు, దేవాలయంలో పుష్కరిణి నిర్మాణం, పవిత్ర వనముల అభివృద్ధి నిమిత్తం రూ.2 కోట్లు అవసరమని అధికారులు తేల్చారు.

Advertisements

అమ్మవారి దర్శనానికి హై స్పీడు లిఫ్ట్లు

కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం క్రింద ఉండే అడ్మినిస్తేషన్ భవనసముదాయం నుంచి హై స్పీడు లిఫ్ట్లును రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. అర్జున వీధి సుందరీకరణ నిమిత్తం రూ.7.90 కోట్లు, ఘాట్ రోడ్డు సుందరీకరణ నిమిత్తం రూ.3 కోట్లు, ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన, దిగువన జలపాతములకు రూ.3 కోట్లు, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం బంగారం మలాం పనులకు రూ.8.97 కోట్లు, ఇంద్రకీలాద్రి క్షేత్ర ముఖద్వారం సుందరీకరణ పనులకు రూ.1 కోటి, గోశాల నిర్మాణం రూ.2కోట్లు, అన్నప్రసాదాల నిర్మాణం నిమిత్తం రూ.5 కోట్లు ఖర్చుకు నివేదికలు రూపొందించారు. ప్రసాదం పోటు నిర్మాణానికి రూ.3 కోట్లు, శ్రీ కనకదుర్గ అమ్మవారి పురాతన మెట్లు మార్గం పునఃనిర్మాణం నిమిత్తం రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు అంచనాల నివేదికలను అధికారులు తయారు చేసారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాల ఏర్పాటు చేయనున్నారు. గతంలో కొండపై ఉన్న పలు దుకాణాలను, కళ్యాణకట్ట, ఆలయ పరిపాలనా భవనాలను క్రిందికి తరలించడంతో కొండపై విశాలమైన స్థలం అందుబాటులోకి వచ్చింది. దీనితో అధికారులు వేలాదిగా తరలి వచ్చే భక్తుల సదుపాయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, సాధ్యమైనంత త్వరగా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకునేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
Posted
ఇంద్రకీలాద్రిపై కృత్రిమ జలపాతం!
 
 
636315360353535879.jpg
  • దుర్గమ్మ ఆలయ గోశాల వెనుక నిర్మాణం
  • టెండర్లు ఖరారయితే ఐదు నెలల్లో పూర్తి
  • సింగపూర్‌ కన్సల్టెన్సీతో నిర్మాణం
విజయవాడ, మే 27 (ఆంధ్రజ్యోతి): బెజవాడ కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై హోయలొలికే ‘కృత్రిమ జలపాతం’ కనువిందు చేయబోతోంది. ఆలయంలోని అర్జున వీధిలో ఉన్న గోశాల వెనుక వైపు కొండను ఆనుకుని దీనిని ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీని నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. సోమవారం నుంచి టెండర్‌ దరఖాస్తులు ఆలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ జలపాతం నిర్మాణానికి టర్న్‌కీ విధానంలో టెండర్లు పిలుస్తున్నారు. టర్నీకీ విధానంలో కాంట్రాక్టరే డిజైన, ప్లానింగ్‌ తదిరాలన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. టెండర్లు ఖరారయిన తర్వాత ఐదు నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించనున్నారు. ఈ జలపాతం కృత్రిమంగా నిర్మిస్తున్నప్పటికీ చూడడానికీ ఎక్కడా అలా కనిపించకూడదని అధికారులు నిర్ణయించారు. అందుకే గోశాల వెనుక ఉన్న కొండపై నుంచి జాలువారేలా ఏర్పాటు చేయనున్నారు. ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు జలపాతం చుట్టూ అందమైన కళాకృతులతో కూడిన పిల్లర్లను నిర్మించనున్నారు.
ఇప్పటి వరకు సింగపూర్‌లోనే
ప్రపంచంలో ఇంత వరకు సింగపూర్‌లో మాత్రమే కృత్రిమ జలపాతం ఉంది. దాదాపు 120 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. ఇది మానవ నిర్మితమైనప్పటికీ చూడడానికి అచ్చూ ప్రకృతిసిద్ధమైన జలపాతంలా ఉంటుంది. అందువల్ల దానిని నిర్మించిన సంస్థ లేదా ఈ నిర్మాణానికి కన్సల్టెంట్లుగా ఉన్న వారితోనే దుర్గ గుడిలోనూ కృత్రిమ జలపాతం నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...