Jump to content

Emantivi emantivi


nbk@myHeart

Recommended Posts

ఏమంటివి? ఏమంటివి?

కులము,జాతి నెపమున నీకు ఓటు వేయ్యమందువా?

ఎంత మాట? ఎంత మాట?

ఇది నా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తీసుకోవలసిన నిర్ణయం కానీ..

ఒక కులముకు సంబంధించిన విషయం కాదె?

కాదు, కాకూడదు.. ఇది కులాల కుంపట్లు పెట్టవలసిన సమయమే అందువా?

ఇదే రీతి లో నీ అన్న పార్టీ పెట్టిన తీరు ఎట్టిది?

అందులో నీ పాత్ర ఎట్టిది? 
కాంగ్రెసోళ్ల పంచులూడదీసి తంతా అంటివే?
మరి అదే కాంగ్రెసోళ్ల పంచన నీ అన్న చేరితే తన్నితివా నీ అన్న ని?

ఇంత ఏల?

నీ అన్న కొడుకుని అపోలో పెద్దమనిషి కూతురికి ఇచ్చి పెళ్లి చెయ్యలేదా? ఆమెదే కులము?
చిన్న కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్ళిచేసుకుని, ఒక బిడ్డ కి జన్మనియ్యలేదా? అతనిదే కులము?
అల్లూ వారు, కొడుకుని సొంత కులం అమ్మాయి కి ఇచ్చి పెళ్లి చేశారా? ఆ కోడలుది ఏ కులము?

మాతో చెప్పింతువేమయ్య?

పెద్దలు ఒక అమాయకురాలిని ఇచ్చి పెళ్లి చేస్తే, వదిలేశావే? ఆమెదే కులము?
రెండో సారి నువ్వు ఇష్టపడి చేసుకున్న వేరే రాష్ట్రం అమ్మాయిది ఏ కులము?
మూడో సారి నువ్వు ముచ్చట పడి చేసుకున్న రష్యన్ భామది ఏ కులము?

మీ అవసరాలను పట్టి, మీ కుటుంబం ఏనాడో సొంత కులాన్ని, ఊరిని మర్చిపోయినది.

పైకి కులం పేరు ఎత్తక పోయినా, కులాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న రాజకీయం ఎందుకో మాకు అర్ధం కాదా?

నాడు మీ అన్నా, నేడు నువ్వు కేంద్రం లో ఉన్న పార్టీల కనుసన్నలలో కుట్రలు చెయ్యటం నిజం కాదా?

మేము ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేస్తామా?

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నా రాష్ట్రాన్ని నీ లాంటి వాడి బారిన పడనిస్తామా ?

ఈ వ్యర్ధ ప్రయత్నాలెందులకు???

 

Source : my ex colleague in fb

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...