Jump to content

laxmi parvathi on CBN


pavan s

Recommended Posts

గుండెలు మండుతున్నాయని ఆవేదన చెందిన లక్ష్మీపార్వతి

 

హైదరాబాద్, జూలై 20 : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మహారాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తుంటే గుండెలు మండుతున్నాయని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ పార్వతి తీవ్రంగా ఆవేదన చెందారు.

 

చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై మహారాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తెలుగువారి ఆత్మగౌరవానికి తీరని అవమానమని ఆమె వ్యాఖ్యానించారు. ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అసలు ఏమనుకుంటోందో అర్ధం కావడంలేదని, ఇది చాలా చాలా దారుణమని ఆమె అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కలిసి ఈ సమస్యలో జోక్యం చేసుకుని మనవాళ్లను గౌరవప్రదంగా తీసుకురావాలని కోరతానని ఆమె చెప్పారు.

 

వెళ్ళినవారు ఏమైనా టెర్రరిస్టులా, దొంగలా, నక్సలైట్లా మరెవరైనా? వీరంతా ప్రజా ప్రతినిధులు. బాబ్లీలో ప్రాజెక్టు చూడడానికి వెళ్లారు. అంతమాత్రానే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని ఆమె మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసుల అత్యుత్సాహాన్ని ఎండ గడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే చంద్రబాబు నాయుడుకు, ఇతర ప్రజాప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో వెంటనే స్పందించాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ కోసం ఇప్పటికే ఫోన్ చేసినట్టు ఆమె చెప్పారు.

 

మనకీ మనకీ ఎన్నయినా ఉండవచ్చు, కాని శత్రువుతో కొట్లాడేటప్పుడు మనం 105 మందిమి అన్న ధర్మరాజు మాటలను ఆమె ఉటంకించారు. ఒకవైపు తెలంగాణాలో ఉపఎన్నికలు జరుగుతుంటే చంద్రబాబు ఇలా బాబ్లీ యాత్ర పెట్టుకోవడాన్ని ఆక్షేపిస్తూనే, అది తర్వాత సంగతి అని, ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిపై లాఠీ పడింది, ఈ విషయమై అందరూ తీవ్రంగా ఖండించాలని ఆమె కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...