swas Posted April 11, 2016 Share Posted April 11, 2016 దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏది చేసినా సన్సేషనలే అవుతుంది. చిన్న సినిమాగా స్టార్ట్ చేసినా దాన్ని పెద్ద సినిమాగానే మలుస్తాడు జక్కన్న. ‘మగధీర’ సినిమా తర్వాత చిన్న సినిమా తీద్దామని సునీల్ హీరోగా పెట్టి చేసిన ‘మర్యాదరామన్న’ సినిమా పెద్ద సినిమాగా మారి ఎంతటి సన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ ఇదే ప్లాన్ ని వర్క్ అవుట్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఈ సన్సేషనల్ డైరెక్టర్. ‘బాహుబలి పార్ట్ 2’ తర్వాత ‘గరుడ’ సినిమాను తీసే ఆలోచనలో ఉన్నట్లుగా, దీనికి జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా వెయ్యికోట్ల బడ్జెట్ తో చేస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అదేం ఆలోచనలేదని జక్కన్న వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాపైనే ఫోకస్ ఉందని, ఈ సినిమా తర్వాత షార్ట్ గ్యాప్ లో మరో సినిమా చెయ్యాలన్న ఉద్దేశ్యంతో ఉన్నాడని చెబుతున్నారు. ఆ సినిమా తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తోటే చేస్తున్నాడని, దీనిని ఒక మల్టీస్టార్ చిత్రంగా మలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టినట్లుగా జక్కన్న సన్నిహిత వర్గాలనుంచి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘మాస్టర్ ప్లాన్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ టైటిల్ తో రాజమౌళి పేరిట రిజిస్ట్రేషన్ కూడ జరిగిపోయిందట. ఇందులో ఇంట్రస్టింగ్ ఏంటంటే, ఈసారి తమిళ మార్కెట్ ను గట్టిగా కొట్టాలనుకుంటున్న దర్శకధీరుడు ఈ సినిమాలో మరో హీరోగా ‘సూర్య’ని తీసుకుంటున్నట్లుగా సమాచారం. గతంలో ‘సూర్య’ సినిమా ఆడియో ఫంక్షన్ లో సూర్య జక్కన్న ను ఒక చిన్న క్యారెక్టర్ అయినా మీతో చెయ్యాలని ఉంది అని అడిగిన సంగతి తెలిసిందే. అందుకే, ఇప్పుడు సూర్య జక్కన్నల కలయిక తో సినిమా ఖచ్చితంగా ఉంటుందనేది టాక్. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తోంది. ఇదే గనక జరిగితే జూనియర్ ఎన్టీఆర్, సూర్యల మల్టీస్టారర్ చిత్రం త్వరలోనే తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు యాక్షన్ కి పెట్టింది పేరు. ఇక జక్కన్న సినిమాను ఎలా చెక్కుతాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా స్టార్ట్ అయిన వెంటనే కొన్ని వందల కోట్లలో బిజినెస్ జరుగుతుందని, అటు తమిళంలో, కేరళలో, కన్నడంలో, హిందీలో, ఇటు తెలుగులో మార్కెట్ మనం ఊహించలేమని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా, రాజమౌళి చేసే సినిమా ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని, ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుందని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న తారక్ అభిమానుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. సూర్య, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ఇప్పటినుంచే కథలు అల్లేసుకుంటున్నారు. ‘జక్కన్నా మజాకా’ అని అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో తెగ చెప్పేసుకుంటున్నారు. Link to comment Share on other sites More sharing options...
Sudheer NTR Posted April 12, 2016 Share Posted April 12, 2016 NTR and Surya combination chusanante,,,, Na janma dhanyam... Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted April 12, 2016 Share Posted April 12, 2016 Naa varaku multi lingual languages lo tesey movies ki Maniratnam teesina Raavan best example.... Hindi lo hero- abhishek and villan -Vikram.... Tamil lo reverse.... Tarak and Suriya tho alanti experiment chesthey baga click avvuddi.... Link to comment Share on other sites More sharing options...
avm Posted April 13, 2016 Share Posted April 13, 2016 NTR Surya n Aamir khan are only actors in india who can act both hero n negative roles. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.