Jump to content

కోస్తాంధ్రపై ‘పెథాయ్’ తుపాన్ పంజా..


sonykongara

Recommended Posts

తూ.గో. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు: కార్తికేయ
17-12-2018 17:27:45
 
636806644661817569.jpg
తూ.గో.జిల్లా: పెథాయ్ తుపాన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. జరిగిన నష్టం అంచనా వేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈదురు గాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేశామని.. కాసేపట్లో పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. సఖినేటి పల్లి నుంచి ముమ్మడివరం, అంతర్వేది వరకు కొంచెం తుపాన్ ప్రభావం కనిపించిందన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 178 రిలీఫ్ సెంటర్స్ నడిపిస్తున్నామని, 28వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వారికి భోజన సదుపాయాలు కల్పించినట్లు కార్తికేయ చెప్పారు. వృద్ధులకు మెడికల్ క్యాంప్‌లు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
 
పెథాయ్‌ తుపాను కాకినాడ- యానం మధ్య తీరం దాటింది. దీంతో కాకినాడలో భారీ వర్షం పడుతోంది. మరో రెండు గంటల్లో తుపాను ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంట‌కు 80 కిలోమీటర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. సాయంత్రానికి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 15 కిలోమీటర్ల వేగంతో పెథాయ్‌ తుపాను కదులుతోంది. సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు.
Link to comment
Share on other sites

  • Replies 118
  • Created
  • Last Reply
క్రమంగా బలహీనపడుతున్న పెథాయ్‌ తుపాను
17-12-2018 15:46:05
 
636806587179478102.jpg
కాకినాడ: పెథాయ్‌ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. కాకినాడ-యానాం మధ్య తుపాను పూర్తిగా తీరం దాటింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒడిశా వైపు పెథాయ్‌ తుపాను పయనిస్తోంది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నందున సోమవారం ఉదయం నుంచి క్రమేపీ బలహీనపడి, సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, యానాం-తుని మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణులు ముందుగానే అంచనా వేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి లేదా మంగళవారానికి తుఫాన్‌ బలహీనపడుతుందని చెప్పారు. దీని ప్రభావంతో సోమవారం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని అక్కడక్కడ 20సెం.మీ. మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, భీమునిపట్నం ఓడరేవులో ఏడు, విశాఖపట్నం, గంగవరంలో ఆరు, మచిలీపట్నం, నిజాంపట్నంలో ఐదో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.
Link to comment
Share on other sites

ఒడిశా వైపు పెథాయ్ వెళ్తుండటంతో జిల్లాకు కొంత ఉపశమనం’
17-12-2018 17:38:36
 
ఏలూరు: ఒడిశా వైపు పెథాయ్ వెళ్తుండటంతో జిల్లాకు కొంత ఉపశమనం దొరికిందని కలెక్టర్‌ భాస్కర్‌ అన్నారు. తుఫాన్ తీవ్రత వల్ల జిల్లాలో రోడ్లకు ఎటువంటి నష్టం కలుగలేదని, కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతరాయం కలగడంతో వెంటనే పునరుద్ధరించామని ఆయన తెలిపారు. సెల్‌ఫోన్ టవర్స్ కూడా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆచంట, పాలకొల్లు, పోడూరు, పెనుగొండ మండలాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని కలెక్టర్‌ తెలిపారు. తుపాను తీరం దాటినా కొన్ని గంటలు జాగ్రత్తగా ఉండాలని భాస్కర్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

పెథాయ్‌ ప్రభావం.. స్తంభించిన రవాణా వ్యవస్థ

033216ROAD001.jpg

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన తుపాను మధ్యాహ్నం 3.30గంటల సమయంలో కాకినాడ-యానం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచే ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుపాను ప్రభావంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని చోట్ల బస్సులు, రైళ్లు, విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలు, గాలుల తాకిడికి పలుచోట్ల సెల్‌టవర్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రద్దైన రైళ్ల వివరాలివే: విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే జన్మభూమి, రత్నాచల్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు సహా 47 ప్యాసింజర్‌ రైళ్లను అధికారులు రద్దు చేశారు. రద్దైన రైళ్ల వివరాలు.. రైలు నెంబరు 67243 కాకినాడ పోర్టు-విశాఖ, 57225 విజయవాడ-విశాఖ ప్యాసింజర్‌, 57226 విశాఖ-విజయవాడ ప్యాసింజర్‌, 67295 రాజమహేంద్రవరం-విశాఖ ప్యాసింజర్‌, 67247 రావికంపాడు-విశాఖ ప్యాసింజర్‌, 67296 విశాఖ-రాజమహేంద్రవరం ప్యాసింజర్‌ రైళ్లతో పాటు మరికొన్నింటిని అధికారులు రద్దు చేశారు.

033231ROAD002.jpg

విశాఖ విమానాశ్రయంలో 750 మంది ప్రయాణికుల నిరీక్షణ: తుపాను ప్రభావంతో విశాఖలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖకు రావాల్సిన మొత్తం 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 750 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వీరికి ఆయా విమానయాన సంస్థలు మంచినీరు, ఆహార ఏర్పాట్లు చేశాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని విమానాలను హైదరాబాద్‌కు మళ్లించారు. అయితే ఉదయం రెండు విమానాలను విశాఖ నుంచి దిశను మార్చుకుని పంపినప్పటికీ.. గాలుల తీవ్రత పెరగడంతో ఆ తర్వాత సాధ్యపడలేదు.

033248ROAD003.jpg

పలుచోట్ల కూలిన చెట్లు: పెథాయ్‌ తుపాను ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో రోడ్లపై చెట్లు కూలిపోయాయి. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో రోడ్లపై కూలిన చెట్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఐదురోడ్ల కూడలి వద్ద చెట్లు కూలడంతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రజాజీవనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అనకాపల్లి - తుని మధ్య రాకపోకలపై ఆంక్షలు పెట్టినట్టు విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.

 

భీమిలి నియోజకవర్గంలో పలు మత్స్యకార గ్రామాలను మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించారు. కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో గాలులతో కూడిన వర్షాల కురుస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, అనంతగిరి మండలాల్లో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు స్థానికంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి కిడారి శ్రవణ్‌ ఆదేశించారు. తుపాను తీరం దాటే వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 
Link to comment
Share on other sites

6 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది... ఆర్టీసీ సాయంత్రం నుంచి పునరుద్దరిస్తాం... ముందస్తు చర్యల్లో భాగంగా 96 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలివేసాం..రాత్రి విద్యుత్ సరఫరా ను పునరుద్దరిస్తాం...

Link to comment
Share on other sites

రవాణాకు మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి #CyclonePhethai వలన రాజోలు లో రోడ్డు కు అడ్డంగా పడిన చెట్లను వెంటనే స్పందించి తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది .

DundsQMVYAAkk1u.jpg
DundsRBV4AIj_H-.jpg
DundsRJUcAAXb3B.jpg
DundsQRUwAE0bYe.jpg
Link to comment
Share on other sites

కోస్తాలో పెథాయ్ బీభత్సం.. సీఎం పర్యటన రద్దు
17-12-2018 17:48:27
 
636806657609750160.jpg
 
విశాఖ/అమరావతి: కోస్తాంధ్రలో పెథాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం, ఈదురుగాలులతో పెథాయ్ విరుచుకుపడుతోంది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మరోవైపు చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే దట్టమైన మబ్బులతో చీకటి అలుముకుంది. పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 
 
విమాన రాకపోకలకు అంతరాయం
పెథాయ్ తుపాను ప్రభావంతో విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు కూడా ఏటీసీ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో నేటి విశాఖ పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు. భూపాల్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అమరావతి వెళ్లిపోనున్నారు. అక్కడి నుంచే పెథాయ్ తుపాను ప్రభావంపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రేపు(మంగళవారం) కాకినాడ, విశాఖలో సీఎం పర్యటించనున్నారు.
Link to comment
Share on other sites

విజయనగరం జిల్లాలో తీవ్రంగా తుపాను ప్రభావం
17-12-2018 19:16:29
 
636806709903354118.jpg
విజయనగరం: జిల్లాలో పెథాయ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. భారీ ఈదురు గాలులు భయాందో్ళనలు కలిగిస్తున్నాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చింతపల్లి బీచ్ వద్ద సముద్రం 50 అడుగులు ముందుకు చొచ్చుకువచ్చింది. ఎప్పుడు మత్స్యకారులు, పర్యాటకులతో కళకళలాడే సాగర తీరం వెలవెలబోతోంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. సముద్ర ఒడ్డుకు ఎవరూ రాకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. తుపాను తాకిడికి రైతులు విలవిల్లాడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో పెథాన్ తుపాను తమ పొట్ట కొడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్వతీపురం, సాలూరులో అరటి చెట్లు నేలకూలాయి. మన్యం ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి.
Link to comment
Share on other sites

తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు
17-12-2018 19:25:02
 
636806715033496040.jpg
విశాఖ: కోస్తా జిల్లాలను వణికించిన పెథాన్ తుఫాన్ కాకినాడ-యానం మధ్య పూర్తిగా తీరం దాటింది. దీని ప్రభావంతో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల ఇప్పటికే చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. ప్రస్తుతం ఒడిషా వైపు పయనిస్తున్న తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. పెథాయ్ ప్రభావంతో తూ.గో. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపేట, రావెలపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. అరటితోటలు నేలకొరిగాయి. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో రవాణాను ఆర్టీసీ నిలిపివేసింది. ఈదురు గాలులు బలంగా వీస్తుండడంతో నివాసితులు ఇళ్లకే పరిమితమయ్యారు.
Link to comment
Share on other sites

ఫలించిన సన్నద్ధత   

 

ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు పర్యవేక్షణ

పెథాయ్‌ తుపాను కారణంగా విద్యుత్తుపరంగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా 1912 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేయాలని ఈపీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌.వై.దొర సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.

ఈనాడు, అమరావతి: పెథాయ్‌ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన సన్నద్ధత చర్యలు నష్ట తీవ్రతను తగ్గించడానికి అవకాశం చిక్కింది. ఇందులోభాగంగానే ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి గ్రామస్థాయి ఉద్యోగుల వరకూ పటిష్ట కార్యాచరణతో వ్యవహరించారు. అత్యంత వేగంగా సహాయక చర్యలు అందించగలిగారు. ప్రభుత్వం మొత్తం 15 మంది మంత్రులను క్షేత్రస్థాయిలో రంగంలోకి దించింది. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండగా... పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తుపాను తీరాన్ని తాకిన కాట్రేనికోనకు చేరుకుని పరిస్థితిని  పర్యవేక్షించారు. మొన్న హుద్‌హుద్‌, నిన్న తిత్లీ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభావిత జిల్లాల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.

ఎప్పటికప్పుడు రంగంలోకి బృందాలు 
గాలులకు పడిపోయిన విద్యుత్తు స్తంభాల స్థానే కొత్తవి ఏర్పాటు చేయడానికి...వృక్షాలు తొలగించడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. తద్వారా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సరఫరాను పునరుద్ధరించగలిగారు. తూర్పుగోదావరి జిల్లాలో 99 గ్రామాల్లో, కాకినాడ నగరంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచే సరఫరాను ఇవ్వగలిగారు.

పునరావాస కేంద్రాల్లో భోజన ఏర్పాట్లు 
రాష్ట్ర వ్యాప్తంగా 533 పునరావాస కేంద్రాల్లో 57,892 మందికి బసలు ఏర్పాటు చేసి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు-కాట్రేనికోన మధ్య తుపాను తీరాన్ని తాకుతుందన్న సమాచారం మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు 295 గ్రామాల నుంచి 23 వేల మందిని తరలించారు. హెచ్చరికలకు ముందే వేటకు వెళ్లి సముద్రంలో ఉన్న 386 మంది జాలర్లను తిరిగి వెనక్కి రప్పించగలిగారు.

48 మంది ప్రత్యేకాధికారులు 
ప్రభావిత ప్రాంతాలకు 48 మంది ప్రత్యేకాధికారులను నియమించారు. సోమవారమే తమకు బాధ్యతలు అప్పగించిన మండలాలకు వారు చేరుకోవాలని సూచించగా పలువురు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణకు 15 శాఖలకు చెందిన ఉన్నతాధికారులను నియమించింది. ఆర్టీజీఎస్‌ సీఈవో వీరిని సమన్వయం చేసుకుంటూ సహాయచర్యల తీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.  కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని పలు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

2 రోజుల్లో నష్టాలు నమోదు.. 3 రోజుల్లో పరిహారం 
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆర్టీజీఎస్‌ రెండు యాప్‌లను అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాల్ని నమోదు చేసేందుకు అధికారులకు ఒక యాప్‌, తమకు జరిగిన నష్టాల్ని ప్రజలే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మరో యాప్‌ను సిద్ధం చేసింది. దీని వల్ల కేవలం రెండురోజుల వ్యవధిలోనే నష్టాలను లెక్కించి...మూడు రోజుల వ్యవధిలో పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ యాప్‌ల్లో పలువురు తమ నష్టాల వివరాలను ఇప్పటికే నమోదు చేసుకున్నారు.  ప్రత్యేక డ్యాష్‌బోర్డును కూడా ఏర్పాటు చేశారు.

 

Link to comment
Share on other sites

పెథాయ్‌ విలయం   

 

బలహీనపడినా.. బలమైన దెబ్బే 
తుపాను ధాటికి భారీగా పంట నష్టం 
పడిపోయిన విద్యుత్తు స్తంభాలు 
రోడ్లపై కూలిన వృక్షాలు 
297 మొబైల్‌ టవర్లకు నష్టం 

ఈనాడు - అమరావతి

17ap-main1a_2.jpg

నాలుగు రోజులనుంచి తీర ప్రాంతాన్ని వణికించిన పెథాయ్‌.. విలయాన్ని సృష్టిస్తూనే వెళ్లిపోయింది. క్రమంగా బలహీన పడుతూ యానాం- కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. లక్షల ఎకరాల పంటను ముంచేశాయి. గాలులతో కూడిన వర్ష బీభత్సం మత్స్యకారులకు కునుకులేకుండా చేసింది. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ జిల్లాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాయి. రహదారులు దెబ్బతిని ప్రజారవాణాపై తీవ్ర ప్రభావం కనిపించింది. గంటకు 80 కి.మీ.నుంచి 100 కి.మీ.వేగంతో వీచిన గాలులు విద్యుత్తు స్తంభాలను నేలకూల్చాయి. అధికార యంత్రాంగం ముందే సన్నద్ధం కావడం కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించింది. యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయ చర్యలు బాధితులకు ఊరటనిచ్చాయి. సోమవారం రాజస్థాన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడినుంచి కూడా సహాయ చర్యలపై సమీక్షించారు.

తీరం దాటే సమయంలో పెథాయ్‌ బలహీనపడినా.. ఈదురు గాలులు, భారీవర్షాలతో తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విద్యుత్తు స్తంభాలు, కొబ్బరి చెట్లను నేలకూల్చాయి. సుమారు 700 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మెట్ట, మాగాణి పంటలు నీట మునిగాయి. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడగా.. అక్కడక్కడా సముద్రం 10 నుంచి 50 అడుగులు ముందుకొచ్చింది. ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తింది. అధికార యంత్రాంగం ముందే సన్నద్ధం కావడంతో కొంత వరకు నష్ట తీవ్రత తగ్గింది. మరోవైపు..రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులకు 23 మంది మృతిచెందారు. జిల్లాల నుంచి అందుతున్న ప్రాథమిక అంచనాల ప్రకారం 3.87 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 
* భారీ వర్షాలకు విజయవాడ క్రీస్తురాజపురంలో కొండరాళ్లు మీదపడి ఒకరు చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో గోడ కూలి ఒకరు మరణించారు.

17ap-main1b_2.jpg

సముద్రంలోనే 11 మంది 

* కాకినాడలోని దుమ్ములపేటకు చెందిన బోటు నాలుగు రోజుల కిందట సముద్రంలో వేటకు వెళ్లి సాంకేతిక లోపంతో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తుపాను తీవ్రత కాకినాడ నగరంపై ఎక్కువగా ఉంటుందనే సమాచారంతో పడవలో ఉన్న ఆరుగురు మత్స్యకారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. వీరిని రక్షించాలంటూ మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. 
*  విశాఖ జిల్లాకు చెందిన అయిదుగురు మత్స్యకారులు కాకినాడ నుంచి వేటకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తీరానికి 30 మైళ్ల దూరంలో ఉన్నామని, త్వరలోనే చేరుకుంటామని ఆదివారం వీరు బంధువులకు ఫోన్‌ చేశారు. ఆ తరువాత నుంచి ఎలాంటి సమాచారం లేదు. 
* ఉప్పలంక, కోరంగి, జగన్నాథపురం వంతెన, పరదేశిపేట, గోళీలపేట ప్రాంతాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలో చిక్కుకున్న మరో పడవ అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం ప్రాంతంలోని సీతారాంపురం రేవుకు చేరుకోవడంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. 
* విజయనగరం జిల్లాలో చేపల కంచేరులో లంగరేసిన అయిదు పడవలు గల్లంతయ్యాయి. అక్కడే మరో 14 పడవలు దెబ్బతిన్నాయి. ముక్కావులో ఒక పడవ, తిప్పలవలసలో నాలుగు పడవలు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లింది. పెథాయ్‌ తీరం దాటే సమయంలో కోనాడ, ముక్కాం, తిప్పలవలస, చింతపల్లి తీరప్రాంత మండలాల్లో ఇసుక తుపాను రేగింది.

17ap-main1c_1.jpg

తూర్పుగోదావరి జిల్లాకే తాకిడి 
పెథాయ్‌ తుపాను తూర్పుగోదావరి జిల్లాను రెండు గంటలపాటు వణికించింది. కాకినాడ నగరంతోపాటు తాళ్లరేవు, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, ఉప్పాడ కొత్తపల్లి, ఐ.పోలవరం, అల్లవరం, సఖినేటిపల్లి, మామిడికుదురు, తొండంగి తదితర తీర ప్రాంత మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. 
* జిల్లాలోని 50 ప్రాంతాల్లో చెట్లు కూలి రహదారులపై రాకపోకలు స్తంభించాయి.  ప్రత్యేక బృందాలు.. జేసీబీలు, క్రేన్లతో వీటిని తొలగించి రాకపోకలు పునరుద్ధరించాయి. రాజోలు మండలంలోని చింతపల్లి గ్రామంలో యూపీ పాఠశాలపై కొబ్బరిచెట్టు పడింది. శివకోటి గ్రామంలో ప్రహరీపై చెట్టు కూలింది. భారీ వర్షానికి ముమ్మిడివరంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం విరిగింది. నాలుగు పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. 
* ఈ నెల 19 నుంచి వరద ప్రభావం కనిపిస్తుందన్న అంచనాతో శ్రీకాకుళంలో తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బాహుదా నదుల్లో వరద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు భావించి తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. పెథాయ్‌ సిక్కోలు వైపు మళ్లుతుందన్న అంచనాతో ముందస్తు జాగ్రత్తగా రెండోపూట విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా పాఠశాలలు తెరవొద్దని అధికారులు ఆదేశించారు. 
* పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2,636 మందికి పునరావాసం కల్పించారు.  వీరవాసరం, ఉండి, భీమవరం మండలాల్లో 45 విద్యుత్తు స్తంభాలు కూలిపోగా సిబ్బంది వెంటనే పునరుద్ధరించారు. తల్లాడ- దేవరపల్లి జాతీయ రహదారిపై చెట్లు కూలిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 
* విశాఖపట్నం జిల్లాలోని తీరప్రాంత 11 మండలాల్లో 101 గ్రామాల్లో పెథాయ్‌ ప్రభావం కనిపించింది. 2.32 లక్షల మంది తుపాను ప్రభావానికి గురయ్యారు. నక్కపల్లి, పాయకరావుపేట, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని 49 గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న పరవాడ, పెదగంట్యాడ, భీమునిపట్నం, గాజువాక, విశాఖ రూరల్‌, అర్బన్‌ మండలాల పరిధిలో ఉన్న మరో 52 గ్రామాలపై ప్రభావం చూపింది. జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం ఇంతవరకు 90 చోట్ల సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. 26,323 మందిని తరలించారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశారు.

17ap-main1e_1.jpg

విరిగిన చెట్లు.. వెలుగులు దూరం 
ఈపీడీసీఎల్‌ పరిధిలో 700 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల విద్యుత్తు సరఫరాను ముందే నిలిపేయగా. మరికొన్నిచోట్ల చెట్లు విరిగి తీగలపై పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో 99 గ్రామాల్లో అంధకారం నెలకొంది. కాకినాడ నగరంలో ఆదివారం అర్థరాత్రి దాటాక 3.30 గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వర్షాలు, గాలుల కారణంగా 12 మండలాల పరిధిలో 17 విద్యుత్తు ఉప కేంద్రాల దగ్గర ఫీడర్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు కుంగి కూలిపోయాయి. మూడు జిల్లాలకు కీలకమైన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చెట్లు, స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. 250 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 20 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. రెండు కిలోమీటర్ల మేర విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. తూర్పుగోదావరిలో 98 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచింది.

 

17ap-main1f_2.jpg


నిలిచిన మొబైల్‌, అంతర్జాల సేవలు 


అధిక వేగంతో వీచిన గాలులకు మొత్తం 297 మొబైల్‌ టవర్లు దెబ్బతిన్నాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 127, విశాఖపట్నంలో 80, మిగిలినవి ఇతర జిల్లాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి సముద్ర తీర ప్రాంతంలోని 18 టవర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. జనరేటర్లను పంపి సేవలను పునరుద్ధరించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ గదిలో రెండు గంటల పాటు అంతర్జాలానికి విఘాతం కలగడంతో సేవలు స్తంభించాయి. 


ప్రకాశం బ్యారేజీకి వరద

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరిగింది. కట్టలేరు, మున్నేరు తదితర వాగులు, వంకల నుంచి భారీగా నీరు వస్తుండడంతో సోమవారం సాయంత్రం బ్యారేజీ మూడు గేట్లను అడుగు మేర ఎత్తి 2,175 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో, ఈ జిల్లాలకు వెళ్లే ప్రధాన కాల్వలకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులు దాటే పరిస్థితి ఉండడంతో గేట్లు ఎత్తారు. 


తెలంగాణలో ‘వణుకు’

ఈనాడు, హైదరాబాద్‌: పెథాయ్‌ తుపానుతో తెలంగాణలో అనూహ్య వాతావరణ మార్పులు ఏర్పడ్డాయి. సోమవారం తీవ్రమైన చలి గాలులు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండాపోయింది. ఖమ్మం, భద్రాద్రి, మహబూబూబాద్‌, జయశంకర్‌ భూపాల్‌పల్లి, వరంగల్‌ గ్రామీణ తదితర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.  ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం మిరప తోటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, అరటి చేలకూ నష్టం వాటిల్లింది. హన్మకొండలో సోమవారం పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రత 18.9 డిగ్రీలుంది. ఇది సాధారణం కన్నా 11 డిగ్రీలు తక్కువ కావడం గమనార్హం.


హైదరాబాద్‌ గజ గజ 


పెథాయ్‌ తుపాన్‌ ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. చిరు జల్లులకు గాలి తోడు కావడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. చలి వాతావరణంతో జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తుతున్నాయి. పిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. ఇదే పరిస్థితి ఒకట్రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


పడగొట్టిన చలిగాలులు

ఈనాడు, విశాఖపట్నం: పెథాయ్‌ తుపాను తీరాన్ని సమీపించేకొద్దీ బలహీనపడి భారీ నష్టాన్ని తగ్గించింది. తుపాను గమనాన్ని ఐఎండీ మాజీ డైరెక్టర్‌ పీవీ రామారావు, మాజీ శాస్త్రవేత్త మురళీకృష్ణ ‘ఈనాడు’కు తెలిపారు. తుపాను బంగాళాఖాతంలో ఉన్నపుడు తీవ్ర తుపానుగా బలపడి తీరాన్ని తాకేముందు తుపానుగా బలహీనపడింది. తీవ్ర తుపానుగా ఉన్నప్పుడు సముద్ర ఉష్ణోగ్రత 29-30 డిగ్రీల వరకుంది. అనుకూలమైన పీడనం, దిశను ముందుకు నడిపే గాలులున్నాయి. ఎప్పుడైతే ఇది తీరానికి దగ్గరగా వచ్చిందో ఆ సమయంలో ఉత్తరాదినుంచి వచ్చిన చల్లని గాలులు దాన్ని నిరోధించాయి. తుపాను, తీవ్ర తుపాను మరింత బలంగా ముందుకు సాగాలంటే గాలిలో తేమ, సముద్ర ఉపరితలంలో 27.5 డిగ్రీలకన్నా ఎక్కువ వేడి ఉండాలి. తీరానికి సమీపంలో ఉత్తరదిశగా వచ్చిన చల్లని గాలుల వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఫలితంగా తేమ తక్కువగా లభ్యమవడంతో తీవ్ర తుపాను కాస్త తుపానుగా మారి తీరాన్ని తాకింది. పెనుగాలులు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనే వీచాయి.

17ap-main1g.jpg

Link to comment
Share on other sites

రెండు చోట్ల తీరం దాటిన పెథాయ్‌   

 

మొదట్లో యానాం సమీపంలో, ఆ తర్వాత తుని దగ్గర్లో 
అరుదైన విషయమంటున్న నిపుణులు

ఈనాడు, విశాఖపట్నం: పెథాయ్‌ తుపాను రెండుసార్లు తీరం దాటింది. సోమవారం మధ్యాహ్నం యానాం సమీపంలో తీరం దాటాక తిరిగి సముద్రంలోకి వచ్చి మళ్లీ తుని సమీపంలో రాత్రి తీరం దాటినట్లుగా వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో యానాం చుట్టుపక్కల ఉన్న తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం సముద్రంలోకి చొచ్చుకెళ్లినట్లు ఉంటుంది. అది దాటగానే మళ్లీ సముద్రం, ఆ తర్వాత భూభాగం వస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి తమిళనాడువైపు మరలి.. ఆ తర్వాత దక్షిణ బంగాళాఖాతం మీదుగా కోస్తా వైపునకు దిశ మార్చుకుని వచ్చిన ఈ తుపాను.. సోమవారం మధ్యాహ్నం 1.30-2.30 గంటల ప్రాంతంలో కాస్త వాలుగా దక్షిణ యానాంవైపు ఉన్న ప్రాంతాల్ని తాకిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని గంటలవరకు భూభాగం మీదనే ఉండి.. తిరిగి సముద్రంలోకి వచ్చేసింది. తీరం వెంబడి వాలుగా ప్రయాణిస్తూ తుని సమీపంలో సోమవారం రాత్రి 7.30 - 8.30 గంటల మధ్య మరోసారి తీరం దాటిందని వివరించారు. దీంతో ఈ తుపాను రెండుసార్లు తీరం దాటినట్లయ్యింది. యానాం వద్ద తీరం దాటాక వెంటనే బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాతే రెండోసారి తీరం దాటింది. వాతావరణశాఖ అధికారులు మాత్రం మొదటిసారి ఎక్కడ తీరం తాకిందో దాన్నే లెక్కలోకి తీసుకుంటారు. ఇదే తరహాలో చాలా ఏళ్లక్రితం ఒకసారి తుని సమీపంలో జరిగిందని హైదరాబాద్‌ వాతావరణశాఖ డైరెక్టర్‌ వైకె రెడ్డి చెప్పారు. దక్షిణ బంగాళాఖాతం వైపునుంచి కోస్తా తీరంవైపు వచ్చే తుపాన్ల గమనాన్ని స్పష్టంగా ఊహించడం కష్టమని అంటున్నారు వాతావరణ నిపుణులు. తీరం వెంబడి వాలుగా వెళ్తుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

నేడు మరింత బలహీనం 
పెథాయ్‌ తుపాను బలహీనపడుతూ వస్తోంది. సోమవారం రాత్రి తీవ్ర వాయుగుండంగా మారింది. విశాఖ, విజయనగరం, మీదుగా వెళ్తూ వాయుగుండంగా బలహీనపడుతుందని, శ్రీకాకుళం జిల్లా వెళ్లేసరికి అల్పపీడనంగా మారిపోతుందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపారు. 


పోర్టులకు బీమా భద్రత

ఈనాడు, విశాఖపట్నం: దేశంలోని నౌకాశ్రయాలకు బీమా భద్రత అందుబాటులోకి వచ్చింది. విశాఖ జిల్లాలో హుద్‌హుద్‌ పెను తుపాను సమయంలో ఇక్కడి నౌకాశ్రయానికి కోలుకోలేని నష్టం వాటిల్లింది.ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. తుపానుల సమయంలో నౌకాశ్రయాల్లోని మౌలికవసతులు, పరికరాల విలువకు తగ్గట్లుగా బీమా చేయించాలని ఆదేశించింది. విశాఖ నౌకాశ్రయ అధికారులు ముప్పునకు గురయ్యే అవకాశం ఉన్న ఆస్తుల విలువను రూ.911 కోట్లుగా అంచనా వేశారు. ఆ మొత్తం ఆస్తుల బీమాకు రూ.5 కోట్ల ప్రీమియం చెల్లించారు.

 

Link to comment
Share on other sites

అయ్యో పాపం రైతన్న   

 

తుపాను ప్రభావిత జిల్లాల్లో అన్నదాత కంట కన్నీరు 
ప్రాథమికంగా రూ.450కోట్లపైనే పంట నష్టం 
3.87లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు 
ఈనాడు - అమరావతి

17ap-main7a_2.jpg

పెథాయ్‌ తుపాను రైతాంగాన్ని కన్నీట ముంచింది. 3.87 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలను దెబ్బతీసింది. దీని ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోతకొచ్చిన వరితో పాటు మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ, మిర్చి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, కొబ్బరిలనూ చుట్టేసింది. నూర్పిడి చేసి పొలాల్లో ఉంచిన ధాన్యం సుమారు 1.20 లక్షల టన్నుల వరకు తడిచింది. మొత్తంగా నష్టం సుమారు రూ.450 కోట్లపైనే ఉంటుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే సుమారు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పశ్చిమకృష్ణాతో పాటు పలు మండలాల్లో మిరప, మొక్కజొన్న తోటల్లో నీరు నిలిచింది. గుంటూరు జిల్లాలో కోతలు పూర్తయిన 20వేల ఎకరాల వరి నీట మునిగింది. మరో 80 వేల ఎకరాల్లో కోత దశలో ఉన్న పంట నేలవాలింది. పశ్చిమగోదావరి జిల్లాలో 20 వేల ఎకరాలకు పైగా పొగాకు, మిర్చి, మొక్కజొన్న, వరికి నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలో కళ్లాల్లో రాశులుగా ఉన్న 19,395 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసింది. ఈ జిల్లాలో రూ.35 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. విశాఖపట్నం జిల్లాలో 1,250 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, తుని, ఏలేశ్వరం ప్రాంతాల్లో 1,600 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. 100 ఎకరాల్లో సాగు చేసిన కాయగూర తోటలు కూడా చేతికందే పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లా కొమ్మమూరు కాలువ కింద వరి కూడా అక్కడక్కడా పడిపోయింది.

ఆక్వా రైతుల్లో ఆందోళన 
కనీస ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆక్వా రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. రొయ్యల చెరువుల్లో సాధారణంగా 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఆక్సిజన్‌ స్థాయి తగ్గకుండా ఏరియేటర్లు వేస్తుంటారు. ఉష్ణోగ్రతలు పడిపోతే తెల్లమచ్చల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. రొయ్యలకు వ్యాధులు వస్తాయని రైతులు భయపడుతున్నారు. నీటిలో పీహెచ్‌, డీఓలు వేగంగా మారే అవకాశం ఉంటుందని ఆక్వా శాస్త్రవేత్త పి.రామ్మోహన్‌రావు వివరించారు. చెరువుల్లోని నీటిని విబ్రియో పరీక్ష చేయించాలని చెప్పారు. ప్రాణవాయువు తగ్గకుండా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ఆక్సిజన్‌ టాబ్లెట్లు వాడాలన్నారు. గుల్లసున్నం వాడటం వల్ల నీటి పీహెచ్‌, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొన్నారు.

17ap-main7d.jpg

17ap-main7c.jpg

 

Link to comment
Share on other sites

20నే పరిహారం చెల్లిస్తాం   

 

19లోగా నష్టం అంచనాలు పూర్తి చేస్తాం 
సీఎం చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో పెథాయ్‌ తుపాన్‌ బాధితులకు ఈ నెల 20వ తేదీనే నష్టపరిహారాన్ని చెల్లిస్తాం. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని కూడా అదేరోజున అందజేస్తాం. 19వ తేదీ సాయంత్రానికి పంట, ఇతర నష్టాలు అన్నింటిపైనా గణన పూర్తి చేస్తాం. మంగళవారం సాయంత్రానికి విద్యుత్తు, నీటి సరఫరా వంటివన్నీ పునరుద్ధరిస్తాం. 20వతేదీ నాటికి ఇతర పనులన్నింటినీ పూర్తి చేస్తాం...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, పునరుద్ధరణ చర్యలపై సోమవారం రాత్రి వరకు సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయమై ఆర్టీజీఎస్‌, ఐఎండీ ఒక్కోలా చెప్పడం వల్ల ప్రజల్లో అయోమయం   నెలకొందన్న విలేకరుల ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందిస్తూ..‘ఐఎండీ వారు ఇంకా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు.  ప్రకాశం నుంచి కాకినాడ వరకు ఉంటుందని వదిలేస్తే... ప్రజలు ఆందోళనకు గురవుతారు. ఫలానా చోట తీరం దాటుతుందని మా వాళ్లు (ఆర్టీజీఎస్‌) ఖచ్చితంగా అంచనా వేశారు. ఆ సమయంలో వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి. ఎంత తీవ్రతతో గాలులు ఉంటాయనేదీ చెప్పగలిగారు.  మీడియాకు కూడా ఖచ్చితమైన సమాచారం ఇచ్చాం. ఆర్టీజీఎస్‌ నుంచి సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లాల్లో యంత్రాంగానికి మార్గదర్శకం చేయడం వల్ల రియల్‌టైమ్‌లో కొన్ని పునరుద్ధరణ పనులతో పాటు ప్రాణ నష్టం లేకుండా చూడగలిగాం...’అని  వెల్లడించారు.

అక్కడకు వెళ్లినా పర్యవేక్షిస్తూనే ఉన్నా 
తుపాన్‌పై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కూడా అధికారులతో సమీక్షించానని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ‘జైపూర్‌లో ఉన్నప్పుడు ఇక్కడ అధికారులతో ఫోన్‌లో మాట్లాడా. తర్వాత భోపాల్‌ నుంచి కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకున్నా. భోపాల్‌ నుంచి నేరుగా సచివాలయానికి వచ్చా. పరిస్థితులపై సమీక్షించా. జిల్లాల అధికారులతో మాట్లాడా. నేను స్వయంగా లేకపోయినప్పటికీ మా అధికార యంత్రాంగం ఎక్కడా చిన్న అసౌకర్యం లేకుండా చూడగలిగింది. పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు శ్రేణులకు సందేశాలు పంపి ముందస్తు జాగ్రత్త చర్యల్లో పాల్గొనేందుకు సూచనలు ఇచ్చారు. 15మంది మంత్రులను క్షేత్రస్థాయికి పంపాం. ఇన్ని చేస్తే నేను వేరే రాష్ట్రాలకు వెళ్లానంటూ వైకాపా వాళ్లు విమర్శలు చేస్తున్నారు. అవును వెళ్లా... విభజన కష్టాల నుంచి మనను ఆదుకునేందుకు కేంద్రం సహకరించడం లేదు. అలాంటపుడు ఇతర పార్టీల మద్దతు తీసుకోవాలి కదా? అక్కడకు వెళ్లినా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నాను. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటిస్తాను...’ అని వెల్లడించారు. ‘తుపాన్‌ వల్ల జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతాం. వాళ్లేం చేస్తారో తెలియదు. మేం చేయాల్సింది చేస్తాం. పోరాడతాం...’ అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ముందస్తు  కసరత్తుతో సత్ఫలితాలు 

 

తుపాను సహాయ చర్యలపై ముఖ్యమంత్రి

ఈనాడు, అమరావతి: పెనుగాలుల వేగాన్నిబట్టి జరిగే నష్టాన్ని అంచనా వేయగలిగే సాంకేతికత రాష్ట్రానికి అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఇస్రో అధికారులకు సూచించారు. విపత్తుల్లో గాలి వేగాన్ని గమనించి విద్యుత్తు స్తంభాలు, టవర్లు ఎన్ని నేలకొరుగుతాయో అవగాహనకు వస్తే వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకోవచ్చని అన్నారు. గాలి వేగం, గాలిలో కాలుష్యం స్థాయిని అంచనా వేసే కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంనుంచి సోమవారం రాత్రి వివిధ జిల్లాల్లో సహాయచర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తీర ప్రాంత అన్ని గ్రామాల్లోని మత్స్యకారులకు తిత్లీ తుపానులో ఇచ్చినట్లు నిత్యావసరాల ప్యాకెట్లు ఇవ్వాలని సూచించారు. వర్షపు నీరు వృథా కాకుండా చెరువులకు మళ్లించే ఏర్పాట్లు చేయాలన్నారు.

పెథాయ్‌ చిన్న తుపాను అయినప్పటికీ ఈ అనుభవాన్ని డాక్యుమెంట్‌ చేసి రేపటి అవసరాలకు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. హుద్‌హుద్‌, తిత్లీ తుపాను అనుభవాలతో పెథాయ్‌పై అప్రమత్తమై క్షేత్రస్థాయిలో అందరినీ సిద్ధం చేయడంలో సఫలమయ్యామని అన్నారు.  తుపాను ముందు జాగ్రత్తలు, సహాయచర్యల్లో పాల్గొన్న 51 మంది ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. పని ఎక్కువగా లేనందున అందరినీ వెనక్కి రప్పిస్తున్నామని, మంగళవారంనుంచి ఆయా జిల్లాల యంత్రాంగాలే సహాయ చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. తాగునీరు, ఆహారం అందుబాటులో ఉన్నాయా? అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటే 95 శాతానికిపైగా ప్రజలు సానుకూలంగా స్పందించారని వివరించారు. ఇలాంటి విపత్తుల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే సత్ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.

తుపాను ప్రభావిత జిల్లాలకు 70 డ్రోన్లు పంపించి నష్ట వివరాలు తెలుసుకుంటామని చంద్రబాబుకు ఆర్టీజీ సీఈవో బాబు తెలిపారు. 


ఫేస్‌బుక్‌, ట్విటర్‌లోనూ నష్టం వివరాలను పంపొచ్చు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ప్రజలు తమ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 13 జిల్లాలకు అధికారిక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను రూపొందించింది.

 

Link to comment
Share on other sites

51 minutes ago, Naren_EGDT said:

cyclones season November and some hit in December.if it is possible October end ki farmers Panta chetikochela plan cheskovali.

polavaram cofferdam going to completed by may 2019 . from next year it is possible to start kharif season from june in krishna delta. farmers can complete harvest by october. from november they cultivate dry crops. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...