Jump to content

Nagarjuna konda,Anupu


Recommended Posts

  • Replies 90
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Ancient Buddhist site set to come alive with cultural programmes after two millennia

 

3-day Anupu Festival–2016 showcasing India’s rich Buddhist heritage to be inaugurated on Friday

 

HYDERABAD: Anupu, a hitherto little known site of Buddhist excavation on the banks of River Krishna near Nagarjunasagar Dam will host cultural programmes from Friday afternoon, against the backdrop of an amphitheatre, after 1,700 years.

 

A 3-day Infosys Foundation Anupu Festival–2016 will showcase cultural programmes against the backdrop of the amphitheatre for the first time after it was reconstructed on an 80-hectare stretch at Anupu by the Archaeological Survey of India.

The ruins of an ancient Buddhist university, established by Acharya Nagarjuna, that was excavated between 1955 and 1967 when the dam was being built, have been reconstructed at Anupu, in Guntur district of neighbouring Andhra Pradesh, said the Foundation’s chairperson Sudha Murty here on Thursday at a curtain raiser.

 

Steeped in history

 

Every centimetre of the amphitheatre has a history. She explained that an ‘Aswamedhakunda’, possibly the only one of its kind in India, was housed in the museum on Nagarjunakonda island in the middle of the backwaters of Nagarjunasagar Dam on River Krishna, the amphitheatre was translocated to Anupu during the construction of the multipurpose project, she explained.

 

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu is scheduled to attend the inauguration of the festival. Infosys executive vice-president Binod Hampapur and assistant VP Infosys Development Centre at Hyderabad Manisha Saboo are expected to participate in the programme.

 

On Friday a 3-day artist camp on the topic ‘Landscape of Anupu’ will begin at the Matha Sarovar Resort in Vijayapuri South in Guntur district in Andhra Pradesh, with 16 artists from across the country at work.

 

Rich heritage

 

 

The Anupu Festival is the second one organised by the Foundation, after a similar one held this March at Lakshmeshwara in Gadag district of Karnataka, Mrs Murty said.

 

The festival will be inaugurated by Buddhist monks after paying floral tributes to Lord Gauthama Buddha.

The festival is a celebration of India’s rich Buddhist heritage and the ancient monument will reverberate with traditional performing arts events, including folk dances of Andhra and classical dance forms and instrumental and devotional music.

Link to comment
Share on other sites

సుధామూర్తి కృషి అభినందనీయం
 
636169366352471578.jpg
  • అనుపు ఉత్సవాల్లో మంత్రి ప్రత్తిపాటి
 
విజయపురిసౌత్‌, డిసెంబరు 9: ఆచార్య నాగార్జునుడు నడయాడిన అనుపునకు ప్రత్యేక గుర్తింపు రావడానికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి చేస్తున్న కృషి అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం అనుపులో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అనుపు ఉత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. 1600 ఏళ్ల నాటి ఇక్ష్వాకుల వైభవాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను ఆంధ్రా ప్రజలకు తెలియజేసేలా ఈ కార్యక్రమం నిర్వహించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశంవల్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. ఇన్ఫోసిస్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి మాట్లాడుతూ నిర్మాణ చాతుర్యం, సుసంపన్నమైన విలువలు, సంప్రదాయ కళారూపాలతో కూడిన పురాతన భారతదేశ ఘన వారసత్వ సంపదలకు ప్రతీకగా నాగార్జున కొండ, అనుపులు ఉన్నాయన్నారు. మూడు రోజులల ఉత్సవాలు ఆనాటి వైభవాన్ని తిరిగి ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వేదికపై ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. బౌద్ధ సన్యాసులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, ఖమ్మం, పశ్చిమగోదావరి కళాకారులు జానపద, వీర, గరళ నాట్యంతోపాటు షేక్‌ యాకూబ్‌, బడే సాహెబ్‌ల నాదస్వరం ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో మంత్రి రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపునేని రాజకుమారి, కలెక్టర్‌ కాంతిలాల్‌దండే తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 5 weeks later...

పర్యటకం.. ప్రగతికి సోపానం
సాగర్‌ బౌద్ధక్షేత్రంలో విస్తృతం కాని సౌకర్యాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తే వసతులు
విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే
image.jpg

రాష్ట్రంలో ప్రఖ్యాత విహార కేంద్రంగా పేరుగాంచిన నాగార్జునసాగర్‌లో యాత్రిక ఆకర్షణలు, సౌకర్యాలు 30 ఏళ్ల క్రితం ఏర్పడినవే కొనసాగుతున్నాయి. నిర్వహణ లోపం వల్ల ఆకర్షణలు రూపు మాస్తున్నాయి. నాగార్జున డ్యాంతో పాటు, బౌద్ధక్షేత్రం కూడా నాగార్జునసాగర్‌లో సుప్రసిద్ధమైంది. దేశ విదేశాల్లో నాగార్జునకొండ విశిష్టతను గురించి విశేషంగా ప్రచారం చేయడంలో ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, ఆకర్షణలు, సౌకర్యాలు కలిగించడంలో చూపడం లేదు. ఈ కారణంగానే మన దేశానికి వచ్చే విదేశీ యాత్రికుల్లో కొద్దిమంది మాత్రమే సాగర్‌కు వస్తున్నారు. నాగార్జునసాగర్‌ డ్యాం నిర్మాణం కారణంగానే నాగార్జునకొండ ఐలాండ్‌ మ్యూజియం ప్రముఖ బౌద్ధక్షేత్రంగా ఖ్యాతి పొందింది.

క్రీ.శ. 1, 2వ శతాబ్దంలో ఇక్ష్వాకు రాజులు పాలించే కాలంలో ఆచార్య నాగార్జునునిచే పునీతమైన పవిత్ర ప్రదేశంగా 1926లో పురావస్తు శాఖ దక్షిణ విభాగ సహాయకుడు ఎ.రంగస్వామి సరస్వతి నాగార్జునసాగర్‌ ప్రాంతాన్ని గుర్తించారు. ఉన్నతాధికారులు లాంగ్‌హార్డ్స్‌, రామచంద్రన్‌ కొంతకాలం పరిశోధనల ఫలితంగా అపారమైన బౌద్ధ సంపద వెలుగులోకి వచ్చింది. జలాశయ నిర్మాణ ప్రతిపాదన జరిగినప్పుడు అంతర్జాతీయ బౌద్ధ సంఘం బౌద్ధ శిల్పకళా ఖండాలు, కాలగర్భంలోకి కలసి పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్పందించి నేటి ఐలాండ్‌ మ్యూజియం రూపకల్పనకు ఆదేశాలు జారీ చేశారు. ఈనాడు ప్రపంచంలోని ద్వితీయ ఐలాండ్‌ మ్యూజియంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ భవనంలో ఉన్న బుద్ధుని పాలరాతి విగ్రహం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీనికే ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా మూడుసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు పూజ చేశారు. నాగార్జునకొండ మీద బహిరంగ ప్రాంగణంలో పునర్నిర్మితమైన మహా చైత్యం కారణంగానే ఇది నేడు ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా కీర్తి పొందింది. దీని కిందనే ‘బుద్ధ ధాతువు’ లభించింది. ఇది నేడు మ్యూజియం ప్రత్యేక భద్రతలో ఉంది. నాగార్జునకొండ మ్యూజియం ప్రారంభించి నాలుగు దశాబ్దాల కాలానికి చేరినా నేటికీ యాత్రిక సౌకర్యాలు, ఆకర్షణలు సమకూరలేదు. పవిత్రమైన బుద్ధ ధాతువును విహార యాత్రికులు దర్శించే అవకాశం లేదు. అలనాటి బంగారు మకర కుండలాలు, సన్నజాజుల ఆభరణాలను కూడా చూసే అవకాశం లేదు. ఆంధ్రులు విదేశాల్లో వర్తక వాణిజ్యాలు చేశారనడానికి నిదర్శనంగా ఇక్కడ తవ్వకాల్లో లభించిన రోమన్‌ నాణేలను కూడా ప్రదర్శించడం లేదు. వీటిని బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గాజు పెట్టెల్లో పెట్టి యాత్రికులు దర్శించేలా ఏర్పాటు చేయాలి. మ్యూజియంలోని శిల్పాల్లో ఉన్న చారిత్రక మతగాథలను తెలుసుకునే అవకాశం లేదు. గోల్కొండ కోటలో మాదిరిగా లైట్‌ అండ్‌ సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేస్తే యాత్రికులకు చారిత్రక బౌద్ధారామాల గురించి ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. గతంలో ఈ విషయంపై ప్రభుత్వం పలుమార్లు ప్రకటనలు చేసింది. నాగార్జునకొండ మీద రెండు రోజులు గడపాలంటే అవకాశం లేదు. వసతి గృహం ఉన్నా సౌకర్యాలు లేవు. దక్షిణ విజయపురి నుంచి కొండకు 40 నిమిషాల లాంచీ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో నాగార్జునసాగర్‌ జలాశయం గురించి, దీని విశిష్టత గురించి వీడియో, ఆడియో ద్వారా తెలుపుతూ, మ్యూజియం ప్రత్యేకతను వీనులవిందుగా వినిపింపజేస్తే యాత్రికులు తామొక బౌద్ధ ప్రపంచంలోకి అడుగిడుతున్నామనే భావన కలిగి.. కొండ మీదకు చేరేసరికి ఒక తాథాత్మ్యత భావంతో ఉంటారు. మ్యూజియాన్ని బహిరంగ ప్రాంగణంలో ఉన్న పునర్నిర్మిత పురావస్తు కట్టడాలు చూడటానికి కేవలం గంటన్నర సమయమే ఉంటుంది. ఈ స్వల్ప సమయంలోనే అన్ని శిల్పాలను దర్శించే వీలు లేకుండా మళ్లీ లాంచీ వద్దకు చేరుకోవాలి.

కదలిక లేని ప్రతిపాదనలు
జపాన్‌ తదితర బౌద్ధ దేశాల ఆర్థిక సహకారంతో కోట్లాది రూపాయల వ్యయంతో టూరిస్టు కాంప్లెక్సు నిర్మాణం చేయాలనే ప్రతిపాదనలకు కదలిక లేదు.

జలాశయంలో జలక్రీడల ఏర్పాటు గురించి ప్రకటనలు మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి వెలువడుతున్నాయి. చి 1981లో ప్రారంభించిన బుద్ధజ్యోతి పథకం అర్ధంతంగా నిలచింది.

సాగర్‌ వద్ద బుద్ధ విగ్రహం, టైగర్‌ వ్యాలీని బొటానికల్‌ గార్డెన్‌గా అభివృద్ధి చేయడం, దక్షిణ విజయపురిలో లాండ్‌స్కేప్‌ గార్డెన్‌, లోటస్‌ గార్డెన్‌, జలాశయం మధ్యలో ఉన్న సింహగిరి కొండను ఆకర్షణీయంగా రూపొందించడం ఈ పథకంలో భాగం. చి కేంద్ర ప్రభుత్వాన్ని నిధుల కోసం రెండు దశాబ్దాల కాలం నుంచి కోరుతున్నా స్పందన లేదు.

నాగార్జునకొండకు సామాన్య యాత్రికుల కోసం రోప్‌వే ప్రతిపాదన కూడా అటకెక్కి, మరుగున పడింది. చి చిల్డ్రన్స్‌ ట్రైన్‌ ప్రతిపాదన కూడా విస్మరించారు.

విజయవిహార్‌ అతిథి గృహంలో 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన డీర్‌ పార్కు నిరాదరణకు గురైంది. దీనిలో జింకలు లేవు. జలాశయం మధ్యలో ఉన్న చాకలిగట్టుకొండను 1976లో ఐలాండ్‌ డీర్‌పార్కుగా ప్రకటించి మెట్లు కూడా కట్టారు. తర్వాత పట్టించుకోలేదు. చి సాగర్‌- శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం పెద్ద ఆకర్షణగా ఉన్నా ఇందుకు యాత్రికులు నోచుకోవడం లేదు. ఈ విహారయాత్ర కూడా ప్రకటనలతోనే సరిపెడుతున్నారు. కొత్త లాంచీల కొనుగోలు విషయం కూడా నత్తనడకనే నడుస్తోంది.

ప్రయాణ సౌకర్యం లేని దర్శనీయ స్థలాలు
దక్షిణ విజయపురికి 7 కి.మీ. దూరంలో జలాశయ తీరాన పునర్నిర్మాణమైన ఇక్ష్వాకుల నాటి క్రీడా ప్రాంగణాన్ని దర్శించే అవకాశమే లేదు. రోమన్‌ వాస్తు సంప్రదాయం ప్రకారం నిర్మించినా దీని ఉనికిని విస్మరిస్తున్నారు. ఇక్కడికి రవాణా సౌకర్యం లేనందున యాత్రికుల దృష్టిలోకి వచ్చే అవకాశమే లేదు. ఇదే ప్రాంతంలో కొన్ని స్తూపాలు, రంగనాథస్వామి ఆలయం ఉన్నా ప్రయాణ సౌకర్యం లేదు. ఎత్తిపోతల జలపాతానికి కూడా ప్రయాణ సౌకర్యం కల్పించలేదు. నాగార్జునసాగర్‌ డ్యాం ప్రపంచంలోని రాతి కట్టడపు ఆనకట్టల్లోకెల్లా పెద్దదనే విషయం యాత్రికులు తెలుసుకునే అవకాశం లేదు. దీని విశిష్టతను తెలియజేసే సమాచార బోర్డులను జలాశయ రెండు వైపులా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో పెట్టాల్సి ఉంది

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...