Jump to content

Rythu bharosa


rama123

Recommended Posts

పీఎం ఇచ్చేసిన నిధులకు మీట నొక్కిన సీఎం

 
 
 

ఈ నెల 1నే కేంద్రం నుంచి కిసాన్‌ నిధులు

దేశవ్యాప్తంగా రైతులకు రూ.2 వేలు జమ

రాష్ట్రంలోని రైతులకూ నగదు బదిలీ

దానినీ తన ఖాతాలో వేసుకున్న జగన్‌

తామే జమ చేస్తున్నట్లు సీఎం బిల్డప్‌

కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రకటనలు

సొంత మీడియాకూ బాగా సొమ్ములు

ఖాతాలు చూసుకుని తెల్లబోయిన రైతులు

 

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘నవ్వి పోదురుగాక మాకేంటి సిగ్గు’... అంటూ జగన్‌ సర్కారు బరితెగించింది. కేవలం ప్రచారానికి, ప్రకటనల పేరిట సొంత మీడియాకు ప్రజాధనం దోచిపెట్టడానికి... ‘తప్పుడు మీట’లు నొక్కింది. కేంద్రం కళ్లకు గంతలు కడుతూ... రాష్ట్ర ప్రజలను, అందునా రైతులను పచ్చిగా వంచించింది. రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని, పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్‌ యోజన నిధులను కూడా తన ఖాతాలో వేసుకుంది. రూ.50.58 లక్షల మంది రైతులకు రూ.2,000 చొప్పున కేంద్రం వేసిన రూ.1,036 కోట్ల సొమ్ము తాలూకు క్రెడిట్‌ను కొట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెగబడింది. కేంద్రప్రభుత్వం శనివారమే ఈ డబ్బులు రైతులకు విడుదల చేసింది. సాంకేతిక సమస్యలున్న వారికి మినహాయిస్తే... ఆ రోజే ఈ సొమ్ములు అన్నదాతల ఖాతాల్లో పడ్డాయి. కానీ... సోమవారం సీఎం జగన్‌ బటన్‌ నొక్కి.. ఆ డబ్బు అంతా వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందని మాయ చేయడానికి ప్రయత్నించారు. ఈ తంతుకు కోట్ల రూపాయలతోమీడియా ప్రకటనలు ఇచ్చారు.

‘‘కరోనా కష్టాలు, ఆర్థిక కష్టాలెన్నున్నా మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. చెప్పిన సమయానికే, చెప్పిన విధంగా... వరుసగా మూడో ఏడాది మూడో విడత గా’’ రైతులకు నిధులు విడుదల చేశామ ని ఆ ప్రకటనలో సొంత డబ్బా కొట్టుకున్నారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అని తెలుగులో పెద్దగా రాసి.. ‘పీఎం కిసాన్‌’ అని ఇంగ్లీషులో చిన్న అక్షరాల్లో వేశారు. మూడో విడత గా విడుదలైన సొమ్ములు వందశాతం కేంద్రం ఇచ్చినవనే.  విషయాన్ని మొత్తం ప్రకటనలో ఎక్కడా చెప్పకుండా, అంతా తామే ఇచ్చినట్లుగా మాయ చేశారు. ఇందులో ప్రధానమంత్రి ఫొటో కూడా ప్రచురించలేదు. 

 

ఇదీ ‘పథకం’

తాము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు ఏడాదికి రూ.12,500 ఇస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. మరోవైపు... కేంద్రం ‘పీఎం కిసాన్‌’ పథకం కింద రైతులకు ఏటా రూ.6వేల సహాయం ప్రకటించింది. ఇక్కడే జగన్‌ సర్కారు తన తెలివి ప్రదర్శించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రం సహాయంతో సంబంధం లేకుండా తాను సొం తంగా రూ.12,500 ఇవ్వాలి. కానీ... దానిని రూ,7500కు కుదించింది. కేంద్రం ఇచ్చే సహాయాన్ని కూడా కలిపి చూపుతూ, రైతుకు రూ.13,500 అందిస్తున్నామని... ఇది ఇస్తామన్న దానికంటే రూ.వెయ్యి ఎక్కువని గొప్పలకు పోతోంది. కేంద్రం 2వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం 6వేలు అందిస్తోంది. జనవరి 1వ తేదీ ఇచ్చిన రూ.2వేలు అచ్చంగా కేంద్రం విడుదల చేసినవే. సొమ్ము పడ్డట్టు రైతులకు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. బ్యాంక్‌ ఖాతాల్లో చెక్‌ చేసుకుంటే రూ.2వేలు పడినట్టు తేలిపోయింది. అయినా ఏపీ ప్రభుత్వం వైఎస్సాఆర్‌ రైతుభరోసా- పీఎం కిసాన్‌ మూడో విడత సొ మ్ము 50.58లక్షల మందికి రూ.1,036కోట్లు చెల్లింపులు జరుపుతున్నట్లు తప్పుడు ప్రకటనలు గుప్పించింది.

 

ఇదీ జరిగింది.. 

పీఎం కిసాన్‌ కేవలం భూమి ఉన్న రైతులకే వర్తిస్తుంది. రాష్ట్రంలో రైతుభరోసాను సాగుదారు హక్కు పత్రం(సీసీఆర్సీ) ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కౌలురైతులు, అటవీ భూ హక్కు పత్రం(ఆర్వోఎ్‌ఫఆర్‌) ఉన్న గిరిజన రైతులకూ అమలుచేస్తున్నారు. ఇలాంటి వారు లక్షన్నర మందివరకు ఉంటారు. పీఎం కిసాన్‌లో వీరు లేకపోయినా, కేంద్ర పథకాన్ని అన్వయించుకుని వారికి మూడో విడత కింద(రాష్ట్రప్రభుత్వ సొమ్ముతో) రూ.2 వేలు చొప్పున చెల్లింపులు జరిపేందుకు సీఎం బటన్‌ నొక్కారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇంత తక్కువమంది కోసం ప్రత్యేకంగా మీట నొక్కి.. అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే రూ.2వేలు ఇచ్చినట్టు అంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రచారం చేసుకున్నారంటే.. సమాధానం లేదు. రాష్ట్రంలో భూమి ఉన్న రైతుల సం ఖ్య 58లక్షలపైగా ఉన్నట్టు 2019 సెప్టెంబరులో జగన్‌ ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వ గణాంకాల ప్రకా రం కౌలు రైతులు 16లక్షల వరకు ఉన్నారు. వెరసి.. మొత్తం 74లక్షల మంది. ఇందులో ప్రభుత్వం కేవలం 48లక్షల మంది రైతులకే పెట్టుబడి సాయం అందిస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15.36లక్షలపైగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుచేసింది. పెట్టుబడి సాయం ఇచ్చింది. జగన్‌ తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కొత్త కౌలు చట్టం తెచ్చారు. కౌలు రైతుకు పెట్టుబడి సాయం అందించడానికి భూ యజమాని అనుమతిని ఈ చట్టం తప్పనిసరి చేసింది. దీంతో వారిలో 10ుమందికి కూడా సాయం అందటం లేదు. అలాగే కౌలు రైతుల్లో సీసీఆర్సీ ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు మాత్రమే భరోసా ఇస్తోంది ఇతరులకు మొండిచేయి చూపింది. వాస్తవంగా కౌలురైతుల్లో ఓసీ రైతులే అత్యధికం. అయినా  తక్కువ మందికి సాయం చేస్తూ, పంట వేసే వారందరికీ సాయం అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.

 

సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ నిధులు మీట నొక్కి విడుదల చేస్తున్నారని జగన్‌ సొంత పత్రికతోపాటు మరికొన్ని ఎంపిక చేసిన పత్రికలకు సర్కారు రంగురంగుల ప్రకటనలు గుప్పించింది.  కానీ... సీఎంది తప్పుడు నొక్కుడు! దొంగ నొక్కుడు! రెండు రోజుల కిందటే ‘పీఎం కిసాన్‌’ పథకంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా రైతులకు రూ.2వేల చొప్పున జమ చేసింది. ఆ ‘క్రెడిట్‌’ను ముఖ్యమంత్రి తన ‘ఖాతా’లో వేసుకున్నారు. అంతా తన ఘనతగా చెప్పుకొన్నారు.

 

పీఎం కిసాన్‌ యోజన... 100 శాతం కేంద్రం అమలు చేస్తున్న పథకం. ఇతర కేంద్ర పథకాల్లాగా డబ్బులు రాష్ట్ర ఖజానాకు వచ్చి అక్కడ నుంచి లబ్ధిదారులకు చేరవు. నేరుగా కేంద్రం నుంచే రాష్ట్రాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయి. అయినప్పటికీ... ‘ఆ డబ్బులు ఇచ్చింది మేమే’ అని జగన్‌ సర్కారు 

బేషరమ్‌గా చెప్పుకొంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...