Jump to content

Bheeshma version of sittarala sirapadu


MSDTarak

Recommended Posts

భీష్మ ఏకాదశి సందర్భంగా, అల వైకుంటపురంలోని, సిత్తరాల సిరపడు పాట పేరడీగా భీష్మ పితామహుడిపై పాట రాసాను, ఈ నా చిరు ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. 

భారతంలో భీష్ముడు భారతంలో భీష్ముడు 
వసువుల్లో పెద్దవాడు ప్రభాసుడే భీష్ముడు

వశిష్ఠుడి దేనువుని దొంగిలించి తీస్కపోయి, 
ముని శాపం వల్ల భూమి పైన పుట్టినాడు

తల్లి గంగమ్మ తో యుద్ధ విద్య నేర్చినాడు, 
తండ్రి శాంతనుడి దగ్గర రాజరికం పూనినాడు. 

భారతంలో భీష్ముడు భారతంలో భీష్ముడు 
వసువుల్లో పెద్దవాడు ప్రభాసుడే భీష్ముడు

ఇష్టపడ్డ చిన్నదాన్ని తండ్రి లగ్గంఆడలని, 
తన సోకులను పక్కనెట్టుకోవలని భీష్మించుకున్నాడు

తండ్రిలేని తమ్ములకు తండ్రి తాను అయినాడు, 
రాజు లేని రాజ్యానికి అన్నీ తానై ఉన్నాడు. 

భారతంలో భీష్ముడు భారతంలో భీష్ముడు 
వసువుల్లో పెద్దవాడు ప్రభాసుడే భీష్ముడు

తాను నమ్మిన ధర్మం ఆపదలో ఉందంటే, 
విద్దె చెప్పిన గురువుతోటీ కయ్యానికి దిగినాడు. 

ధర్మాన్ని నమ్ముకున్న పాండవుల పక్షపాతి వీడు, 
తననే నమ్ముకున్న కౌరవులకు అయ్యనోడు. 

అంపశయ్య మీదనుండి బాధలనుభవించేడు, 
ధర్మరాజుకు ధర్మం నేర్పినోడు భీష్ముడు. 

భారతంలో భీష్ముడు భారతంలో భీష్ముడు 
వసువుల్లో పెద్దవాడు ప్రభాసుడే భీష్ముడు
             -అనంత సిరీష్

Link to comment
Share on other sites

10 hours ago, LION_NTR said:

Ok ok..

ekkadekkadivo..techi copy kottinattundi 😴

Copy kotte dourbhyagavantunni kaadu annai, ee poorvajanma sukruthamo, aa bhagavantudi krupa valla ilanti vidya vanta battindi...Andaroo meela antarani anukodam tappu, pakkakelli aadukondi. 

This is youtube link of song edited and sung by my cousins. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...