Jump to content

Anantapur


Recommended Posts

33 minutes ago, nbk@myHeart said:

Kalva name in list today so Hindupur mp pushpaalaki isthaara.... hero kooda aa makki choose gomuthram batch ki compaign cheyyaaligaa:dream:

Where is nimmala kistappa , is he not active?

Hindupur MP BK Pardha Saradhi

Link to comment
Share on other sites

AP Politics: చంద్రబాబును కలిసిన బీకే పార్థసారధి.. కారణమిదే..?

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:15 PM

 

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ని ఉండవల్లిలోని నివాసంలో సోమవారం నాడు మాజీ ఎంపీ బీకే పార్థసారధి(B K Parthasarathi) కలిశారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని బీకేకు చంద్రబాబు సూచించారు.

 
AP Politics: చంద్రబాబును కలిసిన బీకే పార్థసారధి.. కారణమిదే..?
 

 

cross.svg
1704263274696594fe6a2f629.png
 
Play
Unmute
 
 
Loaded: 0.31%
 
 
Fullscreen

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ని ఉండవల్లిలోని నివాసంలో సోమవారం నాడు మాజీ ఎంపీ బీకే పార్థసారధి(B K Parthasarathi) కలిశారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని బీకేకు చంద్రబాబు సూచించారు.

 

 

 

గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో తాను చేసిన పనులను వివరించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వ్యక్తిని కాదని బీకే పార్థసారధి తెలిపారు. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి బీకే పార్థసారధి కచ్చితంగా గెలుస్తారని సర్వే రిపోర్టులు తనకు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. అధినేత నిర్ణయమే తనకు శిరోధార్యామని బీకే పార్థసారధి అన్నారు. అలాగే చంద్రబాబును నిమ్మల కిష్టప్ప కూడా కలిశారు.. జిల్లాలో ఏదోక స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కిష్టప్ప చంద్రబాబును కోరారు.

 

 

 

 
Updated Date - Feb 26 , 2024 | 03:16 PM
AdPushupReport this ad
 
Link to comment
Share on other sites

అదే జిల్లాకు చెందిన మాజీమంత్రి నిమ్మల కిష్టప్ప తనకు పుట్టపర్తి టికెట్‌ ఇవ్వాలని కోరారు.

Link to comment
Share on other sites

Gummanur Jayaram: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్‌

గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram)ను మంత్రి వర్గం నుంచి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్ చేశారు. 

Updated : 05 Mar 2024 20:29 IST
 
 
 
 
 
 

124044381_050324gummu-inner.jpg

అమరావతి: గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram)ను మంత్రి వర్గం నుంచి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్ చేశారు. ఈమేరకు రాజ్‌భవన్‌ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గుమ్మనూరు మంగళవారం ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ అడిగారు. నాకు ఇష్టం లేదు. తెదేపా తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తా. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారు’’ అని ఆరోపించారు. ఈరోజు సాయంత్రం మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా ఆయన తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

2014లో తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన VR రామిరెడ్డి నేడు VR రామి రెడ్డి గారి కుమారులు VR వెంకటేశ్వర్ రెడ్డి, VR విఘ్నేష్ రెడ్డి గార్లు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు..Image

Link to comment
Share on other sites

Iqbal: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా

ABN , Publish Date - Apr 05 , 2024 | 06:10 PM

 

అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు.

 
Iqbal: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా
Mohammad Iqbal
 

 

అనంతపురం: అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.

 

 

 

 

cross.svg
 
 
 
 
 
 

అలాగే ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు సైతం మహమ్మద్ ఇక్బాల్ ఫ్యాక్స్‌తోపాటు ఈ మేయిల్ చేశారు. 2027, మార్చి వరకు తనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని శాసనమండలి చైర్మన్‌కు విజ్జప్తి చేశారు. వారం రోజుల్లో టీడీపీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన కండువా కప్పుకొనున్నారు.

 
 

అయితే గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం (Hindupur MLA Seat) నుంచి వైసీపీ అభ్యర్థిగా మహ్మద్ ఇక్బాల్ ( Mohammad Iqbal) బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అలాగే హిందూపురం లోక్ సభ నియోజకవర్గం ఇన్‌చార్జీగా నియమించారు. ఆ కొద్దిరోజుల తర్వాత.. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతలు ఆయన నుంచి పార్టీ అధినేత వైయస్ జగన్ తప్పించి.. ఆ బాధ్యతలను దీపిక అనే మహిళకు అప్పగించారు. దీంతో ఇక్బాల్‌ను పక్కన పెట్టినట్లు అయింది.

 

ఆ క్రమంలో ఆయన తీవ్ర ఆవేదనకు గరయ్యారని సమాచారం. నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారని తెలుస్తోంది. అదీకాక.. హిందూపురం వైసీపీలో గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. దీంతో ఆ గ్రూప్ రాజకీయాలకు సైతం ఇక్బాల్ తీవ్ర కలత చెందారని సమాచారం. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఇక్బాల్.. పదవి విరమణ అనంతరం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Chandrababu: అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు

 తాజా ఎన్నికల్లో టికెట్‌ దక్కని  అసంతృప్త నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. 

Published : 08 Apr 2024 20:41 IST
 
 
 
 
 
 

124068077_080424chandrababu1a.jpg

హైదరాబాద్‌: ఎన్డీయే కూటమి పొత్తు వల్ల టికెట్‌ దక్కని తెదేపా అసంతృప్త నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌, తిక్కారెడ్డిలు కలిశారు. ఈ ముగ్గురూ అనంతపురం, గుంతకల్లు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాలను ఆశించారు. పొత్తులో భాగంగా ఆయా స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించడంతో వారు భంగపడ్డారు. ఈ ముగ్గురు నేతలతోపాటు ప్రాంతీయ సమన్వయకర్తలు భూమిరెడ్డి గోపాల్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్‌లు చంద్రబాబును కలిసి మాట్లాడారు. ముగ్గురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇవ్వడంతో పాటు.. అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన హామీతో సంతృప్తి చెందిన నేతలు తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...