Jump to content

CBN


Recommended Posts

అక్కరకొచ్చిన బాబు అనుభవం
20-05-2018 04:19:26
 
636623867672413335.jpg
  •  కుమారస్వామికి కీలక సూచనలు
  •  ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై సలహాలు
  •  మమత నుంచీ సీఎంకు ఫోను
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక పరిణామాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం జనతాదళ్‌-ఎ్‌సకు బాగా ఉపయోగపడింది. ఎన్టీఆర్‌ హయాంలో గవర్నర్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల క్యాంపులను తామెలా నిర్వహించిందీ.. ఎమ్మెల్యేలంతా స్థిరంగా ఉంటే రాజకీయం ఎలా మార్చవచ్చో చంద్రబాబు జేడీఎస్‌ నేత, కాబోయే సీఎం హెచ్‌డీ కుమారస్వామికి తెలియజెప్పారు. కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడ్డాక.. మెజారిటీ ఉన్న జేడీఎ్‌స-కాంగ్రెస్‌ కూటమిని గాక బీజేపీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోతున్నారని తెలియగానే కుమారస్వామి చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సందర్భంగా సీఎం ఆయనకు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవడం, అదే సమయంలో గవర్నర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం చేయాలో వివరించారు. ఇవి కర్ణాటక రాజకీయ పరిణామాల్లో కీలకంగా ఉపయోగపడ్డాయని అంటున్నారు. మరోవైపు గవర్నర్‌ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని కూడా బాబు సూచించారు. బిహార్‌, గోవా, మణిపూర్‌లలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీలకు అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను డిమాండ్‌ చేయాలని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. గవర్నర్ల వ్యవస్థతో కేంద్రం పెత్తనం చేయడం కుదరదని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్ణయం సరికాదన్నది బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా సీఎంకు ఫోన్‌ చేసి కర్ణాటక పరిణామాలపై చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ చేతులు కలపాలని ఆమె ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...