Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

AP Assembly elections: Muslim voters can be game changers

Recommended Posts

ముస్లిం ఓట్లు తొలగిస్తారేమో
13-06-2018 02:08:15
 
636644525074871995.jpg
 • కర్ణాటకలో 15% తీసేశారు..
 • యూపీలోనూ జరిగిందని వింటున్నాం
 • ఢిల్లీలో ఎంపీల ఆధ్వర్యంలో సభ
 • కేంద్రం అన్యాయంపై దేశమంతా ఎలుగెత్తుదాం
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలను చైతన్యపర్చాలి
 • పరిస్థితిపై అధ్యయనానికి సీఎం ఆదేశం
 • ఈవీఎంల విషయంలోనూ జాగ్రత్త: యనమల
 • దేశ రాజధానిలో ఎంపీల ఆధ్వర్యంలో సభ
 • కేంద్రం అన్యాయాన్ని దేశమంతా చాటాలని
 • టీడీపీ సమన్వయ భేటీలో విస్తృత చర్చ
 
అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుంచి ముస్లిం ఓటర్ల పేర్లు పెద్ద సంఖ్యలో తొలగింపునకు గురయ్యాయని వస్తున్న వార్తలపై టీడీపీ సమన్వయ కమిటీ దృష్టి సారించింది. ఈ కమిటీ భేటీ మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని గ్రీవెన్స్‌ హాల్‌లో జరిగింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘కర్ణాటకలో తాజా ఓటర్ల జాబితాలో 18 లక్షల ముస్లిం ఓటర్ల పేర్లు మాయమయ్యాయని ‘సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ అండ్‌ డేటాబేస్‌ ఇన్‌ డెవల్‌పమెంట్‌ పాలసీ’ అనే స్వచ్ఛంద సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. 15 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.
 
ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిణామాలు జరిగినట్లు వింటున్నాం’ అని ఆయన చెప్పారు. దీంతో, ఓటర్ల జాబితాల్లో పేరు ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, దీనిపై ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను టీడీపీ నేతలు చైతన్యపర్చాలని చంద్రబాబు సూచించారు. ఈవీఎంలను కేంద్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని యనమల అన్నారు. తాము వేసిన ఓటు ఎవరికీ పడిందో చూసుకునే హక్కు ప్రతి ఓటరకూ ఉందని, టీడీపీ పోరాటంతోనే ఓటింగ్‌ యంత్రాలకు అనుబంధంగా ఓటు ఎవరికి పడిందీ చూసుకునే ప్రింటర్లను ఎన్నికల కమిషన్‌ వినియోగంలోకి తెచ్చిందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయాన్ని కూడా అప్రమత్తంగా గమనించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
 
 
ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరాటం
రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఢిల్లీ వేదికగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీల ఆధ్వర్యంలో ఢిల్లీలో సభ నిర్వహించి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశమంతటికీ తెలిసేలా వివరించాలని, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు వివిధ హామీల అమలుపై ధర్నాలు నిర్వహించాలని కూడా నిశ్చయించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా టీడీపీ ఎంపీలు వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించి వేడి పుట్టించాలని చంద్రబాబు సూచించారు. కాగా, నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ 55ు బూత్‌కమిటీల నియామకమే పూర్తికావడంపై మంత్రి లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలినవి త్వరగా పూర్తి చేయాలన్నారు.
 
 
ఖాళీగా ఉండి ఈ సమావేశం పెట్టానా?
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. గుంటూరుజిల్లా ఎమ్మెల్యేలు బాగా తక్కువ హాజరు కావడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాళ్లకే పనులున్నాయా? నాకు లేవా? నేను ఖాళీగా ఉండి ఈ సమావేశం పెట్టానా? పార్టీ సమావేశమంటే అంత నిర్లక్ష్యమా? రెండు గంటలు తీరిక లేని వారికి పదవులెందుకు? తప్పుకొని వేరే వారికి ఇవ్వండి’ అని మండిపడ్డారు. రాని వారి నుంచి వివరణ తీసుకుని తనకు పంపాలని ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును ఆదేశించారు. ‘నాకు ఏమీ తెలియదని భ్రమలో ఉంటున్నారేమో! నాకన్నీ తెలుసు. ప్రతి ఒక్కరి సమాచారం నా వద్ద ఉంది. ఏ సమయంలోనైనా నా నుంచి మీకు ఫోన్‌ రావచ్చు. అన్నీ చెబుతా. దిద్దుకుంటే సరేసరి... లేకపోతే మీ వ్యవహారాలు అందరి ముందే చెబుతా. ఇన్‌చార్జి మంత్రులు కూడా మరింత బాధ్యతాయుతంగా ఉండాలి’ అని సీఎం సూచించారు.
 
 
కార్యకర్తలకు దూరమైతే నాకూ దూరమైనట్లే!
ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల పనితీరుపై ప్రతి నెలన్నరకోసారి పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ‘టీడీపీ కార్యకర్తలు నిస్వార్థానికి మారు పేరు. గొంతెమ్మ కోరికలు కోరేవారు కాదు. పార్టీ అంటే ప్రాణమిస్తారు. వారితో నాయకులు సత్సంబంధాలు నెరపాలి. కార్యకర్తలు, ప్రజలతో మమేకం కావాలి. మీరు వారికి దూరమైతే నాకు కూడా దూరమవుతారు. వారితో మీరు బాగున్నంతవరకే నా వద్ద మీకు గౌరవం’ అన్నారు.

Share this post


Link to post
Share on other sites

Naaku KA elections mundu anipinchindi but KA lo congress rule lo vundi kada emi cheyyaleru ee Baffas anukunna, might be Central EC managed to remove some % of Muslim votes randomly. Bulk ga ayithe doriki potharu. 

Muslims live mostly in Cities, Towns & Mandal HQs so difficult to find out.

STs, Dalits, BCs votes teesthe tondaraga trace out cheyyochhu, not easy in case of muslims.

Share this post


Link to post
Share on other sites

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×