Jump to content

CBN and KCR (?) will attend

Recommended Posts

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి చంద్రబాబు!

ఈనాడు, అమరావతి: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే అవకాశముంది. ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనేదానిపై మంత్రుల అభిప్రాయం తీసుకునేందుకు ఆదివారం ఆయన టెలీకాన్ఫెరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులంతా మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఏకగీవ్రంగా సూచించారు. ‘దేవగౌడతో మీకు సాన్నిహిత్యం ఉంది. గతంలో మనం గుంటూరులో నిర్వహించిన రైతు కోసం సభకు ఆయన వచ్చారు. ఆయన్ను ప్రధాని చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారు. జనతాదళ్‌ (ఎస్‌)తో మీకు సాన్నిహిత్యం ఉంది. కుమారస్వామే స్వయంగా ఫోన్‌ చేసి మిమ్మల్ని ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి వెళ్తే దేశానికి సరైన సంకేతం వెళ్తుంది.’ అని మంత్రులు సూచించగా...చంద్రబాబు దీనిపై సానుకూలంగా స్పందించారు. 

బెంగళూరు వెళ్లాలా? వద్దా? 
పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటక సీఎంగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నిహిత నేతలతో ఆదివారం చర్చించినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారానికి రావాలంటూ కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ సీఎంను శనివారం ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం ఆదివారం పార్టీ నేతలతో చర్చించారు. ‘దేవెగౌడ, కుమారస్వామి తనకు సన్నిహితులు. తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. తెరాస నిర్వహించిన సమావేశాలు, సభలకు హాజరయ్యారు. తాము ప్రతిపాదిస్తున్న జాతీయ సమాఖ్య కూటమినీ స్వాగతించారు. దానికి అనుకూలంగా మాట్లాడారు. బెంగళూరు వెళ్లినప్పుడు స్వాగతం పలికి ఆతిథ్యం కూడా ఇచ్చారు’ అని సీఎం నేతలకు వివరించినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారానికి రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలు హాజరవుతున్నందున...వారితో వేదికను పంచుకోవడం వల్ల ఏర్పడే పరిస్థితుల గురించి కూడా ఈ సందర్భంగా సీఎం నేతలతో చర్చించగా..‘ఆహ్వానం మేరకు బెంగళూరు వెళ్తేనే బాగుంటుందని’ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారానికి గడువు ఉన్నందున మంగళవారం తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...