Jump to content

AP stations in hyd- Opportunity that can't b misd


Recommended Posts

If attorney general says that AP also has equal rights in Hyd, this is definetely an opportunity that should not be missed. AP should go ahead and have police stations at least in some places where settlers are more in number. Water is also being given by AP to the settlers. Let us also protect them. Let TG people know whose high handness is responsible for all these events.

 

This can help us in many ways. It can stop the movement of TDP MLA's in City to TRS. Also, it helps to trouble those MLA's in City who have crossed over to TRS.

 

Infact crossing over of MLA's like Jayasudha can also be delayed to some extent, if this materialises. 

Link to comment
Share on other sites

న్యూఢిల్లీ, జూన్‌ 22 : ఓటుకు నోటు రేవంత్‌రెడ్డి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని గవర్నర్‌ నరసింహన్‌కు అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సూచించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం ఆ అధికారం గవర్నర్‌కు ఉందని అటార్నీ జనరల్‌ చెప్పినట్లు సమాచారం. అలాగే రెండు రాష్ర్టాల పోలీసులకు హైదరాబాద్‌లో అధికారాలు ఉన్నాయని... అంతే కాకుండా రెండు రాష్ర్టాల పోలీసులను నివేదిక కోరే అధికారం గవర్నర్‌కు ఉందని అటార్నీ జనరల్‌ స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది.

 

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్‌ 8ను జోడిస్తూ శాంతిభద్రతల విషయాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు అప్పగిస్తూ సోమవారం అటార్నీ జనరల్‌ సూచించినట్లు తెలియవచ్చింది. అయితే సెక్షన్‌ 8కు సంబంఽధించి తనకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని ఇప్పటివరకు గవర్నర్‌ చెపుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని తెలంగాణ ఏసీబీ అరెస్టు చేయడం, ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని టీ. ప్రభుత్వం భావించడం... ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలుపై ఏపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో స్పందించిన కేంద్రం అటార్నీ జరనల్‌తో ఈ మేరకు గవర్నర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలియవచ్చింది.

 

ఉమ్మడి రాజధాని హైదరబాద్‌లో అధికారాలపై ఏపీ వాదనను అటార్నీ జనరల్‌ పూర్తి స్థాయిలో సమర్థించారు. రెండు రాష్ర్టాల పోలీసులకు ఇక్కడ సమానంగా హక్కులు ఉన్నాయని, జ్యూరిస్‌డిక్షన్‌ కూడా ఇరు రాష్ర్టాలకు సమానంగా ఉంటుందని అటార్నీ జనరల్‌ స్పష్టం చేసినట్లుగా తెలియవచ్చింది. హైదరాబాద్‌లో కూడా ఏపీ పోలీస్‌ స్టేషన్లు పెట్టుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

 

టీఆర్‌ఎస్‌ నేతలు అయితే సెక్షన్‌ 8 చెల్లదని.. ఒక వేళ కేంద్రం అమలు చేస్తే న్యాయపోరాటం చేస్తామని నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డికి సంబంధించిన కేసు పూర్తిగా తెలంగాణకే వదిలివేయకుండా గవర్నర్‌ ఆ ఫైళ్లను పరిశీలించి, దర్యాప్తు కొనసాగించవచ్చునని అటార్నీ జనరల్‌ స్పష్టం చేసినట్లుగా సమాచారం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...