Jump to content

goldenstar

Members
  • Posts

    5,462
  • Joined

  • Last visited

  • Days Won

    2

Posts posted by goldenstar

  1. సంక్రాంతికి ఒకేసారి వస్తున్నాయి చిరు..బాలయ్య సినిమాలు. వీటి ప్రచారం విషయంలో నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సినిమా నుంచి ఓ వీడియో వదిలితే ఆ సినిమా నుంచి ఓ పోస్టర్. ఇక్కడ ఓ పాట వదిలితే అక్కడ మరో పాట. ఇలా అంతా ప్లాన్డ్ గా పక్కాగా వదులుతున్నారు. కానీ వదలడం వరకే యూనిట్ బాద్యత. ఆ తరువాత రీచ్ అన్నది డిజిటల్ మార్కెటింగ్ అన్నది వేరే వ్యవహారం. 

    ఈ విషయంలో మెగా టీమ్..మెగా ఫ్యాన్స్ చాలా జోష్ తో కంటెంట్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. బాలయ్యకు ఫ్యాన్ బేస్ తక్కువ అని కాదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్ కన్నా వెనుక బడినట్లు కనిపిస్తోంది. లేదా యూనిట్ ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

     
    బాలయ్య ‘వీరసింహారెడ్డి’ పాటలు రెండు వచ్చాయి. కంటెంట్ ఏదో ఒకటి వస్తోంది. కానీ మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా ఇటు యూనిట్ డిజిటల్ మీడియా కానీ, అటు ఫ్యాన్స్ కానీ దాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకుపోతున్నారు. 

    మెగాస్టార్ వైపు నుంచి ఆయన స్వంత పీఆర్ టీమ్, అభిమానులు కూడా దీని కోసం తెరవెనుక గట్టిగా పని చేస్తున్నారు. ఈ సినిమాను మెగాస్టార్ స్వంత పీఆర్ టీమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వర్క్ చేస్తోంది. అలాగే రవితేజ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. మెగా ఫ్యాన్స్ ఇటీవలే నిర్మాతలతో సమావేశమై తగిన సూచనలు చేసారు. వెంటనే జాగ్రత్త పడ్డారు.


    బాలయ్యకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా మంది వున్నారు. థియేటర్లు దద్దరిల్లేలా పిచ్చ హడావుడి చేస్తారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ రేంజ్ కనిపించడం లేదు. రోజు రోజుకు సోషల్ మీడియా లో బాలయ్య కు భజ్ తెచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది.

    బాలయ్య ఫాన్స్ దృష్టి పెట్టకపోతే పండగ సినిమాల పబ్లిసిటీ విషయంలో బాలయ్య వెనుక పడిపోతారు. 2019 లో టీడీపీ సోషల్ మీడియా 
    విఫలం టీడీపీ విజయావకాశాలు ఎలా దిబ్బతిసాయో, ఆలా కాకుండా బాలయ్య ఫ్యాన్స్ జాగ్రత్త పడతారు అని ఆశిద్దాం... Copied from webzine

×
×
  • Create New...