Jump to content

Prakruthi vyavasayam


Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply

Top Posters In This Topic



రాష్ట్రంలో 2లక్షల కంపోస్ట్‌ యూనిట్లు యోతి): రాష్ట్రంలో రెండు లక్షల నాడెప్‌ కంపోస్ట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో ఇప్పటికే 35,666 వర్మీ కంపోస్ట్‌ పిట్స్‌ గ్రౌండ్‌ అయ్యాయి. ఈ యూనిట్లు ఎక్కువగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయగా.. గుంటూరులో అతితక్కువ కంపోస్ట్‌ యూ నిట్లు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది.
Link to comment
Share on other sites

ఖర్చు లేని సాగు
 
636114072447235949.jpg
  • నాలుగేళ్లలో 5 లక్షల మంది రైతులతో సేంద్రియ, ప్రకృతి సేద్యం లక్ష్యం 
  • జెడ్‌బీఎన్‌ఎఫ్‌పై ఏపీ సర్కారు దృష్టి.. తోడ్పాటుకు విప్రో అంగీకారం 
  • అమలుకు రూ.550 కోట్లు.. విప్రో సహకారం దాదాపు 200 కోట్లు 
  • అక్టోబరు చివరి వారంలో వర్క్‌షాప్‌.. నవంబర్‌లో అవగాహన ఒప్పందం
హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో వారసత్వంగా వస్తున్న సమస్యలు, తప్పుడు సాంకేతికత వల్ల.. సాగు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. దీంతో వ్యవసాయంపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న సన్న, చిన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, పూట గడవని స్థితిలో కూలీలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో.. రైతులను, వ్యవసాయ రంగాన్ని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా జీరో బడ్జెట్‌ ప్రకృతి సాగు(జెడ్‌బీఎనఎ్‌ఫ) అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధం అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుకు రూ 550 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఏపీ సర్కారు విధానాలు నచ్చడంతో కార్పోరేట్‌ దిగ్గజ సంస్థ విప్రో.. రైతులకు అండగా నిలవడానికి, ప్రకృతి వ్యవసాయానికి సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. ఈ పథకంలో దాదాపు రూ.200 కోట్ల భారాన్ని పంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తక్కువ ఖర్చుతో సాగును లాభదాయకం చేయడమే ఈ జీరో బడ్జెట్‌ వ్యవసాయ లక్ష్యం. నాలుగేళ్లలో 5 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ వెల్లడించింది.
 
ఇవీ లక్ష్యాలు..
  •  జీరో బడ్జెట్‌ వ్యవసాయంలో ప్రధానమైనది ఖర్చు తగ్గించడం. దీంట్లో భాగంగా రైతులు వ్యవసాయానికి అవసరమైన వాటిని బయటి నుంచి కొనుగోలు చేయకుండా, గ్రామంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని, ఎక్కువ దిగుబడులు పొందుతారు. 
  •  విత్తన శుద్ధి.. తాము పండించిన పంటల నుంచి రైతులు ఎలాంటి రసాయనాలూ కలపకుండానే విత్తన శుద్ధి చేసుకునేలా రైతులకు శిక్షణ ఇస్తోంది. దీంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ఖర్చు తగ్గుతుంది. 
  • భూసారం పెంచడం.. రైతులు ఇప్పటికే అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. దాన్ని తగ్గించే విధంగా రైతులను ప్రోత్సహించడం. సేంద్రియ పదార్థాలు వాడి భూసారం పెంచుకునేలా చేయడం. 
  •  మల్చింగ్‌.. భూమిలో తేమ నిలకడగా ఉండటానికి ఎండుగడ్డి, వరిపొట్టు వంటివాటితో మొక్కల చుట్టూ నేలను కప్పి ఉంచడం. ఈ విధానం ద్వారా భూమి సమతౌల్యాన్ని కాపాడి అధిక దిగుబడులు సాధించడం. 
  •  కీటకాలబారి నుంచి రక్షణ.. రైతులు సాగు చేసిన పంటలకు రసాయనాలు వాడకుండా చూసి, ప్రకృతి సిద్ధమైన వేప నూనె, ఆవు మూత్రం, ఆవు పేడ వంటి వాటితో కీటకనాశినులు తయారు చేసుకునేలా శిక్షణ ఇవ్వడం. 
  •  వర్షాభావం వల్ల, అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినకుండా కాపాడటం. 
  •  గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేసి వారు తయారు చేసిన ఉత్పత్తులను వారే అమ్ముకునేలా మార్కెట్‌ సౌకర్యం కల్పించడం. 
  • రైతులకు ఉపాధి కల్పన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ. 
  •  జీరో బడ్జెట్‌ సాగు ద్వారా రైతుకు ప్రతి రెండున్నర సెంట్లకు రూ.12 వేల నుంచి 16 వేల దాకా ఆదాయం వచ్చేలా చేయడం. 
అంతర్జాతీయంగా ప్రశంసలు..
ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ప్రపంచ బ్యాంకు, యూఎనడీపీ, ఎఫ్‌ఏవో వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపించాయి. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడాన్ని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం కూడా ప్రకృతి, సేంద్రియ సాగుని భారీ స్థాయిలో చేపట్టాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి చేయూత ఇవ్వడానికి అజీమ్‌ప్రేమ్‌జీ ఫిలాంత్రఫిక్‌ ఇనిషియేటివ్స్‌(ఏపీపీఐ) ముందుకు వచ్చింది. 9 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, అజీమ్‌ప్రేమ్‌జీతో బెంగుళూరులో సమావేశం అయ్యారు. అక్టోబరు చివరివారంలో ఏపీలో వర్క్‌షాపు జరగనుంది. నవంబరులో ప్రభుత్వం, అజీమ్‌ప్రేమ్‌జీ సంస్ధతో ఎంవోయూ చేసుకోవడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. అజీమ్‌ప్రేమ్‌జీ గ్రూపు రూ.200 కోట్లు దీనికి కేటాయించి.. చిన్న, సన్నకారు రైతులకు సాంకేతిక సహకారం అందించనుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ప్రకృతి సేద్యంలో ‘విప్రో’ సాయం
 
గుంటూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలనే కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రఖ్యాత విప్రో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌడేషన్‌తో కలిసి రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రానున్న ఐదేళ్లపాటు విప్రోతో కలిసి పనిచేసేలా రూ.200 కోట్లతో ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకోబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో విప్రో సంస్థ ప్రతినిధులు అన్వర్‌, మురళి, జుల్ఫికర్‌లు గుంటూరులో శనివారం భేటీ అయ్యారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని ఉత్పత్తులను సాధించడం కోసం విప్రో సంస్థ ప్రభుత్వంతో కలిసి పని చేయనుంది. దేశ వ్యాప్తంగా ప్రకృతి సేద్యంలో ఏపీ ముందున్నట్లు విప్రో సంస్థ ప్రతినిధులు అన్వర్‌, మురళి, జుల్ఫికర్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా విప్రో సంస్థ పదేళ్ల నుంచి ప్రకృతి సేద్యంలో పనిచేస్తున్నట్లు చెప్పారు. పర్యావరణానికి హాని కలిగే విధంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో దేశ వ్యవసాయ ఉత్పత్తులను కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడం లేదని చెప్పారు. దీనివల్ల దేశ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లభించడం లేదన్నారు.
 
ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం
ఏపీ ప్రభుత్వం ప్రకృతి సేద్యం, ప్రాకృతిక వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి పుల్లారావు చెప్పారు. ‘చంద్రన్న రైతు క్షేత్రాల’ పేరుతో ప్రకృతి సేద్యాన్ని క్షేత్ర స్థాయిలో చేపట్టినట్టు వివరించారు. ప్రకృతి సేద్యంపై విప్రో ప్రతినిధులతో సీఎం సమక్షంలో ఎంవోయు చేసుకోనున్నట్లు చెప్పారు.
 
నెలాఖరు లోపు కరువు సాయం
2015-16 సంవత్సరానికి సంబంధించి కరువుసాయాన్ని ఈ నెల 31లోపు రైతులకు అందిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సాయానికి సంబంధించి రూ.678 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కర్నూలులో సీఎం చంద్రబాబు చేతుల మీదగా కరువుసాయం పంపిణీని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 245 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించామన్నారు. ఆ మండలాల్లో రైతులకు వ్యవసాయ, ఉద్యానవన పంటలకు ఇనపుట్‌ సబ్సిడీ ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తామన్నారు. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా రూ.950 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిని కూడా డిసెంబర్‌ నెలాఖరులోపు రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
క్లస్టర్‌ విధానంలో ప్రకృతి సేద్యం
 
  • ఐదేళ్లలో.. 5 లక్షల మంది రైతులతో సాగు
  • రైతు సాధికార సంస్థకు బాధ్యతలు అప్పగింత
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): క్లస్టర్‌ విధానం ద్వారా ప్రకృతి సేద్యాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాషీ్ట్రయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కెవివై) ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల మంది రైతులతో సేంద్రియ సాగు చేపట్టాలని లక్ష్యం గా పెట్టుకుంది. సుమారు 300 మంది రైతులతో మండలాన్ని ఒక క్లస్టర్‌గా.. రాష్ట్రంలో 291 క్లస్టర్‌లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 131 క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించింది. ఒక్కో క్లస్టర్‌ నుంచి 30 మంది రైతులను ఎంపికచేసి వారి ద్వారా మిగిలినచోట్ల సేంద్రియ సాగును విస్తరించేందుకు విధానాలు రూపొందించింది. దీనిలో భాగంగా వివిధ గ్రామాల్లో ప్రకృ తి సేద్య ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహిస్తోంది. క్లస్టర్‌ విధానంలో సేంద్రియ విధానంపై సంతృప్తి చెందిన విప్రో సంస్థ చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ చిన్న, సన్నకారు రైతుల సంక్షేమానికి తమ వంతు చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. దీనితో రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అమలు బాధ్యతను రైతు సాధికార సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సాధికార సంస్థ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ మంత్రి, కో వైస్‌ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు, వ్యవసాయ, అనుబంధ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌, పౌర సమాజం నుంచి ముగ్గురు ప్రతినిధులు, ప్రకృతి సేద్యం చేసే రైతులు ముగ్గురు, ఏపీపీఐ ప్రతినిధి, రైతు సాధికార సంస్థ సీఈఓలతో అడ్వైజరీ బోర్డును ఏర్పాటుచేస్తూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
సేంద్రియ సాగులో 30వేల మంది రైతులు
 
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సేంద్రియ సాగుకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ ధనుంజయరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సాగు పరిస్థితులపై కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ఏడాది రాష్ట్రంలో 131 క్లస్టర్లలో సుమారు 30వేల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారని, వచ్చే ఏడాది 160 క్లస్టర్లకు సేంద్రియ సాగును పెంచుతామని తెలిపారు. సేంద్రియ సాగులో మెళకువలు తెలిసిన రైతులను ఎంపిక చేసి... వారి ద్వారా రైతు గ్రూపులకు 21 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేంద్రియ సాగు కోసం రూ.10కోట్లు కేటాయించామని వివరించారు. కాగా, యాంత్రీకరణ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం సూచించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...