Jump to content

Recommended Posts

http://www.eenadu.net/homeinner.aspx?category=business&item=break96

 

77పైసలు తేడా వచ్చింది.. ఎందుకో చెప్పండి
రూపాయి తక్కువైనా లెక్క లెక్కే అంటున్న జీఎస్‌టీ అధికారులు

0320349BRK-GST.JPG

దిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) ద్వారా పన్ను ఎగవేతదారులు తప్పించుకోలేరని, నయా పైసాతో సహా వసూలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దానికి తగ్గట్లుగానే అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. పన్ను చెల్లింపుల విషయంలో రూపాయి తక్కువైనా ఒప్పుకొనేది లేదంటున్నారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. పన్ను చెల్లింపులో 77 పైసలు వ్యత్యాసం వచ్చింది. ఎందుకో చెప్పండి అంటూ ఓ ఇంజినీరింగ్‌ కంపెనీకి పన్ను విభాగం అధికారులు నోటీసులు పంపారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కంపెనీ ఇటీవల పన్ను చెల్లింపులకు సంబంధించిన రిటర్నులను దాఖలు చేసింది. అయితే అందులో 77 పైసల తేడా ఉండటంతో పన్నువిభాగం అధికారులు నోటీసులు పంపారు. ‘2017 అక్టోబర్‌-డిసెంబరుకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-1, జీఎస్‌టీఆర్‌-3బీ పత్రాల్లో రూ. 0.77999999999883585 వ్యత్యాసం ఉంది. ఎందుకో స్పష్టత ఇవ్వండి’ అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

పన్ను చెల్లింపుల విషయంలో జీఎస్‌టీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కంపెనీల పన్ను చెల్లింపులకు, రిటర్నులకు మధ్య చిన్న తేడా ఉన్నా సరే నోటీసులు పంపి వివరణ అడుగుతున్నారు. దీనిపై స్పందించకపోతే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. గతేడాది జులైలో వస్తు సేవల పన్ను జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీని కింద వస్తువులు, సేవలన్నింటికీ 5, 12, 18, 28 ఇలా నాలుగు శ్లాబుల కింద పన్నులు విధించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...