Jump to content

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌరవ్


Theda Singh

Recommended Posts

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌ కోసం జరిగిన వేలం పాటలో అమ్ముడుబోని మాజీ టీమిండియా కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ కలత చెందాడు. ఐపీఎల్‌ నాలుగో సీజన్‌లో ఆడే అవకాశం తనకు లభించలేదనే మనస్తాపంతో బెంగాల్ టైగర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

 

అంతర్జాతీయ సంప్రదాయ టెస్టు, పరిమిత ఓవర్ల వన్డే ఫార్మాట్‌లకు స్వస్తి చెప్పిన సౌరవ్ గంగూలీ, పొట్టి ఓవర్ల ట్వంటీ-20 మ్యాచ్‌లకు సైతం గుడ్‌బై చెప్పేశాడు. 2008లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడిన గంగూలీ, సోమవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి మూడు సీజన్లలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున సౌరవ్ గంగూలీ ఆడాడు. అయితే ఐపీఎల్ నాలుగో సీజన్‌ వేలం పాటలో ఫ్రాంచైజీలు దాదాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో మనస్తాపం చెందిన సౌరవ్ గంగూలీ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. కాగా, 2010లో ముంబై ఇండియన్స్‌తో సౌరవ్ గంగూలీ చివరి ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడాడు.

 

We miss you Ganguly

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...