Jump to content

Recommended Posts

  • Replies 239
  • Created
  • Last Reply
సంక్షేమ సవారీ 

 

బడ్జెట్‌ దశ, దిశ అదే 
రైతులు, సామాజిక వర్గాలు, సంక్షేమ రంగాలకు భారీగా పెరిగిన కేటాయింపులు 
ఆరు కొత్త పథకాలకు నిధులు 
కోడ్‌ వచ్చినా ఇబ్బంది లేకుండా కేటాయింపులు 
రూ.5 వేల కోట్లతో ‘అన్నదాతా సుఖీభవ’ 
‘పసుపు-కుంకుమ’కు భారీగా నిధులు 
నిరుద్యోగ భృతి రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు 
పంచాయతీరాజ్‌, వ్యవసాయరంగాలకూ ప్రాధాన్యం 
పింఛన్లకు గణనీయంగా పెంపు 
2019-20 సంవత్సరానికి రూ.2.26 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ 
ఈనాడు - అమరావతి

5ap-main1a_2.jpg

అన్నదాతా సుఖీభవ పథకం తెస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారుచేసి రైతుకు అండగా నిలుస్తాం.

- చంద్రబాబు

5ap-main1b_2.jpgతల్లి గర్భం నుంచి చరమాంకం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలుచేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం మాది

- యనమల

5ap-main1g.jpg

ఓ వైపు సకల జనుల శ్రేయస్సు.. 
మరోవైపు ఆర్థిక సంక్లిష్టతలు.. 
ఇంకోవైపు ఎన్నికల ముంగిట నిలిచిన రాజకీయ అనివార్యత.. 
ఈ మూడింటినీ సమతౌల్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తే చేసింది. సంక్షేమ మంత్రాన్ని జపిస్తూ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ‘ఎన్నికల పద్దు’ను ఆవిష్కరించింది. వివిధ వర్గాలపై వరాల వర్షం కురిపించింది. రైతన్నకు గుండె ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచింది. సకల జనులకూ ‘కేటాయింపుల విందు భోజనం’ వడ్డించింది. 

విద్య, వైద్యం, సాగునీరు.. ఇలా దేనికీ లేదనకుండా కీలక రంగాలన్నింటికీ పుష్కలంగా కేటాయింపులు చేసింది. మున్ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా.. ఇప్పటికే ప్రకటించిన పథకాల్ని ప్రజలకు చేరువచేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో నిధులు కేటాయించింది. కేంద్రం నుంచి ఆశించిన సాయం అందనప్పటికీ.. కేటాయింపుల విషయంలో మాత్రం ఆర్థిక మంత్రి యనమల ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పైపెచ్చు గత ఏడాది కన్నా ఈ బడ్జెట్లో 35,113 కోట్లు అధికంగా చూపారు. 
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ మంత్రం పఠించింది. ఎన్నికల తంత్రానికి పదును పెట్టింది. సాధారణ ఎన్నికలు ముంగిట్లో నిలిచిన నేపథ్యంలో దూకుడు పెంచింది. ఓటర్లను ఆకట్టుకోవడమే 5ap-main1c_2.jpgలక్ష్యంగా... సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ.... ‘ఎన్నికల పద్దు’ని  రూపొందించింది. ఇటీవల కాలంలో అధికారికంగా ప్రకటించిన, అనధికారికంగా వెల్లడించిన సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు చేసింది. అదే సమయంలో ప్రభుత్వ ప్రాధాన్యరంగాలైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి వాటికి ఇతోధికంగా నిధులు పెంచుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి మంగళవారం శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎన్నికల కోడ్‌ వచ్చినా ఇబ్బంది లేకుండా... మార్చి నెలలో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ఇప్పటికే ప్రకటించిన పథకాలు అమలు చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు. అమల్లో ఉన్న ఇతర సంక్షేమ పథకాలను బాగా విస్తరించారు. కేటాయింపులు అనేక రెట్లు పెంచారు. చంద్రబాబు ప్రభుత్వమంటే అభివృద్ధి ప్రాజెక్టులకు, సంస్కరణలకు పెద్ద పీట వేస్తుందని పేరు. దానికి తగ్గట్టే... అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సంక్షేమానికి కొంత ప్రాధాన్యమిచ్చినా... ఆ తర్వాతి రోజుల్లో అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకే ఎక్కువ నిధులు వెచ్చించింది. దానికి కాస్త భిన్నంగా... ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో... గత నాలుగైదు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఉదారంగా ఖర్చు పెడుతోంది. సామాజిక పింఛన్ల కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసింది. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం వంటి అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఈ బడ్జెట్‌లో ఆయా కార్యక్రమాలకు అగ్రతాంబూలం ఇచ్చింది. వివిధ వర్గాలకు ఆరు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించింది. రాష్ట్రంలో 86 లక్షలకుపైగా ఉన్న రైతులను ఆకట్టుకోవడానికి రూ.5,000 కోట్లతో ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని తీసుకువచ్చింది. దీని విధి విధానాలు వెల్లడించాల్సి ఉంది. ఎన్నికలకు ముందే దీనిని అమల్లోకి తెచ్చే ఉద్దేశంతో నిధులకు ఇబ్బంది లేకుండా కేటాయింపులు చేసింది. తమ సామాజిక వర్గంలోని పేద వారిని ఆదుకోవడానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఇటీవలే తెదేపాకి చెందిన క్షత్రియ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరగా... రూ.50 కోట్లు కేటాయించింది. ఆటోడ్రైవర్లకు జీవితకాల పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను ఇటీవలే రద్దు చేసిన ప్రభుత్వం... వారిని మరింతగా ఆదుకునేందుకు రూ.150 కోట్లతో ‘డ్రైవర్ల సాధికార సంస్థ’ను ఏర్పాటు చేసింది. ‘పసుపు-కుంకుమ’ పథకానికి గత బడ్జెట్‌లో రూ.1700 కోట్లు కేటాయించగా... ఈ సారి దానిని రూ.4 వేల కోట్లకు (135.29%) పెంచింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా అందిస్తోంది. ఆ మేరకు చెక్కులను ముందస్తుగా ఇచ్చేసింది. వీటిలో తొలివిడత చెక్కుల్ని మహిళలు ఇప్పటికే బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు. మిగతా రెండు విడతల చెల్లింపులు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జరిగేలా కేటాయింపులు చేసింది.  వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి వారిని ఆదుకునేందుకు సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన ప్రభుత్వం... వీటికి కేటాయింపుల్ని 155.77 శాతానికి పెంచింది. గత సారి పింఛన్లకు రూ.5012 కోట్లు కేటాయించగా.... ఈ సారి ఆ మొత్తాన్ని రూ.12,819.18 కోట్లకు పెంచింది. వనరుల సమర్థ వినియోగం ద్వారా సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించగలుగుతున్నామని, సాంకేతికతను వాడటం ద్వారా పథకాల దుర్వినియోగాన్ని అరికడుతున్నామని ఆర్థిక మంత్రి యనమల తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల పౌర సరఫరాల వ్యవస్థలో రూ.2,585 కోట్లు ఆదా చేశామని చెప్పారు. 

5ap-main1d.jpg

5ap-main1e.jpg
5ap-main1f.jpg

రెవెన్యూలోటు రూ.2,099 కోట్లు 
రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,26,177 కోట్లతో భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2018-19 బడ్జెట్‌ అంచనాల కంటే ఇది రూ.35,113 కోట్లు అధికం. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 నుంచి ఏటా సగటున రూ.15 వేల కోట్లు చొప్పున కేటాయింపులు పెరుగుతుండగా.... 2018-19లో ఒక్కసారిగా రూ.34,064.21 కోట్లకు పెంచారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.1,80,369 కోట్లుగా... మూలధన వ్యయాన్ని రూ.29,596 కోట్లుగా పేర్కొన్నారు. రుణాల చెల్లింపులకు రూ.14,917 కోట్లను చూపించారు. 2018-19 సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో రూ.2,494.12 కోట్ల రెవెన్యూలోటు చూపించగా.... ఈసారి రూ.2,099 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.29,141.72 కోట్లు... ఈ సారి అది రూ.32,391 కోట్లకు పెరిగింది. రాష్ట్రానికి సమకూరే ఆదాయంలో... కేంద్ర పన్నుల్లో వాటాల రూపంలో రూ.36,360 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.60,721 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల నుంచి రూ.75,438 కోట్లు వస్తుందని అంచనా వేశారు. 
ప్రాధాన్య రంగాలకు భారీగా నిధులు 
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య రంగాలకు నిధులు భారీగా పెంచింది. గ్రామాలను... సిమెంట్‌ రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంటింటికీ కుళాయి నీరు వంటి మౌలిక వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగానే.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,208.82 కోట్లు (50.10% అధికం) ఇవ్వగా... వ్యవసాయం, అనుబంధ రంగాలకూ కేటాయింపులు ఎక్కువ చేసింది. వ్యవసాయ, మార్కెటింగ్‌ రంగాలకు రూ.12,732.97 కోట్లు (26.10% పెంపు), అనుబంధ రంగాలకు రూ.1743.02 కోట్లు (16.62% పెంపు), కార్మిక, ఉపాధి కల్పన శాఖకు రూ.1225.75 కోట్లు (50.43% పెంపు) కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 20 శాతం కంటే పెంచిన శాఖల్లో... వెనుకబడిన తరగతుల సంక్షేమం (32%), ఆర్థిక (20%), సాధారణ పరిపాలన (45.56), పరిశ్రమలు-వాణిజ్యం (33.82%), ప్రణాళికా విభాగం (26.96%), రెవెన్యూ శాఖలు (33.66%) ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు 10.72 శాతాన్ని తగ్గించారు.

5ap-main1h_1.jpg

ఈ బడ్జెట్‌లో కొత్తగా ప్రకటించిన, విస్తరించిన సంక్షేమ పథకాల ముఖ్యాంశాలు..!

పేదలకు గృహ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రూ.500 కోట్లు 
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలకు రూ.400 కోట్లు 
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పుడు రైతుని ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌’ రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు పెంపు 
పశువుల బీమా రూ.50 కోట్ల నుంచి రూ.200 కోట్లకు... 
21 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా ప్రకటించడంతో పాటు ఇటీవలే మరో తొమ్మిది కార్పొరేషన్లను వెల్లడించిన ప్రభుత్వం... వాటికి రూ.3 వేల కోట్లు నిధులిచ్చింది. 
నిరుద్యోగ యువతకు ప్రస్తుతం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్న ప్రభుత్వం.... త్వరలో దీన్ని రూ.2 వేలకు పెంచాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా రూ.1200 కోట్లు చూపించింది. 
పేదలకు మూడు పూటలా ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనున్న ప్రభుత్వం కేటాయింపుల్ని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు... 
అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన చంద్రన్న బీమాకు రూ.140 కోట్ల నుంచి రూ.354.02 కోట్లకు... 
వైశ్య కార్పొరేషన్‌కి రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్లకు,  బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లకు, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కి రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంపు. 
వివిధ వెనుకబడిన వర్గాలకు చెందిన వధువులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించే చంద్రన్న పెళ్లికానుకకు నిధులను రూ.132.22 కోట్లకు పెంచింది. 

5ap-main1k.jpgచరిత్రాత్మకం..

 బడ్జెట్‌ చరిత్రాత్మకమైనది. రైతులు, మహిళల సంక్షేమానికి అద్దంపడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.5వేల కోట్లతో ‘అన్నదాత సుఖీభవ పథకం’ అమలవనుంది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో సంక్షేమానికి ఎంత కేటాయించారో? ఇక్కడ ఎంత కేటాయించారో ఈ బడ్జెట్‌ను చూస్తే అవగతమవుతుంది.

-మంత్రి సోమిరెడ్డి 

 

5ap-main1j.jpgప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది. సంక్షేమం ఇదే స్థాయిలో అమలు కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలి. రాష్ట్ర విభజనతో సున్నా నుంచి మొదలైన ప్రయాణం నేడు దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సాగుతోంది. పేదల ఇళ్ల స్థలాలకు రూ.500 కోట్లు కేటాయించారు. 

- మంత్రి కాలవ శ్రీనివాసులు 


 


5ap-main1i.jpgఅప్పుల ఊబిలోకి దించారు

తెదేపా పాలనలో అభివృద్ధి జరగకపోయినా.. రాష్ట్రానికి రూ.1.53 లక్షల కోట్ల అప్పును మాత్రం మిగిల్చింది. 4 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులోకి ఊబిలోకి దించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది పూర్తిగా ఓట్ల బడ్జెట్‌. విభజన సందర్భంగా రాష్ట్రానికిచ్చిన హామీల్ని సాధించుకోలేని అసమర్థులుగా సీఎం మిగిలిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెబుతూ తాత్కాలిక భవనాల కోసం రూ.కోట్లు ఖర్చు చేయడం ఎందుకో చెప్పాలి.

 - పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి


గాలి లెక్కల బడ్జెట్‌ 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు.. వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదు. మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్‌ చేశారు.. ఆ బడ్జెట్‌ పోస్డ్‌డేటెడ్‌ చెక్‌ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది పూర్తి గాలి లెక్కల బడ్జెట్‌ అవుతుంది. వ్యవసాయ రుణమాఫీకి రూ.8,500 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా దాని ప్రస్తావనే లేదు.

- వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు దువ్వూరి కృష్ణ

 

మౌలికానికి తగ్గిన ప్రాధాన్యం

ది ఎన్నికల కోసం ప్రవేశపెట్టినది. మౌలికరంగానికి ప్రాధాన్యత తగ్గింది. ప్రధానమైన విద్య, ఆరోగ్య, సాంఘిక, మహిళా సంక్షేమానికి కోత పడింది. మధ్యంతర భృతి, పీఆర్‌సీ ప్రస్తావన లేదు. సీపీఎస్‌ రద్దుపై చేపడుతున్న చర్యలపై మాటమాత్రమైనా లేదు. దీనిపై ఆందోళన చేపడతాం.

- పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు నాగేశ్వరరావు, రాము సూర్యారావు, శ్రీనివాసులరెడ్డి. 



పాతవిషయాలే

పాతవిషయాలనే వల్లె వేశారు. కొత్త వాటికి సంబంధించి అంకెలు చెప్పారే తప్ప ఎలా అమలు చేస్తామన్నది పేర్కొనలేదు.  రైతులకు ఎవరు సాయం చేసినా సంతోషమే. కేంద్ర సాయం లేకుండా రాష్ట్రానికి ఇన్ని అవార్డులు ఎలా వచ్చాయో చెప్పాలి.
- భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు

విద్యకు ఏదీ ప్రాధాన్యం?

కీలకమైన విద్యా రంగానికి కేటాయింపులు తగ్గడం బాధాకరం. గతేడాదితో పోల్చితే విద్యకు బడ్జెట్‌ పెరిగినా వాస్తవానికి 13% నుంచి 11.5% తగ్గిపోయింది. ఉన్నత విద్యకు కేవలం రూ.3,171 కోట్లు కేటాయించారంటే దీన్ని ప్రైవేటు రంగానికి అప్పచెప్పడమే.

- పీడీఎఫ్‌ ఫోర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణం



అన్నదాతలను మభ్యపెట్టేందుకే

హాజనిత గణాంకాలతో భారీ కేటాయింపులతో వండివార్చిన ఈ బడ్జెట్‌లో ఆదాయ వనరుల వాస్తవ పరిస్థితిని విస్మరించారు. రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు చేయని చంద్రబాబు ఎన్నికల ముందు రైతులను మభ్యపెట్టేందుకు అన్నదాత సుఖీభవ అంటూ మరో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. 

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ 



ఓట్ల కోసం అంకెల గారడీ

ట్ల కోసం అంకెల గారడీలకే పరిమితమైంది. వాస్తవ విరుద్ధంగా కేటాయింపులు చేసి, ప్రజలను మోసగించే విధంగా రూపొందించారు. నిరుద్యోగ భృతిని రెండింతలు చేసినా కేటాయించింది రూ.1,200కోట్లు మాత్రమే. కేవలం 20% పెంచి... 100%భృతి ఎలా పెంచుతారో వారికే అర్థం కావాలి.

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు

5ap-main1l.jpg

5ap-main1m.jpg

5ap-main1n.jpg

5ap-main1o.jpg

5ap-main1p.jpg

6ap-main104.jpg

6ap-main103.jpg

 

 

5ap-main6j.jpg

5ap-main6k.jpg

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...