Jump to content

Balayya is better than Chiru


Disco King

Recommended Posts

 
http://telugu.greatandhra.com/movies/movie-news/chiru-kanna-balayye-better-emo-70360.html
చిరు కన్నా బాలయ్యే బెటరేమో?April 02 , 2016 | UPDATED 10:59 IST
Balakrishna11459574975.jpg

మెగాస్టార్ చిరంజీవి..నటరత్న బాలకృష్ణ..ఇద్దరికీ రెండు మైల్ స్టోన్ ల్లాంటి సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ విషయంలో బాలయ్యే బెటర్ అనిపించుకునేలా వున్నారు. ఏడాదికి పైగా వార్తల్లో నలుగుతోంది చిరంజీవి 150 వ సినిమా. అసలు ఏ సబ్జెక్ట్ చేయాలన్నదాంట్లో క్లారిటీ లేదు..ఏ డైరక్టర్ అన్నది క్లారిటీ లేదు..ఎవరు సరైన సబ్జెక్ట్ తెస్తే వాళ్లే అన్నారు. 

కానీ ఏ విధమైన సబ్జెక్ట్ చేస్తారో తెలియదు. దాంతో చాలా మంది దర్ళకులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆఖరికి కత్తి సినిమాను రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. నిజానికి అందులో యంగ్ క్యారెక్టర్ కూడా వుంటుంది. మరి ఇప్పుడు దానిని ఏం చేస్తారో తెలియదు.

ఇదిలా వుంటే బాలయ్య చకచకా రెండు స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్నారు.  వందో సినిమాకు, తనకు సూటయ్యే విధంగా రైతు సబ్జెక్ట్ తో ఒకటి, అమరావతి నేపథ్యంలో చారిత్రాత్మిక నేపథ్యంలో మరోటి తీసుకున్నారు. రెండింటికి ఇద్దరు సూటబుల్ డైరక్టర్లను ఆయన ఛూజ్ చేసుకున్నారు. ఆఖరికి ఓ సినిమా ఫైనల్ చేసుకుని, చకచకా ప్రీ షూట్ ఏర్పాట్లుచేసేస్తున్నారు. అంటే ఈ లెక్కన మరో ఆరేడు నెలల్లో బాలయ్య సినిమా రెడీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. కత్తి సినిమా ఇంకా ప్రకటన కూడా రాలేదు. స్క్రిప్ట్ దశలోనే వుంది. మరి ఎప్పుడు ప్రారంభిస్తారో? ఎప్పుడు పూర్తి చేస్తారో?

పోలిటికల్ గా కూడా

రాజకీయం గా కూడా చిరంజీవి కన్నా బాలయ్యే బెటర్ అనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన చిరు ఎన్నాళ్లో అలా వుండలేకపోయారు. దొడ్డి దోవన, కాంగ్రెస్ చలవతో ఎంపీ అయ్యారు. ప్రజలకు ఏమన్నాచేసారా అన్నది ఆయనకే తెలియాలి. ఆయనకంటూ ఇప్పుడు ఓ నియోజకవర్గం లేదు. రాజకీయాలను, సినిమాను, పర్సనల్ వ్యవహారాలను ఒకేసారి ఆయన మేనేజ్ చేయలేకపోయారు. కానీ బాలయ్య అక్కడ ఎమ్మెల్యేగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఇక్కడ సినిమాలు చక్కబెట్టేస్తున్నారు..మరోపక్క ఎన్టీఆర్ ఆసుపత్రి పనులు చూస్తున్నారు. పిల్లలిద్దరికి మంచి సంబంధాలు చూసి మరీ పెళ్లి చేసేసారు.

ఆ విధంగా కూడా బాలయ్య బెటర్ అనిపించేసుకున్నారు. ఇక మిగిలింది ఒక్కటే..బాలయ్య 100 వ సినిమా ఎలా వుంటుందీ? చిరు 150 వ సినిమా ఎలా వుంటుందీ అన్నదే. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...