Jump to content

JAI CBN


NatuGadu

Recommended Posts

చంద్రబాబుకు-4 గంటలు -చిరంజీవికి 9గంటలు

 

చంద్రబాబుకు తోడుగా కాలిబాటన తిరుమల మెట్లెక్కడం పార్ర ంభించిన టీడీపీ ఎమ్మెల్యేలు మధ్యలోనే చతికిలపడిపోయారు. విలేఖరులు పోలీసులు సొమ్మసిల్లిపోయారు. బ్లాక్‌క్యాట్ కమెండోలూ అక్కడక్కడ సేదదీరారు. కానీ బాబు నడక మాత్రం ఎక్కడా ఆగలేదు. మధ్యాహ్నం 2.40 నుంచి రాత్రి 7.20 వరకు నడక సాగింది. ఈ 4 గంటల 40 నిముషాల్లో భోజనం విలేఖరుల సమావేశాలు దారిలోని ఆలయాల సందర్శన సుదర్శన కంకణాల కోసం ఓ గంటసేపు నడక ఆపినాభోజనం చేయడానికి మినహా మరెక్కడా కూర్చోకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీ నాయకులు కూర్చోవాలని అభ్యర్థించినా.. కూర్చుంటే కండరాలు పట్టేస్తాయి మళ్లీ నడవలేమంటూ ముందుకే కదిలారు. 7.20కి తిరుమల టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. దారిలో అక్కడక్కడా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ దారిన ఎక్కేదిగే భక్తులను పలకరిస్తూ చిన్నారుల బుగ్గలు నిమురుతూ ముందుకు సాగారు. మెగాస్టార్ చిరంజీవికి కొండ ఎక్కడానికి 9గంటల సమయం పట్టడం గమనార్హం. చంద్రబాబు నడక వేగాన్ని అందుకోవడానికి అవస్థపడిన విలేఖరులు మీ నడక వెనుక రహస్యమేంటని అడగగా కఠోరమైన క్రమశిక్షణేనని సమాధానం ఇచ్చారు. "గత 32 ఏళ్లుగా రోజూ గంటా 45 నిముషాలు ట్రెడ్‌మిల్ మీద నడవడం కానీ సైకిలింగ్ కానీ చేస్తాను. అందుకే సునాయాసంగా నడుస్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడా కూర్చోలేదు ఇకపై కూడా కూర్చోను కావాలంటే చూద్దురు రండి'' అన్నారు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...