Jump to content

టీఆర్‌ఎస్‌ను వీడబోతున్న ఆ రెండో నాయకుడు ఎవరు?


Saichandra

Recommended Posts

టీఆర్ఎస్‌కు మరో షాక్?
21-11-2018 10:09:10
 
636783917511750425.jpg
హైదరాబాద్: టీఆర్ఎస్‌కు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు గులాబీ నేతల్లో కలకలం రేపుతోంది. ఈనెల 23న కొండా సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆయన బాటలోనే ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
 
కీలకమైన శాసనసభ ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు పంపించారు. ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డిని బుజ్జగించటానికి మంత్రి కేటీఆర్‌ చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్ విశ్వేశ్వర రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని అంటున్నట్లు కేటీఆర్ ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే.. పార్టీ నుంచి బహిష్కరిస్తే బహిష్కరించుకోండని విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నట్లు సమాచారం.
 
ఆ వెంటనే ఆయన టీఆర్‌ఎస్‌కి రాజీనామా ప్రకటన చేశారు. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీ కోసం తాను ఎంతగానో కృషి చేశానని... ఎంపీగా నియోజకవర్గం అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి పార్లమెంట్‌లో పోరాడానని.. 2014 ఎన్నికల్లో ఓడిపోయే సీటును ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ కేటాయించిందన్నారు. ప్రస్తుతం రెండు సంవత్సరాలుగా పార్టీలో, ప్రభుత్వంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. రోజు రోజుకు ప్రభుత్వం, ప్రజలకు మధ్య దూరం పెరుగుతూ వస్తోందని రాజీనామా లేఖలో ప్రస్తావించారు విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చి ప్రాధాన్యత కల్పించారన్నారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు గౌరవం లేకుండా పోయిందని.. కొండా లేఖలో స్పష్టం చేశారు. రాజీనామాతోపాటు కేసీఆర్‌కు నాలుగు పేజీల లేఖను పంపారు. ఆ వెంటనే ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ కీలక నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్ర నేత సోనియాగాంధీ ఈనెల 23న రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రోజు మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇదే వేదికపై సోనియా సమక్షంలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరటం లాంఛనమేనని తెలుస్తోంది.
 
 
అదే బాటలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బాటలోనే ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పయనించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన టీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పబోతున్నారు. త్వరలోనే ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. యాదవరెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...