Jump to content

India Today Survey AP 2024


Recommended Posts

2 hours ago, Sr Fan said:

అడవి మనిషి అస్తిత్వానికి దంతాలే బలం, మాంసం వెంటనే తినాలనే తపనలో అవి పెకలించి ఇస్తే బదులుగా-  బతకటమే కష్టం భవిష్యత్తులో

( పై వార్త లో నిజముంటే  - వ్యాఖ్య )

కాలిబ్రేషన్ 

@ టీడీపీ పార్టీ 

ఆ పై పోస్ట్ లో అలా అంటే కయ్యానికి కాలు దువ్వమని కూడా  కాదు -విషయం 'టు డైమెన్షనల్' గా లేదు, మరి ఏంటి ఇది ఇంత సంక్లిష్టం గా ఉంది ? అందుకే 'నూవాన్స్' - వివరణ ఆవశ్యకం.....కమ్యూనికేషన్ లో పొరపాట్లు ఉండకూడదు 

'ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి
 అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.'

ఈ సుమతి శతకం చెప్పాలంటే ఒకింత ఇబ్బందిగా ఉంటది, ఎందుకో చెప్తాను బ్రదర్స్ ...తెలిసి తప్పు సందేశం ఎప్పుడూ ఇవ్వకూడదు.....10  ఏళ్ల తరువాత కూడా ఈ మెసేజ్ చూసినా తప్పు ఉండకూడదు....చర్విత చర్వణం అయినా గుర్తు చెయ్యాలి .. ఆ దృక్పథం తో నే - బీజేపీ తో దశాబ్దం క్రితం, 'ఎన్నికల ముందు మైత్రికి పాకులాడకూడదు, మీరు చేసింది కూడా తప్పయ్యా అని చెప్తా   ప్రజా నిర్ణయం కానిచ్చి, ఆ తరువాత మైత్రికి వెళ్లినా ధర్మం తప్పినట్లు కాదు' అని వాదన పెట్టటం మీకు తెలుసు  ....అలా చెయ్యలేదు టీడీపీ ఆతృతలో,  కొంత  ప్రలోభంతో కూడా- ఫలితాలు  అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు..రెండో తప్పు (2019 ) మొదటి తప్పు నుంచి జెనెరేట్ అయ్యింది - ప్రస్తావన అనవసరం స్థలాభావం  ....తప్పులు చెయ్యటం తప్పు కాదు ఒక్కోసారి అవుతాయి, కానీ బుద్ధి పూర్వకంగా  తప్పుల నుండి నేర్చుకోకపోవటం తప్పవుతది

పెద్దల మాట - 'స్పిరిట్'

సూక్ష్మం, ధర్మం సరిగా లోతుగా అర్థం కాకపొతే 'అవకాశవాది' కూడా (అతి)తెలివిగా ఇలాంటివి(పెద్దల/పూర్వుల మాట)  చెప్పవచ్చు, ఉపయోగించాలనుకోవచ్చు స్వార్ధ ప్రయాజనాల కోసం.......కుటిలత్వంతో ....రాజకీయాల్లో స్వార్ధ ప్రయాజనాలకు ఏ ఎండకా గొడుగు పట్టే వాళ్ళుంటారు, మనకు తెలుసు  ...అల్లాంటివి ససేమిరా ప్రోత్సహించకూడదు....తప్పు....మాటల్లో టెక్నికాలిటీ కాదు స్పిరిట్ పసిగట్టాలి( వెస్ట్రన్ కల్చర్ లో టెక్నికల్ గా కరెక్ట్ ఉండటమే చూసుకుంటారు - స్పిరిట్ లో దుర్బుద్ధి ఉన్నా , మనమలాగ కాదు,  సరిగ్గా అన్వయించుకోవాలి - ధర్మం ( సత్యం బీజం లో లేకుండా ధర్మం నిలబడదు - అది ధర్మం అని చెప్పబడదు ))

తెలుగు ప్రజలు / జాతి / ఎస్ ఎస్ 

తెలుగు ప్రజలు/జాతి - నిర్ణయం తీసుకున్నారు స్పెషల్ స్టేటస్ లాంటి వాటికోసం పోరాటం 
చేసే స్థైర్యం, ఓపిక, చిత్తశుద్ధి మాకు లెవ్వు అని నోటితో  చెప్పకనే చెప్తున్నారు పదే పదే .....ఇది నిజం....రాజకీయ పార్టీలు అవి గమనించినయ్యి - ఆ నినాదం ఎత్తుకోరు, చెయ్యి కాలుతుంది అని భయం ( జనాలకి హితబోధ చేసి తాము ముందుండి నడిపించే యుగపురుషులు అన్ని సార్లు దొరకరు రాజకీయాల్లో - ముఖ్యంగా ఆంధ్ర లో ....ఇది కూడా  నిజం )...పోల్స్ చూసుకొని యథా ప్రజా తధా రాజా నడిచే పార్టీలు ...అవన్నీ బేరీజు వేసుకోవాలి ....ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీ - తెలుగు వాళ్లకు నిజాయితీగా పనిచేస్తా ఉండాలి, అలా అని తన బలానికి మించి మొయ్యలేని కొండంత బరువును మోస్తాను అనుకోవడం వివేకవంతమైన పని కాదు, ఢాంబికమ్ అవుతుంది, మళ్ళీ బోర్లా పడకూడదనీ తెలుసు.

డైనమిక్స్ / సమీకరణం 

ఇన్ని డైనమిక్స్ ని అంచనా వేసుకుంటా సమీకరణంలో , దేశం లో రాజకీయ పవనాలు గమనిస్తా- ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ' ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టెదోదారి' అనే భావన ఇవ్వకుండా , భావ సారూప్యత ని దృష్టిలో ఉంచుకుంటా, రాష్ట్రంలో  ప్రధాన ప్రత్యర్థి మీద దృష్టి తప్పి పోకుండా, అవసరం లేని చోట అనవసరపు తగాదాలు కొని తెచ్చుకోకుండా, మళ్ళీ  తన అస్తిత్వం కి భంగం లేకుండా కూడా -  దాన కర్ణుడు అవ్వకూడదు 

పెద్దల మాట లో మర్మం ?

' ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకొని అప్పటికి అది మాట్లాడి తాను బాధపడకుండా, ఇతరులను బాధించకుండా తప్పించుకొని తిరిగేవాడే ఈ లోకంలో ధన్యుడు' సుమతి శతకం చెప్తది  - అలా రాజకీయం చేసినవాడే సూక్ష్మం తెలిసినవాడు... అలా అని స్వార్ధ ప్రయోజనాలకు నిజాయితీ లేని 'ఇచ్చకపు' మాటలు పలకాలని కాదు ..మూలం లో సత్యనిష్ఠ కి భంగం రాకూడదు...ఇక్కడ శ్రీకృష్ణుడు ఆదర్శం శకుని కాదు, కాకూడదు...ఈ వ్యత్యాసం తెలియాలి

సున్నితమైన వ్యవహారం - అదే  ప్రిసైజ్  'కాలిబ్రేషన్'

ఇది కత్తి మీద సాము లాంటిది - అంత తేలిక పని కాదు -  అస్తిత్వం నిలబెట్టుకోవాలి బలం తగ్గించుకోకుండా, అదే సమయంలో అనవసరపు గొడవ ఉండకూడదు.....ఇదే ఆచి తూచి చెయ్యాల్సిన పని  ....సున్నితమైన వ్యవహారం - నీడ్ ఆఫ్ ది టైం..... ప్రిసైజ్  'కాలిబ్రేషన్' 

_________________________________
(డిస్క్లోజర్ :   ఏ రాజకీయ పార్టీలతో కానీ, నాయకులతో కానీ, వ్యాపార ( స్థలాలు, పొలాలు, బిల్డింగ్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, పార్టీల జెండా లు కప్పుకొని కనెక్షన్స్, ప్రాపకాలు, ప్రయోజనాలు ఇతరత్రా) వ్యవహారాలు  లెవ్వు ....ఈ రాజకీయాలతో ముడిపడి ఆర్ధిక సంబంధాలు, మనుగడ లెవ్వు......ఏ విషయం ఇక్కడ పెట్టినా ఆత్మసాక్షి గా భావించిన వస్తువు మాత్రమే )

Link to comment
Share on other sites

  • Replies 99
  • Created
  • Last Reply

ituvanti oka proposal vini... AP vachi... thyaagaalaku sidhamgaa undandi ani annaarante....Meedi Gunde kaadu.... Raayi antha kannaa kaadu... Aaa padaarthaanni srustinchi devude khangu tinnatlunnaadu.

ye thyaagaalu.  Already inneellu chesina thyaagaalu chaalavaa ?  Innaallu narakam choopinchina Attha ... hospital lo chaavu bratukullo vundani santosha pade lopale.... Aada paduchu ni intiki teesukochinatlundi.  Veella chetilo baadhalu pade kodalu... meeru kaadu saab.... mee Cadre. 

meeru Jail ku velli entha baadha paddaaro meeku telusu ...... kaanee memu padda baadha, devudiki thappa inkokariki theliyadu. 

Link to comment
Share on other sites

Already.... Ram mandir glory lo BJP/Modi is Shining, and CBN wants to use it to his advantage by aligning with BJP ani start chesaaru.

Manamu eppudu geliche sthiti lo unnaa... mee Athi bhayam kaaranam gaa credit inkokari chetiki appanam gaa appaginchadam,  mammalni cheetkaaraala paalu cheyyadam... meeku vennatho pettina vidya ayi koorchundi.

Link to comment
Share on other sites

42 minutes ago, Npower said:

Already.... Ram mandir glory lo BJP/Modi is Shining, and CBN wants to use it to his advantage by aligning with BJP ani start chesaaru.

Manamu eppudu geliche sthiti lo unnaa... mee Athi bhayam kaaranam gaa credit inkokari chetiki appanam gaa appaginchadam,  mammalni cheetkaaraala paalu cheyyadam... meeku vennatho pettina vidya ayi koorchundi.

:coffee:

Link to comment
Share on other sites

Last two weeks public engagement wise party venaka padindi anipisthundi... Cbn speech ki votes etu raavu kabatti full time Background work ki settle chesthe time waste kakunda panulu munduku pothayyi... ప్రచార కమిటీ Strong Batch ni set chesi, cbn ni very few important meetings ki తిప్పితే all set... 

Link to comment
Share on other sites

ఒకటి రెండు ప్రశ్నలకు భవదీయుడి సమాధానాలు ( తెలిసినంతలో) 

ప్రశ్న :  ఇంత రాజకీయ అనుభవం ఉండి ఇప్పటి రాజకీయవేత్తలతో వెనకడుగు లో ఎందుకున్నట్లు ? 

జ : అన్ని సవాళ్ళని రాజకీయ పరిభాష లో చూస్తే అర్థమవ్వవు ......లాజికల్ గా గ్రాస్ప్ అవ్వదు.....ఇంకో ఎత్తు లో కి వెళ్లి చూడాలి ......రాజకీయం అంటూ సెపరేట్ గా ఒక పెట్టె ఉండదు, లోకంలో జరిగే విషయమే రాజకీయం లోను ఉంటది. 

కురుక్షేత్ర మహా సంగ్రామం లో అప్రమేయ యోధుడు, భగవంతుడి 'అంశ' కి  పాత్రదారుడు  అర్జనుడు  - తరువాతి కాలం లో ఒకసారి ఒక అడవి మూకల బారి నుండి  తన వెంట ఉన్న పరివారాన్ని కూడా పూర్తిగా  కాపాడుకోలేక పోతాడు నష్టం జరగకుండా  .......' ప్రతాపం '  కాలంతో పాటు జతపడి  ఉంటది....అన్లిమిటెడ్ టైం కాదు  ....కాలం తో ముడిపడిన ప్రతి ప్రకృతి వస్తువు లక్షణాలు - వృద్ధి, క్షీణత .......కాలమహిమ 

ప్రశ్న: ఎందుకలా 'మ్యాజిక్ నంబర్స్'   ఇవ్వలేకపొతున్నాడు  ?

జ : చేతేశ్వర్ పుజారా ఒక గ్రేట్  క్రికెటర్....అనేక టెస్ట్ విజయాల్లో కీలక పాత్రధారి.....సక్సెస్ఫుల్ ,డిపెండబుల్, సాలిడ్,లెస్ ఎర్రర్ ప్రోన్డ్, గ్రేట్ టెంపెరమెంట్, నో నాన్సెన్స్, డే ఇన్ డే అవుట్ ఆసమ్ వర్క్ ఎథిక్స్ - మెయిన్ స్టే ఫర్ టెస్ట్  క్రికెట్ ....అనేక విజయాలు కైవసం చేసుకున్న సూపర్బ్ బాట్స్మన్ 

పుజారా  విరాట్ లాగ ఆడదెందుకని ?  కోహ్లీ లా మ్యాజిక్ నంబర్స్ చూపించడేంటి ?

మనిషి బలాబలాలు సరిగా అర్థమవనప్పుడు, అభిమానం లో ఉన్నప్పుడు మన  అంచనాలకు అందుకోలేరు వాళ్ళు - బాధ, నిరుత్సాహం .... సహజం 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...