Jump to content

TDP to Play A Key Role in National Politics


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
ఎప్పుడైనా చక్రం తిప్పడం చంద్రబాబుకే సాధ్యం
10-11-2018 20:01:43
 
636774776814547728.jpg
అమరావతి: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. దానికి కాంగ్రెస్ సహా అన్నీ పార్టీలు మద్దతిచ్చాయి. బీజేపీతో లోపాయికారి వ్యవహారాలు చక్కబెట్టుకున్న కొన్ని పార్టీలు మినహా అన్నీ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆపై కర్నాటక ఎన్నికల తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు మరోసారి బీజేపీయేతర పార్టీలంన్నిటినీ ఓకే వేదికపైకి వచ్చేలా చేశాయి. అయితే ఆ తర్వాత కొంత స్తబ్దత కనిపించింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాల ఐక్యతపై ప్రజల్లో నమ్మకం కల్గించాల్సిన సందర్భంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఒక్కొక్కరిగా అందరినీ కూటమి బాటలోకి తీసుకువస్తున్నారు.
 
 
నిజానికి ఇలా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం చంద్రబాబు(టీడీపీ)కు కొత్తకాదు. టీడీపీని స్థాపించిన ఏడాదికే 1984 ఆగస్టు సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ ఉద్యమం సాగింది. అందులో వామపక్షాలతో పాటు బీజేపీ కూడా చురుగ్గా పాల్గొంది. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకతకు ఎన్టీఆర్ ఒక సంకేతంగా మారారు. అప్పట్లోనే ఆయన కాంగ్రెస్ వ్యతిరేకశక్తులతో విజయవాడలో శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఇందులో ఎంజీ రామచంద్రన్, ఫరూక్ అబ్దుల్లా, ప్రసన్నకుమార్ మహంతా తదితర కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్టు స్థాయిలో 404 స్థానాలు గెలుచుకుంది. అప్పటి లోక్‌సభలో 30 స్థానాలు గెలుచుకున్న టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఆ హోదాలోనే ఎన్టీఆర్ చైర్మన్‌గా 1989లో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర శక్తులతో నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. వీపీ సింగ్ కన్వీనర్‌గా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో గ్రౌండ్ వర్క్ చేసింది చంద్రబాబే.
 
 
టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉపేంద్ర సాయంతో జాతీయ స్థాయిలో విపక్షాలను ఒక తాటిపైకి తెచ్చి, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్‌ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. మళ్లీ 1994 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. 1995లో టీడీపీ పగ్గాలతో పాటే ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి అటల్ బిహారివాజ్‌పేయి ప్రధాని అయ్యారు. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమయ్యే సంఖ్యా బలాన్ని పుంజుకోలేక 13 రోజులకే ఆ ప్రభుత్వం పడిపోయింది. ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 13 పార్టీలను ఏకతాపైకి తెచ్చి యునైటెడ్ ఫ్రంట్ కూటమి ఏర్పాటు చేశారు. ఆ కూటమికి కన్వీనర్‌గా చంద్రబాబు వ్యవహరించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా పనిచేసిన చంద్రబాబుకు ఇప్పుడు కలిసి వచ్చింది. 1989-91 మధ్య అధికారంలో కొనసాగిన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులోనూ ఆయనది క్రియాశీల పాత్ర పోషించారు. ఈ రెండు ప్రయోగాలు భారత రాజకీయాలను ఓ మలుపు తిప్పాయి. ముఖ్యంగా 1996-98 మధ్య ఇద్దరు విపక్ష నేతలు దేవెగౌడను గుజ్రాల్‌ను ప్రధానులుగా చేసిన ఘనత ఆయనకుంది. కాంగ్రెస్, సీపీఎం బయట నుంచి ఇచ్చిన మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ అధికారాన్ని చేపట్టింది. దేవెగౌడను గుజ్రాల్‌ను ప్రధానులుగా చేయటంలో చంద్రబాబు చక్రం తిప్పారు. అందుకే రెండ్రోజుల కిందట బాబు బెంగళూరులో దేవెగౌడతో భేటీ అయిన సందర్భంలో కర్నాటక సీఎం కుమారస్వామి ఇదే ఘటనలను గుర్తు చేసుకున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...