Jump to content

6000 Crore for Amaravati Government Complex


Recommended Posts

6000 Crore for Amaravati Government Complex 

he Government Offices Complex that will come up in Amaravati is going to cost about 6000 Crore for the state exchequer. All the buildings put together will create 1.5 Crore Square feet of office space. Since there can be more changes to the existing design submitted by Maki and Associates, the construction costs can change. Few Union government office buildings will also come up here and they will be totally borne by them. The construction of the iconic buildings of the Assembly and high court alone will cost 700 Crore. The entire government complex will come up in 900 acres. The government is keen to start the construction of the iconic buildings by May – 2017 and complete it by December – 2018. The rest of the buildings in the government complex will start construction by January-2017. They will be ready by December-2018. Chandrababu Naidu is keen on these deadlines as he wants to go to the elections showing this to people. It has to be seen how the Center will help in this!


 

Link to comment
Share on other sites

అమరావతీ నగర అపురూప శిల్పాలు!

26hyd-panel7a.jpgపాలన..శాసన.. న్యాయం.. ఏరాష్ట్రమైనా.. ఏ దేశమైనా ఈ మూడు వ్యవస్థలూ చాలా కీలకం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతిలోనూ వీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనంత అత్యాధునిక హంగులు.. వసతులతో ఈ మూడు వ్యవస్థల ప్రధాన భవనాలను తీర్చిదిద్దనున్నారు. సచివాలయం.. అసెంబ్లీ.. హైకోర్టులను సర్వాంగ సుందరంగా.. సకల సౌకర్యాలతో నిర్మించనున్నారు. ఈ భవనాలకు సంబంధించి మాకీ అండ్‌ అసోసియేట్స్‌ రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం తాత్కాలికంగా ఎంపిక చేసింది. అవసరం మేరకు ఈ ప్రణాళికలో కొన్ని మార్పులు.. చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో అసెంబ్లీ.. హైకోర్టు.. సచివాలయం ఎలా ఉంటాయో చూడండి మరి! సచివాలయంలో గుమ్మటం ఆకారంలో ఉండే ప్రధాన భవనంలో ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలుంటాయి. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షూట్స్‌, మంత్రులు, సలహాదారుల చాంబర్స్‌ను ప్రతిపాదించారు. కిందిభాగంలో సెక్రెటరీ కార్యాలయాలను రూపొందించారు. ఈ ప్రధాన భవనానికి ఆనుకొని ఉండే కారిడార్స్‌లో పరిశ్రమలు, మౌలికవసతుల కోసం ఒక బ్లాక్‌, స్థానిక సంస్థలతో ముడిపడిన శాఖలన్నింటినీ ఒకచోట, ప్రాథమిక రంగానికి సంబంధించిన శాఖలన్నీ ఒకచోట, సామాజికశాఖలు ఒకచోట ఏర్పాటుచేయనున్నారు. ఈ భవనం బయట కామన్‌ యుటిలిటీస్‌ ఏర్పాటుచేశారు. సచివాలయానికి నాలుగువైపుల నుంచి ప్రవేశద్వారాలు ప్రతిపాదించారు.

* 2574 మంది సచివాలయ సిబ్బంది, 5980 మంది ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల సిబ్బంది, 2659 మంది స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలు, విభాగాల సిబ్బంది ఇక్కడ పని చేసేలా కార్యాలయాలు నిర్మించనున్నారు.

నిర్మిత ప్రాంతం 9 లక్షల చదరపు అడుగులు

విభాగాధిపతుల కార్యాలయాల నిర్మిత ప్రాతం 45 లక్షల చదరపు అడుగులు 26hyd-panel7b.jpg

26hyd-panel7c.jpg

హైకోర్టు 26hyd-panel7d.jpg న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టుకు వచ్చే కక్షిదారులు, ప్రజలకు వేర్వేరు మార్గాలు హైకోర్టులో నిర్మిత ప్రాంతం: 6 లక్షల చదరపు అడుగులు మూడు విభాగాలుగా ఉంటుంది. ఒకటి న్యాయమూర్తులకు, మిగతా రెండు కోర్టు సిబ్బంది, లాయర్లకు ప్రధాన భవనంలో న్యాయస్థానాలు, న్యాయమూర్తుల ఆఫీసులు ఉంటాయి. ఎడమవైపు బ్లాకుల్లో కోర్టు సిబ్బంది కార్యాలయాలుంటాయి. కుడివైపు న్యాయవాదుల కార్యాలయాలుంటాయి. లోక్‌ అదాలత్‌, న్యాయ సేవా ప్రాధికార సంస్థ వంటి ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార వ్యవస్థలకు ప్రత్యేక విభాగం ఉంటుంది. 26hyd-panel7e.jpg

ఆరు నెలల్లో పూర్తిస్థాయి ఆకృతులు అమరావతిలో 900 ఎకరాల పరిధిలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పూర్తిస్థాయి ఆకృతులు (డిజైన్లు) ఆరునెలల్లో తయారవుతాయని ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. ఆయన శనివారం అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం జరిగింది ఆర్కిటెక్చర్‌ ఎంపిక మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వ భవనాల ప్రాంగణానికి సంబంధించిన భావనాత్మక ప్రణాళిక (కాన్సెప్ట్‌ప్లాన్‌)ను మాత్రమే వారు అందించారన్నారు. అన్ని భవనాలకు సంబంధించిన పూర్తిస్థాయి డిజైన్లను ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో పాల్గొన్న మూడు ఆర్కిటెక్చర్‌ సంస్థలు నిర్వహించిన డిజైన్లలో మాకి అండ్‌ అసోసియేట్స్‌ రూపొందించిన డిజైన్‌ను ఆరుగురు సభ్యుల జ్యూరీ ఎంపిక చేసిందన్నారు. 900 ఎకరాల పరిధిలో చేపట్టే మొత్తం భవనాలకు పూర్తిస్థాయి ఆర్కిటెక్చర్‌ డిజైన్లు అందించడానికి ఈ సంస్థ రూ.94 కోట్లకు టెండర్‌ కోట్‌ చేసిందన్నారు. ఈ మొత్తంపై ఆ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఆవిష్కరించిన డిజైన్లు కేవలం కాన్సెప్ట్‌ మాత్రమేనని, వివిధ వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా అందులో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 26hyd-panel7f.jpg

సెంట్రల్‌ హాల్‌ అంటే..! పార్లమెంటులో లోక్‌సభ.. రాజ్యసభల సభ్యులు కలిసి కూర్చోడానికి సెంట్రల్‌ హాల్‌ ఉంటుంది. అమరావతిలో నిర్మించనున్న శాసనసభ సముదాయంలోనూ.. సెంట్రల్‌ హాల్‌ ఉంటుంది. శాసనసభ, శాసనమండలి సభ్యులు కలిసి కూర్చోవడానికి దీన్ని నిర్మిస్తారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సమయంలో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తుంటారు. లేదంటే ప్రత్యేక కార్యక్రమాలను పురస్కరించుకొని ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేసినప్పుడు ఇరుసభల సభ్యులు కలిసి ఇక్కడ కూర్చుంటుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శాసనసభే ఉభయసభల సంయుక్త సమావేశాలకు వేదికగా నిలుస్తోంది.

ప్రపంచ బ్యాంకు రూ.6500 కోట్లు

అమరావతి నిర్మాణానికి ఏడేళ్లలో దాదాపు రూ.70వేల కోట్లు ఖర్చుచేయాల్సిన అవసరముందని ఏపీ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అంచనా వేస్తోంది. ఏటా రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేయాలని భావిస్తోంది. రాజధాని నిర్మాణానికి ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. మూడేళ్లకు రూ.25వేల కోట్లు, మిగతా నాలుగేళ్లకు రూ.45వేల కోట్లు సమీకరించి నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తొలుత ప్రపంచబ్యాంకు నుంచి రూ.6500 కోట్లు రుణంగా తీసుకోనుంది. ఈ రుణం మంజూరు చేసేందుకు ఇప్పటికే ప్రపంచబ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రభుత్వం 30 శాతం నిధులు భరించాలి.. రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్‌ తదితర ప్రభుత్వ పరిపాలన భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దాదాపు రూ.850కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వ పరిపాలన భవనాలను మినహాయిస్తే రాజధాని మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు అవసరమవుతాయి. వరదనీటి కాలువలు, వరద విపత్తు నిర్వహణ ఏర్పాట్లు, రోడ్లు, డ్రైనేజీ, ఘనవ్యర్థాల నిర్వహణ, గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రపంచబ్యాంకు అమరావతి నిర్మాణానికి సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో పురపాలనఅభివృద్ధి పథకం (ఏపీఎండీపీ) కింద పలు తాగునీటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. తాజాగా అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కింద ఒక బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6500కోట్లు) రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 30శాతం నిధులను (రూ.1950 కోట్లు) భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖలు ప్రపంచబ్యాంకు రుణం కోసం పచ్చజెండా వూపాయి. ఈ రుణం మంజూరు కావాలంటే ప్రపంచ బ్యాంకు బోర్డు ఆమోదించాలి. ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని గరిష్ఠంగా 30 ఏళ్లలో తిరిగి చెల్లించేలా సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచబ్యాంకు, సీఆర్‌డీఏ జూన్‌లో ఈ ఒప్పందం చేసుకోనున్నాయి. పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రతిపాదనలు, డీపీఆర్‌లను పరిశీలిస్తూ ప్రపంచ బ్యాంకు ఈ రుణాన్ని విడతల వారీగా ఇస్తుంది.

మిగతా మార్గాలపై అన్వేషణ

మౌలిక సదుపాయాలు, రాజధాని అభివృద్ధి నిర్మాణాలు చేపట్టేందుకు మిగతా ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని తీసుకునే విషయాన్ని సీఆర్‌డీఏ పరిశీలిస్తోంది. రాజధానిలో గృహనిర్మాణం, విద్యుత్తు పనులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హడ్కో, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) రుణాలు మంజూరు చేశాయి. అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం నిధులను జపాన్‌ ఆర్థిక సహకార సంస్థ (జైకా) రుణంగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్ధతుల్లో ప్రాజెక్టులు, జాతీయ పెట్టుబడి సంస్థల నుంచి అవసరమైన నిధుల సమీకరణకు కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రూ.6 వేల కోట్లు

కోటిన్నర చ.అడుగుల నిర్మాణం

హైకోర్టు దక్షిణానికి మార్చే యోచన

అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయంలోని అన్ని భవనాల్లో కలిపి సుమారు కోటిన్నర చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం రాబోతోంది. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి రూ.6 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆకృతులు (డిజైన్ల)లో చేసే మార్పులు, చేర్పులను బట్టి ఈ అంచనాలు మారే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటయ్యే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ సముదాయంలోనే ఉంటాయి. వాటి నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. జపాన్‌కి చెందిన ప్రముఖ భవన నిర్మాణ శిల్పి ఫ్యుమిహికో మకీకి చెందిన మకీ అండ్‌ అసోసియేట్స్‌ సంస్థ రూపొందించిన ఆకృతిని జ్యూరీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఇచ్చిన ‘కాన్సెప్ట్‌ ప్లాన్‌’లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మకీ సంస్థ తమ డిజైన్‌లో హైకోర్టుని శాసనసభకు ఎదురుగా రాజధానికి ఉత్తర దిక్కున సూచించింది. ప్రభుత్వ భవనాల సముదాయాన్ని ఆనుకుని విడిగా న్యాయ నగరం నిర్మించనున్నారు. కాబట్టి హైకోర్టు కూడా దానికి అనుసంధానంగా ఉంటేనే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల దాన్ని దక్షిణ దిక్కుకి మార్చాలని ప్రతిపాదిస్తోంది. వివిధ విభాగాధిపతుల కార్యాలయాలన్నీ ఈ సముదాయంలో ఒక చోటే ప్రతిపాదించారు.మకీ అండ్‌ అసోసియేట్స్‌ రూపొందించిన ఆకృతిని వాళ్లు ఇచ్చింది ఇచ్చినట్టుగా అనుసరించరు. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం మొదలు పెట్టకముందు ఆకృతిపై మరింత విస్తృత కసరత్తు చేయనున్నారు. దేశంలోని ప్రముఖ ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ స్కూళ్లు, ఐఐటీల నుంచి, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. దీనికి నెల రోజుల సమయం తీసుకుంటారు. వాటిలో విలువైన సూచనల్ని మకీ అండ్‌ అసోసియేట్స్‌కు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా ఆకృతుల్లో మార్పులు చేర్పులు చేస్తారు. మకీ అండ్‌ అసోసియేట్స్‌తో త్వరలోనే ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ సమావేశం జరగనుంది. మకీ సంస్థ హైకోర్టు, శాసనసభకు వివరణాత్మక డిజైన్లు రూపొందించడంతో పాటు, మొత్తం ప్రభుత్వ భవనాల సముదాయానికి ‘అర్బన్‌ డిజైన్‌ గైడ్‌లైన్స్‌’ కూడా రూపొందించాలి. రాజధానిలోని ఇతర భవనాల స్వరూపం ఎలా ఉండాలి.వంటి మార్గదర్శకాలన్నీ ఆ సంస్థే అందజేస్తుంది. ఇక్కడే మంత్రుల కోసం 20 బంగళాలు ప్రతిపాదిస్తున్నారు. శాసనమండలి, సభ్యుల కోసం 250 క్వార్టర్లు నిర్మిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తుల కోసం 40 బంగళాలు నిర్మిస్తారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల కోసం 300 క్వార్టర్లు, గెజిటెడ్‌ అధికారుల కోసం 520 క్వార్టర్లు, నాన్‌గెజిటెడ్‌ అధికారుల కోసం 1710, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం 315 క్వార్టర్లు నిర్మించనున్నారు. 26hyd-panel7g.jpg

మకీనే ఎందుకంటే..

రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయానికి సంబంధించి ఉత్తమ ఆకృతిని ఎంపిక చేయడంలో జ్యూరీ గణనీయమైన కసరత్తే చేసింది. నాలుగు ముఖ్యమైన అంశాల్ని దృష్టిలో ఉంచుకుని జపాన్‌ చెందిన మకీ అసోసియేట్స్‌ను ఎంపిక చేసింది. 1. కావాల్సిన స్థలం, 2. తక్కువ సమయంలో భవనాల నిర్మాణం, 3. ప్రభుత్వం ఆశిస్తున్న నీలి-హరిత నగరం, 4. పర్యాటకులను ఆకర్షించేలా భవనాలు ఉండాలన్న సంకల్పం.. వీటిని నెరవేర్చే ఆకృతులను గుర్తించింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణాన్ని 2018 డిసెంబరుకి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు సంస్థలు ఇచ్చిన డిజైన్లలో మకీ అసోసియేట్స్‌ ఇచ్చిన ఆకృతి గడువులోగా పూర్తిచేసేందుకు వీలుగా ఉందని జ్యూరీ అభిప్రాయపడినట్టు సమాచారం. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతానికి అనుగుణంగా డిజైన్లు ఉన్నాయా? లేదా? అన్న విషయాన్నీ చూశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలం కంటే 30 శాతం తక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు జరిగేలా రిచర్డ్‌ రోజర్స్‌ సంస్థ ఇచ్చిన డిజైన్లు ఉన్నట్టు తెలిసింది. ఇక బి.వి.దోషికి చెందిన వాస్తుశిల్ప కన్సల్టెంట్స్‌ ఇచ్చిన ఆకృతి ప్రకారం నిర్మాణాలు చేయడానికి 20 శాతం వరకు స్థలం అదనంగా కావాలని అధికారవర్గాల సమాచారం. మకీ అసోసియేట్స్‌ ఇచ్చిన ఆకృతి ప్రకారం నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలం కంటే కేవలం 2-3 శాతం ఎక్కువ అవసరమవుతుందని తెలిసింది. అందుకే జ్యూరీ అటువైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ప్రభుత్వం రాజధానిని హరిత-నీలి నగరంగా నిర్మించాలని భావిస్తోంది కాబట్టి, ఆ రెండు అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారన్న కోణంలో కూడా జ్యూరీ పరిశీలించింది.

శాసనసభ, హైకోర్టులను ఐకానిక్‌ భవనాలుగా నిర్మించడానికి రూ.700 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ రెండు భవనాలకు సంబంధించిన వివరణాత్మక ఆకృతులను 2017 ఏప్రిల్‌ నాటికి మకీ అసోసియేట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ‘సాధారణంగా జపాన్‌, ఐరోపా దేశాలకు చెందిన ఆర్కిటెక్ట్‌లు ఆకృతుల రూపకల్పనపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ప్రతి చిన్న విషయం ముందే విపులంగా డిజైన్‌ చేస్తారు. దాని వల్ల నిర్మాణ సమయం తగ్గుతుంది’ అని సీఆర్‌డీఏకి చెందిన ఒక అధికారి పేర్కొన్నారు.

-
Link to comment
Share on other sites

CRDA is expecting that Amaravati will cost about 70000 Crore in the next seven years. The basic infrastructure and amenities alone will cost 10000 Crore per year. With the center not being pro-active in helping the state, the government is keen on going loans with several international agencies to fund the project. The government is planning to bring in 25000 Crore in the next three years and another 45000 Crore for the next four years to complete the project. Already the World Bank has agreed to give 6500 Crore to begin the works. According to the Reorganization act, the central government has to totally fund the construction of the government buildings. The state government is mulling the idea of taking the help of HUDCO, Power Finance Corporation. The state is also interested in going for loans from JICA where the payment terms are feasible. It is a very tough task for the state in the next decade to pull off this Mega project. Lets see how they see through!

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...