Jump to content

Bjp-jagan-pk


sonykongara

Recommended Posts

జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు పవన్ కల్యాణ్.. కానీ ఆ పార్టీకి ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన రహస్యంగా పని చేస్తున్నారు. ఆయనెవరో కాదు.. రామ్ మాధవ్. బీజేపీ అగ్రనేత. అమిత్ షా తర్వాత బీజేపీ అధ్యక్షుడవ్వాలనుకుంటున్న… ఆరెస్సెస్ మనిషి. ప్రజల్లో పది మంది ఓట్లు తెచ్చుకోని నేత. అలాంటి నేత.. జనసేనకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నది డిసైడ్ చేస్తున్నారు. నిధులు కూడా సమకూరుస్తున్నారు. టోటల్ గా… జనసేన బాధ్యతలు మొత్తం ఇప్పుడు రామ్ మాధవే చూస్తున్నారు.

1-janasena-532532-300x187.png

రాజమండ్రి కవాతు ఖర్చు.. మీడియాలో కవరేజీ కోసం.. రామ్ మాధవ్ ఎంత దారుణమైన దిగజారుడుకి దిగిపోయారో అందరికీ తెలిసిపోయింది. బీజేపీకి సన్నిహిత పారిశ్రామిక వేత్తలందరికీ.. కవాతు బాధ్యతలు అప్పగించారు. తలా కొంచెం ఖర్చు పెట్టించారు. ఆ తర్వతా ఇదో కామెడి షో దీనికి కవరేజీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్న మీడియా సంస్థలకు ఫోన్లు చేసి.. లైవ్ ఇవ్వకపోతే.. సీబీఐ, ఐటీ, ఈడీలు మీకు సినిమా చూపిస్తాయని బెదిరించారు. దీంతో చాలా సంస్థలు కవరేజీ ఇచ్చారు. కానీ టీవీ నైన్ మాత్రం.. దిక్కున్నోడికి చెప్పుకోమని చెప్పి పంపించేసిది. ఒక్క నిమిషం కూడా.. లైవ్ ఇవ్వలేదు. దాంతో ఈ విషయం బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ ను పూర్తిగా రామ్ మాధవ్ పట్టేశారని అర్థమైపోయింది.

 

1-janasena-5325-300x191.png

వచ్చే ఎన్నికల్లో… మిత్రులతో కలిసి టీడీపీని ఓడిస్తామని.. పదే పదే చెబుతున్న… బీజేపీ నేత రామ్ మాధవ్.. ఢిల్లీ నుంచి ఈ స్థాయి కుట్రలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచి.. పవన్ , జగన్ లను అడ్డం పెట్టుకుని.. ఆంధ్రప్రదేశ్‌కు నిలువ నీడ లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ దీన్ని ప్రజలు అంత తేలికగా క్షమించే అవకాశం లేదు. ఈ కుట్రలన్నింటికీ అంతకంత బుద్ది చెబుతారు. దమ్ముంటే..నేరుగా ప్రజల ముందుకు వచ్చి.. కలసి పోటీ చేస్తున్నామని చెప్పుకోవాలి కానీ.. లోపాయికారీ రాజకీయాలు చేసి.. ప్రజల్ని మోసపుచ్చడం దేనికి..

Link to comment
Share on other sites

పవన్ కళ్యాణ్ కి కేటీఆర్ ఫోన్..

   
ktr-17102018.jpg
share.png

రెండు రోజుల క్రితం, ప్రెస్ మీట్ లో బహిరంగంగా మాట్లాడుతూ, మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అని చెప్పిన తెలంగాణా మంత్రి కేటీఆర్, చంద్రబాబుని ఇప్పటికే టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఫోన్ చేసి అభినందించారు. మొన్న కవాతు సందర్భంగా, బాగా ఊగిపోయి చంద్రబాబుని బాగా బూతులు తిట్టారని, లోకేష్ పై బాగా విమర్శలు చేశారని, కేటీఆర్ పవన్ ను అభినందించారు. ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన నిర్వహించిన కవాతు బాగా విజయవంతం అయ్యిందని, అందుకే మీకు ఫోన్ చేసి అభినందనలు చెప్పాలనిపిచ్చింది అంటూ కేటీఆర్ ఫోన్ చేసి మరీ, పవన్ కు అభినందనలు తెలిపారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణాలో, ఆంధ్రా వాళ్ళని బాగా తిడుతున్న కేసీఆర్ కు సపోర్ట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఇప్పుడు ఈ ఫోన్ కాల్ తో వీరి బంధం మరింత గట్టి పడింది.

 

ktr 17102018 2

"బాబు నువ్వే మా టార్గెట్", పార్లమెంట్ సాక్షిగా ప్రధాని.. "చంద్రబాబు నిన్ను దించటమే మా టార్గెట్", ఊరు ఊరు తిరిగి చెప్తున్నాడు జగన్.. "నేను గెలవకపోయినా పరవాలేదు, ఎవరు గెలిచినా పరవాలేదు, చంద్రబాబుని మాత్రం గెలవనివ్వను", ఇంత విచిత్రంగా స్పందిస్తాడు పవన్ కళ్యాణ్... తెలంగాణాలో ఉన్న తెరాస పార్టీకి కూడా చంద్రబాబే టార్గెట్ అంటూ రెండు రోజుల క్రిందట కేటీఆర్ ప్రకటించాడు. 0.01% ఉన్న చిల్లర పార్టీ తెలుగుదేశం అంటూనే, చంద్రబాబు మా టార్గెట్ అంటున్నాడు కేటీఆర్. మొత్తానికి మోడీ, జగన్, పవన్, కెసిఆర్ బంధం ఎంత గట్టి బంధమో రోజు రోజుకీ తెలుస్తుంది. తెలంగాణాలో యుద్ధం జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడకు వచ్చి కత్తులు తిప్పుతున్నాడు.

ktr 17102018 3

అక్కడ రాజకీయం వదిలేసి, కేటీఆర్ ఇక్కడ రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నాడు. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి అనుచరగణానికి వేల కోట్ల మిషన్ బఘీరాధ కాంట్రాక్టులు ఇస్తారు. ఇలా అందరూ కలిసి, అన్ని వైపుల నుంచి వస్తు, ఒకే ఒక్కడిని టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణాలోని హైదరాబాద్, రంగారెడ్డిలో మాత్రమే స్నేహపూర్వక పోటీ పెట్టి, తెలుగుదేశం ఓట్లు చీల్చి లబ్ది పొందాలనే ఉద్దేశంలో కెసిఆర్ ఉన్నారు. దానిలో భాగంగానే, రాజకీయం మొత్తం నడుస్తుంది. అందుకే కెసిఆర్ - పవన్ సంబంధాలు తెలుసు కాబట్టే, ఇక్కడ ఏపిలో కమ్యూనిస్ట్ లు పవన్ వెంట ఉంటే, తెలంగాణాలో మాత్రం, పవన్ ను ఛీ కొట్టారు కమ్యూనిస్ట్ లు. కెసిఆర్ తొత్తుగా మారాడని విమర్శిస్తున్నారు. ఇదండీ, కెసిఆర్, పవన్, జగన్, మోడీలు కలిసికట్టుగా హైదరాబాద్ నుంచి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేస్తున్న యుద్ధం..

Link to comment
Share on other sites

ఉద్దానంపై పవన్‌కళ్యాణ్‌ది దొంగ ప్రేమ: చంద్రబాబు
18-10-2018 13:16:03
 
636754653641039935.jpg
 
శ్రీకాకుళం జిల్లా: ఉద్దానంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ది దొంగ ప్రేమని సీఎం చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని తితలీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ తుపానుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పవన్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇక్కడ తితలీ బాధితులు ఇబ్బందులు పడుతుంటే.. పవన్‌ కవాతును కేటీఆర్‌ అభినందించడమేంటని చంద్రబాబు అన్నారు. తనపై మోదీ, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ కక్షగట్టారని... తానేం తప్పు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు.
 
విభజన హామీలు అమలు చేస్తారనే ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయకపోగా.. తెలుగుజాతిని చిన్నచూపు చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ, పవన్ పార్టీలను రాష్ట్రంపై ఉసిగొల్పుతున్నారని బాబు విమర్శించారు. తెలుగుజాతిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఉద్దానానికి ఇంత కష్టమొస్తే జగన్‌ ఎక్కడికి పోయారని చంద్రబాబు ప్రశ్నించారు. పక్క జిల్లాలో ఉన్న జగన్‌.. తితలీ బాధితులను పరామర్శించరా? అని నిలదీశారు. బీజేపీతో కలిసి వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని సీఎం తీవ్ర స్థాయిలో విమర్శించారు. సహాయకచర్యలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
Link to comment
Share on other sites

పవన్‌ కవాతును కేటీఆర్‌ అభినందించడమేంటని చంద్రబాబు అన్నారు. తనపై మోదీ, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ కక్షగట్టారని... తానేం తప్పు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...