Jump to content

ప్లాన్ ప్రకారమే గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను బీజేపీ చంపించిందని సీపీఐ నేత న

Recommended Posts

ప్లాన్ ప్రకారమే గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను బీజేపీ చంపించిందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. నయీమ్ బ్రతికి ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జైలుకు వెళ్లేవారని, సీఎం కేసీఆర్‌కు నిజాయితీ
22-03-2018 16:48:18
 
హైదరాబాద్: ప్లాన్ ప్రకారమే గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను బీజేపీ చంపించిందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. నయీమ్ బ్రతికి ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జైలుకు వెళ్లేవారని, సీఎం కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సిట్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నయీమ్ డైరీని ఎందుకు దాచిపెడుతున్నారని, నయీమ్ కేసులో అసలైన దోషులను వదిలిపెట్టారని దుయ్యబట్టారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి నయీమ్ కేసులో దోషులను శిక్షించాలని, నయీమ్ బాధితులకు న్యాయం చేయాలని నారాయణ కోరారు.
Link to comment
Share on other sites

Do not know much about the above news, except vaguely hearing about this particular notorious gang member, getting killed in police ops. some time ago. It appears Communists & Commonsense do not jell together that much, one of the chief reason they lose time and again at polls.

Here it is , there are right roads to go and attack your opponents, and there are not so intelligent ways like these; Communists always have a knack of finding the ways, that will go against the grain of the overwhelming majorities of the people; Sure it is a skill they only can conjure and have audacity to put out....Not smart to say the least.

Simple suggestion, when there are  issues about antisocial gangs, radical Islamists, issues related to expansionist China, topics about hate mongering Pakistan, and also general sentiments that disparage overwhelming majorities of people - repair and calibrate your ethical compass so that will side with good people of  India...Do not make things harder for yourself..

Link to comment
Share on other sites

5 hours ago, Sr Fan said:

nayeem is not only confined to TG uncle :) nayeem peru chepthe ne susu 

Link to comment
Share on other sites

‘నయీంను చంపించింది కేసీఆర్ కాదు.. అమిత్‌షానే’...
23-03-2018 10:45:10
 
636573987098836518.jpg
  • నయీం పోయినా.. అనుచరుల ఆగడాలు ఆగలేదు..
  • వ్యవస్థీకృత నేరసామ్రాజం అంతానికి సిట్టింగ్‌ జడ్జీతో విచారించాలి
  • నయీం బాధితుల సంఘం సమావేశంలో నారాయణ
 
గ్యాంగ్‌స్టర్‌ నయీంను చంపించింది కేసీఆర్‌ కాదు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. గుజరాత్‌లో సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు విచారిస్తున్న సీబీఐ ముందుకు నయీం వస్తే శిక్ష పడి జైలుకు వెళ్లాల్సివస్తుందనే భయంతోనే అమిత్‌షా ఎన్‌కౌంటర్‌ చేయించాడని యాదాద్రిలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.
 
యాదాద్రి, నల్గొండ (ఆంధ్రజ్యోతి) : కిడ్నాపులు, హత్యలు, బెదిరింపులు, బలవంతపువసూళ్లు, భూకబ్జాలతో వేల కోట్ల అక్రమార్జనలు, చీకటి సామ్రాజ్యం స్థాపించిన గ్యాంగ్‌స్టర్‌ నయీమొద్దీన్‌ చంపించింది సీఎం కేసీఆర్‌ కాదని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు.. గుజరాత్‌లో సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు విచారిస్తున్న సీబీఐ ముందుకు నయీం వస్తే.. తనకు శిక్ష పడి జైలుకు వెళ్లాల్సివస్తుందనే భయంతో పక్కా ప్రణాళికతో ఎన్‌కౌంటర్‌ చేయించాడని, అనంతరం తన చేతులకు రక్తం పూసుకున్నంటుగా సీఎం కేసీఆర్‌ తానే నయీంను అంతమొందించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడని పేర్కొన్నారు.
 
cpi-300.jpgయాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నయీం భాదితులకు న్యాయం చేయాలని కోరుతూ వామపక్ష, ప్రజాసంఘాలు నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నయీం అతడి ముఠా చేసిన నేరాలు.. ఘోరాలు వ్యక్తిగా చేసినవి కాదని, అవి వ్యవస్తీకృతంగా ప్రభుత్వం, పోలీసులు కలిసి చేసినవేనని అన్నారు. అందుకే నయీం పోయినా.. నేరాలు ఆగలేదని, అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నార ని, భువనగిరితో పాటు ఇతర జిల్లాలో నయీం భయం నీడలు వెంటాడుతున్నాయన్నారు. అచ్చంపేటకు చెందిన శేషన్నను అరెస్టు చేయకపోవడం వెనుక పోలీసుల లక్ష్యం అతడిని మరో నయీంగా తయారు చేయడమేనని ఆరోపించారు.
 
వ్యవస్తీకృత నేరాలు ప్రభుత్వం, పోలీసుల సహకారంతోనే కొనసాగుతాయని, నయీం ఘటనలో కూడ రాష్ట్రంలో పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కేసీఆర్‌తో సహ, హోంమంత్రులు, డీజీపీలు అందరికి భాగస్వామ్యం ఉందని, లేదంటే.. యాదాద్రి నరసింహుడి వద్ద ప్రమాణాలు చేస్తారా అని ప్రశ్నించారు. అందుకే నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత కేసును సిట్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నారన్నారు. నయీం కేసులో ప్రమేయంగల పోలీసులు, రాజకీయ నాయకులను శిక్షించాలని హైకోర్టులో తాము వేసిన వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నందునే కేసు ఇంకా కొనసాగుతోంద ని, లేకుంటే ఎప్పుడో కేసును మూసివేసేవారన్నారు.
 
నయీం వద్ద లభ్యమైన డైరీని ఎందుకు బహిర్గతం చేయడం లేదని, అంటకాగిన రాజకీయ నాయకులు, పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితులను, ప్రజలను పక్కదారి పట్టించడానికే కొంతమంది తలకుమాసిన వారిని అరెస్టులు చేసి పెద్దతలకాయలను వదిలిపెట్టారని ఆరోపించారు. ఇటువంటి వ్యవస్థీకృత నేర వ్యవస్థ అంతం కావాలంటే.. నయీం వంటి దుర్మార్గులు మళ్లీ పుట్టకుండా ఉండాలంటే ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నయీం బెదిరించి దౌర్జన్యంగా ఆక్రమించిన భూములు, భవనాలు, ఇళ్ల స్థలాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని భాదితులకు అందించాలన్నారు.
 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట రెడ్డి మాట్లాడుతూ నయీం ఎన్‌కౌంటర్‌ జరిగినపుడు దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ఈ ఘటనలో సంబంధం గల వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నయీం డైరీని దొంగల్లా దాచి పెట్టారని, దానిని వెంటనే బయట పెట్టాలన్నారు. కేసును సీబీఐకి అప్పగించినపుడే బాదితులకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో బాధితుల న్యాయ పోరాట కమిటీ అధ్యక్షుడు జగదీష్‌ యాదవ్‌, సీపీఐ జిల్లా నాయకులు యానాల దామోదర్‌రెడ్డి, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి చందర్‌, జిల్లా అధ్యక్షుడు బట్టు రాంచంద్రయ్య, నాయకులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...