Jump to content

Titli Cyclone | Coastal Districts Put On High Alert |


sonykongara

Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply
గాయపడిన గుండెకు..భరోసా ఇద్దాం
23-10-2018 02:55:06
 
636758601072861944.jpg
  • సిక్కోలు పునర్నిర్మాణానికి మహోద్యమం
  • నెలవారీ ఖర్చుల్లో కొంత విరాళం ఇవ్వండి
  • బాధితులకు ఓదార్పు.. బాగుకు భరోసా
  • తితలీతో సిక్కోలులో పెను విషాదం
  • ప్రజలూ తమ వంతుగా చేయూతనివ్వాలి
  • ఆపదలో ఆదుకునే హృదయమే గొప్పది
  • ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ఉద్యానవనం లాంటి ఉద్దానం.. తితలీ తుఫాను తెచ్చిన నష్టంతో దశాబ్దాలు వెనక్కి వెళ్లింది. నిన్నటివరకు కిడ్నీ వ్యాధి బాధలే అనుకుంటే పులిమీద పుట్రలా ఇప్పుడు తుఫాను విలయతాండవం ఉద్దానాన్ని అధ్వానంగా మార్చేసింది. అక్కడే కాదు.. శ్రీకాకుళం జిల్లాలో అనేక గ్రామాల్లో తుఫాను పెను విషాదాన్ని మిగిల్చింది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు, తోటలు కుప్పకూలాయని.. వలలు, పడవలు కొట్టుకుపోయి మత్స్యకారులు కకావికలమయ్యారని వాపోయారు. శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపిచ్చారు. అక్కడి సోదరసోదరీమణులకు వీలైనంత ఆసరా ఇద్దామని తెలిపారు. నెలవారీ మన ఖర్చుల నుంచి కొంత సొమ్ము విరాళంగా ఇద్దామని ప్రతిపాదించారు. తద్వారా తుఫాను బాఽధితులకు ఓదార్పునిచ్చి.. వారి బాగుకు భరోసానిద్దామన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. లేఖ పాఠమిదీ..
 
నష్టం అపారం..
‘తితలీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అల్లకల్లోలం చేసింది. తుఫాను తీవ్రత తెలిసిన వెంటనే యావత్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణనష్టం తగ్గించగలిగాం. కానీ 165 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల బీభత్సం వల్ల ఆస్తి నష్టం నివారించలేకపోయాం. ఈ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు తీరని బాధల్లో ఉన్నారు. కళ్ల ముందే ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. 40 వేల కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. 700 కిలోమీటర్ల రోడ్లు, 365 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. 1.59 లక్షల ఎకరాల వరి, 4,543 ఎకరాల కొబ్బరి, 17,589 ఎకరాల జీడిమామిడి తోటలు, 968 ఎకరాల అరటి పంట ధ్వంసం అయ్యాయి. 34,848 ఇళ్లు పూర్తిగా, 12,397ఇళ్లకు పాక్షికంగా నష్టం జరిగింది. మొత్తం రూ.3,428 కోట్ల నష్టం వాటిల్లింది. కొబ్బరి, జీడిమామిడి తోటలతో పాటు, వరి తదితర పంటలు కళ్లముందే కూలిపోవడం చూసి రైతుల దుఖం వర్ణనాతీతం. కన్నబిడ్డల్లా చూసుకున్న పచ్చని తోటలు నిలువునా కుప్పకూలాయి. వలలు, పడవలు కొట్టుకుపోయి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. నష్టం అపారం. కానీ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతే జీవితమే లేదు. ఒక రైతు బిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కష్టాన్ని చూసి చలించిపోయాను. వెంటనే రంగంలోకి దిగాను. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వ్యూహరచన చేశాను. సచివాలయాన్నే అక్కడకు తరలించాను.’
 
తుఫాను కూడా తలొంచుతుంది
‘తితలీ చేసిన గాయాలకు మనమే మందు వేయాలి. నా మంత్రివర్గ సహచరులు, అధికారులు, ప్రజాప్రతినిఽధులంతా ఆపన్నులను ఆదుకునేందుకు అహోరాత్రులూ కృషిచేశారు. 35 మంది ఐఏఎస్‌ అధికారులు, 100మంది డిప్యూటీ కలెక్టర్లు, 10వేల మంది విద్యుత్‌ సిబ్బంది, 13వేల మంది పారిశుధ్య కార్మికులు, ఇతర శాఖల ఉద్యోగులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు శాయశక్తులా పనిచేస్తున్నారు. నీరు, ఆహారం, నిత్యావసర సరుకులు పుష్కలంగా అందిస్తున్నారు. తుఫాన్లు, కరువులు తదితర ప్రకృతి వైపరీత్యాలు మన రాష్ట్రాన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలోనే దీని గురించి హెచ్చరించాను.
 
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాను. కానీ అప్పుడు నిర్లక్ష్యం చేశారు. మానవ ప్రయత్నమంటూ ఉంటే దైవం కూడా సానుకూలంగానే ఉంటుంది. ఎదిరించి నిలబడే గుండె ధైర్యం ఉంటే తుఫాను కూడా తలొంచుతుంది. ఉక్కు సంక్పలంతో, మనోనిబ్బరంతో ఆనాడు హుద్‌హుద్‌ తుఫానును జయించాం.. ఒక ఆపదను అవకాశంగా తీసుకుని అభివృద్ధి చేసుకున్నాం. హుద్‌హుద్‌ తర్వాత విశాఖ నగరం ఇప్పుడు ప్రపంచశ్రేణి నగరంగా ఉంది. అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచింది. తితలీ నుంచి కూడా అలాంటి స్ఫూర్తినే తీసుకుని శ్రీకాకుళం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాను. అందరితో సమాలోచన చేసి.. ఆయా ప్రాంతాల పునర్నిర్మాణానికి ‘తితలీ ఉద్దానం పునర్నిర్మాణ ప్రాజెక్టు (తూర్పు)గా నామకరణం చేశాం. కష్టాలపాలైన ఉద్దానాన్ని కాపాడుకోవడం ప్రస్తుతం మనందరి కర్త్యవ్యం. బాధల్లో ఉన్న బారువాను ఓదార్చడం ఉమ్మడి బాధ్యత. పునర్నిర్మాణాన్ని సామూహిక ఉద్యమంగా చేపట్టాలి.’
 
ఇంతవరకూ కేంద్రం స్పందించలేదు
‘తుఫాను నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి రూ.1200 కోట్ల తక్షణ సాయం అడిగాం. రెండోసారి కూడా లేఖ రాశాం. ఇంతవరకూ స్పందించలేదు. కేంద్ర నిధుల విడుదల కోసం ఎదురుచూడకుండా, ఖర్చుకు వెనకాడకుండా ఇప్పటికే సహాయ చర్యలు ముమ్మరం చేశాం. బాధిత కుటుంబాలు నిలదొక్కుకునేందుకు నష్టపరిహారం ప్రకటించాం. అయితే ప్రభుత్వం అందించే సహాయంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆర్థిక స్తోమత గల కంపెనీలు, ప్రవాసాంధ్రులు, అన్నివర్గాల ప్రజలూ చేయూతనివ్వాలి. ఒక సమస్య వచ్చినప్పటికీ దీనిద్వారా ఇంకొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కలిగింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నివారణ పరిశోధనా సంస్థను నెలకొల్పడానికి దాతలు ముందుకొచ్చారు. హార్టీకల్చర్‌ పరిశోధనా సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారానికి మీ అందరి చేయూత కావాలి.’
 
చిన్న పొరపాటైనా అందరికీ చెడ్డపేరు
తుఫాను సహాయక కార్యక్రమాల్లో ఇప్పటివరకూ అందరూ బాగా పనిచేశారని, ఇప్పుడే అందరూ జాగ్రతగా ఉండాలని, చిన్న పొరపాటు చేసినా అందరికీ చెడ్డపేరు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంత్రులు, కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై సంతృప్తి 76 శాతం ఉంటే.. తుఫాను ప్రాంతాల్లో 62.4 శాతం ఉందని, ఆదివారం కంటే 1.5 శాతం పెరిగిందని వివరించారు. తాగునీటి సరఫరాపై 62.5 శాతం, రాకపోకలపై 73 శాతం, విద్యుత్‌ సరఫరాపై 53.4 శాతం సంతృప్తి వచ్చిందని తెలిపారు. రైతులు అనుమతించిన చోటే విద్యుత్‌ మరమ్మతు పనులు చేపట్టాలని యంత్రాంగానికి స్పష్టంచేశారు. పంటలు తొక్కేస్తారని రైతుల్లో ఆందోళన ఉందని, వారు కోరితే కోతలయ్యేవరకూ పొలాల్లో విద్యుత్‌ పనులు వాయిదా వేయాలని ఆదేశించారు.
 
విద్యుత్‌ సరఫరా పనులు ఇప్పటివరకూ 88 శాతం పూర్తయ్యాయని, మంగళవారం నాటికి మొత్తం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. మొత్తం 17 మండలాలకు గాను 8 మండలాల్లో నూరు శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మందస, వజ్రకొత్తూరు, నందిగామల్లో విద్యుత్‌ పనులు వేగవంతం కావాలన్నారు. ‘గార, ఇచ్ఛాపురం, జలమూరులో తాగునీటిపై శ్రద్ధ పెట్టాలి. మొత్తం 149 వాటర్‌ స్కీములకు విద్యుత్‌ కనెక్షన్లు పునరుద్ధరించాం. 185 ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నాం. 667 గ్రామాల్లో ఒకేరోజు పరిహారం చెక్కులు పంపిణీ చేయాలి. ముందురోజే గ్రామాలకు వెళ్లి తెలియజేయాలి. పరిహారం పంపిణీపై ప్రాథమిక ప్రకటన, అభ్యంతరాల పరిశీలన, తుది ప్రకటన అన్నీ పకడ్బందీగా నిర్వహించాలి. పరిహారం పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలి’ అని సూచించారు.
 
29లోగా బాధితులకు పరిహారం
తిత్లీ తుఫాను విషయంలోనూ ప్రతిపక్షాలు అవరోధాలు కల్పించాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారని, అయినా 14 రోజుల్లో పదివేల మంది సిబ్బందితో 38వేల విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించామన్నారు. 29వ తేదీలోగా దెబ్బతిన్న జీడిమామిడి, ఇతర పంటలకు పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
 
 
విరాళాలు ఇలా పంపొచ్చు
‘తితలీ తుఫాను బాధితులకు సాయం చేయాలనుకునే దాతలు విరాళాలను నేరుగా పంపడానికి వీలుగా ఏపీసీఎం సహాయనిఽధి వెబ్‌సైట్‌ ప్రారంభించాం. దీనిద్వారా దాతలు విరాళాలు చెల్లించవచ్చు. ఏపీసీఎంఆర్‌ఎ్‌ఫ.ఏపి.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దాతలు విరాళాలు పంపవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, పేటీఎం ద్వారా పంపవచ్చు. పెద్దమొత్తాల్లో అందించే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇప్పటి ఈ చీకట్లను చీల్చి రేపటి వెలుగులు అందించేందుకు ఈ రోజే మనమంతా ఒక మహోద్యమానికి శ్రీకారం చుడదాం. ఆపదలో ఆదుకునే హృదయమే గొప్పది. రండి.. తుఫాను బాధితులకు ఓదార్పునిద్దాం.
Link to comment
Share on other sites

తితలీ తుఫాను బాధితులకు ఏపీఎండీసీ 10కోట్ల సాయం
27-10-2018 03:08:58
 
636762065371296984.jpg
ఓబులవారిపల్లె, అక్టోబరు26: శ్రీకాకుళం తితలీ తుఫాను బాధితులకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ రూ.10కోట్లు ఆర్థిక సహాయం చేసినట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిరుమామిళ్ల వెంకయ్యచౌదరి చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఈమేరకు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఏపీఎండీసీ యాజమాన్యం సామాజిక బాధ్యత కింద ఈ మొత్తాన్ని అందజేసినట్టు తెలిపారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌, ఏపీఎండీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెచ్‌డీ నాగరాజు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. కాగా, తితలీ తుఫాన్‌ బాధితుల సహాయార్ధం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన మొవ్వ సత్యనారాయణ చెక్కును సీఎంకు అందజేశారు.
Link to comment
Share on other sites

‘తితలీ’ బాధితులను ఆదుకోండి
27-10-2018 03:10:39
 
  • రాజ్‌నాథ్‌ సింగ్‌కు రాహుల్‌గాంధీ లేఖ
న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తితలీ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. తుఫాను ప్రభావంతో 3లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు, పదివేల ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ తమకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. తక్షణ సాయంగా కేంద్ర విపత్తుల నిధి నుంచి ఏపీకి నిధులు విడుదల చేయాలని, తిరిగి కోలుకునే వరకు పూర్తి సహకారం అందించాలని రాహుల్‌ విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

తుఫాన్‌ నష్టం పరిహారానికి 9,084 దరఖాస్తులు
27-10-2018 14:05:38
 
636762461639096566.jpg
 
శ్రీకాకుళం: జిల్లాలో తితలీ తుఫాన్‌ నష్టపరిహారం అందించాలని కోరుతూ 9,084 దరఖాస్తులు వచ్చినట్లు జేసీ చెప్పారు. నష్టపోయిన ఐటం వివరాలకు సంబంధించి ఫొటోలు గూగుల్‌ ద్వారా క్లౌడ్‌సోర్సింగ్‌కు వచ్చిన ట్లు పేర్కొన్నారు. మండలాలవారీగా శుక్రవారం సాయం త్రం వరకు వచ్చి దరఖాస్తుల వివరా లను ప్రకటించారు. కవిటి మండలం నుంచి 1,018, సోంపేట నుంచి 932, పలాస 826 దరఖాస్తులు వచ్చాయ న్నారు. వజ్రపుకొత్తూరు నుంచి 761, పోలాకి 636, మందసా 594, టెక్కలి 520, సంతబొమ్మాళి 484 దరఖాస్తులు రాగా నందిగాం నుంచి 343, కోటబొమ్మాళి 321, కంచిలి 299, సారవకోట 215, హిరమండలం 209, మెళియాపుట్టి 192, పాతపట్నం 192 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
 
 
ఇచ్ఛాపురం నుంచి 126, జలుమూరు118, సరుబుజ్జిలి 105, భామిని 95, నరసన్నపేట 97, అమదాలవలస 84, ఎల్‌ఎన్‌పేట 24, శ్రీకాకుళం రూరల్‌ మం డలం 68, పాలకొండ 45, సోంపేట 38, వీరఘట్టం 30, బూర్జ 28, ఎచ్చెర్ల 28, వంగర 20, సంతకవిటి 17, లావేరు 12, రేగిడి ఆమదాలవలస 12, పొందూరు 11, జిసిగడాం 10, రాజాం నుంచి 8, రణస్థలం మండలం నుంచి 7 దరఖాస్తులు వచ్చాయని జేసీ చక్రధర్‌ బాబు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

తితలీ బాధితులకు రూ.10కోట్లు చెక్కు అందించిన మంత్రి
27-10-2018 14:12:46
 
636762464659088132.jpg
  • ఏపీఎండీసీ నుంచి రూ.10కోట్లు చెక్కు ముఖ్యమంత్రికి అందజేత
విజయనగరం: తితలీ తుఫాన్‌ కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర గనుల శాఖ ద్వారా రూ.10 కోట్లు అందించారు. శుక్రవారం అమరావతిలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఆశాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఏపీఎండీసీ ఎమ్‌డీ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కును అందించారు.
 
 
తుఫాన్‌ బాధితులను ఆదుకునేందుకు భారీ మొత్తాన్ని అందించిన మంత్రి రంగారావును, ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తితలీ తుఫాన్‌ వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఈ సందర్భంగా అన్నారు. వీరి కష్టాలను కొంతలో కొంత తీర్చాలన్న ఉద్దేశంతో గనుల శాఖ నుంచి రూ.10 కోట్లు మొత్తాన్ని అందించామని మంత్రి చెప్పారు.
Link to comment
Share on other sites

తితలీ తుపాను బాధితులకు రూ. 530 కోట్ల పరిహారం: లోకేష్
05-11-2018 13:51:30
 
636770226916754617.jpg
శ్రీకాకుళం: తితలీ తుపానుతో నష్టపోయిన ప్రజలకు రూ. 530 కోట్ల పరిహారం ఇస్తున్నామని మంత్రి లోకేష్ ప్రకటించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ తుఫాను వచ్చిన 12 గంటల్లో సీఎం చంద్రబాబు ప్రజల ముందు ఉన్నారని, సిక్కోలు ప్రజలు కోలుకునే వరకు ఇక్కడే ఉన్నారన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ రాష్ట్రంలో పర్యటించారని, గుంటూరులో పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారని లోకేష్‌ విమర్శించారు. కనీసం తితలీ తుపాన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదని అన్నారు. అలాగే జగన్‌ పక్క జిల్లాలోనే (విజయనగరం) ఉండి తుపాను బాధితులను పరామర్శించలేదని మంత్రి విమర్శించారు. మందస మండలాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని లోకేష్‌ అన్నారు.
 
తితలీ తుపాను ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో... 1802 గ్రామాలు దెబ్బతిన్నాయని మంత్రి లోకేష్‌ చెప్పారు. లక్షా 65 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, 40 వేల హెక్టార్లలో కొబ్బరి, జీడీ మామిడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయని, 629 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని లోకేష్‌ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

తితలీ తుఫాను నాకు కొత్త అనుభవాన్ని నేర్పింది: చంద్రబాబు
05-11-2018 16:06:50
 
636770308109496619.jpg
శ్రీకాకుళం: తితలీ తుఫాను ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. తితలీ తుఫాను తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని ఆయన తెలిపారు. లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్‌లో సమర్థంగా పనిచేస్తామన్నారు. ప్రజలు అధైర్య పడాల్సిన పనిలేదని, ఉద్దానానికి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. తితలీ తుఫాను భయకరమైన వాతావరణాన్ని సృష్టించిందని, అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలంటే ఎక్కువగా అధికారులు సహాయ చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. మంత్రులు, అధికారుల పనితీరు అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. దసరా పండుగ తుఫాను బాధితుల మధ్యే గడిపారని తెలిపారు.
 
 
‘‘ప్రజా సమస్యలకంటే పండుగలు ప్రభుత్వానికి ఎక్కువ కాదు. సరైన సమయంలో సాయం అందజేస్తేనే ప్రజలకు ప్రయోజనం. తితలీ తుఫానుతో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం. హెక్టారుకు రూ.40వేల సాయం చేస్తున్నాం. కేంద్రం సహకరించకపోయినా తుపాను బాధితులకు న్యాయం చేశాం. తప్పుడు సమాచారంతో పరిహారం కాజేయాలని చూస్తే ఖబడ్దార్‌. ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. ఉద్దానం ప్రాంతంలో శాశ్వత గృహాలు కట్టిస్తాం. కోడి కత్తి వ్యవహారంలో ఢిల్లీలో నానా హడావుడి చేశారు. తితలీ బాధితుల సాయం కావాలని ఢిల్లీ నేతలను ఒక్క మాట అడగరు. కేంద్రానికి మానవత్వం లేదు, తుపాను బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పార్టీ ఆఫీసు శంకుస్థాపనకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు సమయం ఉంటుంది. కష్టాల్లో ఉండాల్సిన ప్రజలను చూడాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? కేంద్ర ప్రభుత్వ తీరును దేశవ్యాప్తంగా తిరిగి ఎండగడతాం’ అని చంద్రబాబు హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...