Jump to content

ONGC Nagayalanka


Recommended Posts

కేజీ బేసిన్‌లో 35వేల కోట్ల పెట్టుబడి
ఓఎన్‌జీసీ సీఎండీ శశి శంకర్‌
  నాగాయలంక చమురు క్షేత్రంలో వెలికితీత ప్రారంభం
22ap-state5a.jpg

ఈనాడు, అమరావతి; రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: భవిష్యత్తులో కృష్ణా - గోదావరి(కేజీ) బేసిన్‌లో అధికంగా చమురు, గ్యాస్‌ నిక్షేపాలను వెలికితీస్తామని ఓఎన్‌జీసీ సీఎండీ శశి శంకర్‌ చెప్పారు. మంగళవారం కృష్ణా జిల్లా నాగాయలంకలోని కొత్త చమురు క్షేత్రంలో వెలికితీతను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గ్యాస్‌ వాణిజ్యపరమైన విక్రయాలను కూడా ప్రారంభించారు. స్థానిక కార్యక్రమంలోను, రాజమహేంద్రవరంలో విలేకరులతోను ఆయన మాట్లాడారు. కేజీ బేసిన్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెట్టామనీ,  పనులన్నీ పూర్తయితే చాలా రెట్ల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. నాగాయలంకలోని చమురు క్షేత్రం రికార్డు సమయంలో పని ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుతం ఓ బావిని వినియోగంలోకి తెచ్చామన్నారు. దీని నుంచి రోజుకు 120 క్యూబిక్‌ మీటర్ల చమురు, 50 వేల స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల మేర గ్యాస్‌ను వెలికితీస్తామన్నారు. వచ్చే ఏడాది రెండో దశ ప్రారంభిస్తామన్నారు. దేశీయ ఉత్పత్తిలో భాగంగా రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో 24 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నుంచి 50 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి చేయడానికి ఓఎన్జీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. కాకినాడ ఆఫ్‌షోర్‌లో అన్వేషణ పూర్తి చేశామని 2019 నాటికి ఆ ప్రాôతంలో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్‌ సంస్థలను విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నాగాయలంక కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, దిల్లీలో ఏపీ భవన్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, వేదాంత కంపెనీ ప్రతినిధి పంకజ్‌ జైన్‌, ఓఎన్‌జీసీ ఈడీ - ఎస్సెట్‌ మేనేజర్‌ డీఎంఆర్‌ శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

ఏపీకి రూ.237 కోట్లు విడుదల చేసిన కేంద్రం
24-05-2018 20:08:42
 
అమరావతి: 2018-19 ఏడాదికి ఏపీ ప్రభుత్వానికి రూ.237.53 కోట్ల రాయల్టీని కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత పెట్రోలియం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ భవన్‌ రెసిడెంట్ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ చొరవతో సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇవ్వాల్సిన నిధులు ముందుగానే విడుదల చేశారు.
Link to comment
Share on other sites

ఏపీకి ద్రోహం
26-05-2018 03:35:07
 
636629025099731112.jpg
  •  రాష్ర్టాన్ని విస్మరించారని ఆంధ్రుల్లో ఆగ్రహం
  •  అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్‌ కమిటీలో: మంత్రి యనమల
న్యూఢిల్లీ, అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొంది నాలుగేళ్లు గడిచినా... చట్టంలో ఉన్న నిబంధనలు, నాడు రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని నిలదీశారు. విభజన సమస్యల పరిష్కారం, హామీల అమలు విషయంలో కేంద్రం ద్రోహం చేసిందని భావించే... ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన 13వ అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో యనమల పాల్గొన్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై పూంఛీ కమిషన్‌ ఇచ్చిన సిఫారసులపై ఇందులో చర్చ జరిగింది. ఈ సమావేశంలో యనమల మాట్లాడుతూ... విభజన చట్టం అమలులో ఎదురవుతున్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని యనమల కోరారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపును 2011 జనాభా ఆధారంగా చేపట్టాలని 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్నారని, దీనివల్ల జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణం, జీవావరణం, వాతావరణ మార్పు అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చాలని, తద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకునే వీలు కలుగుతుందని అన్నారు. ఆఫ్‌షోర్‌(సముద్రం)లో సహజవాయువు నిక్షేపాల వెలికితీత ద్వారా కేంద్రానికి అందుతున్న రాయల్టీని రాష్ట్రాలకూ పంచాలని కోరారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని తాము వ్యతిరేకించామని యనమల విలేకరులకు వెల్లడించారు.
Link to comment
Share on other sites

పర్యావరణాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి
  అంతర్రాష్ట్ర మండలి స్థాయీసంఘం సమావేశంలో యనమల డిమాండ్‌
25ap-main10a.jpg

ఈనాడు, దిల్లీ: పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను కేంద్ర జాబితా నుంచి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి స్థాయీసంఘం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున పాల్గొన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను కేంద్రం ముందుంచారు. ‘‘అడవులు ఉమ్మడి జాబితాలో ఉన్నందున పర్యావరణాన్నీ అదే కోవలోకి చేర్చాలి. ఒకప్పుడు రాష్ట్రాల జాబితాలో ఉన్న అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చినందున వాతావరణాన్ని దాని కిందికే తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ఏళ్లతరబడి అనుమతులు ఇవ్వకపోతే అభివృద్ధి పనులు ఆగిపోతాయి. ఆ అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేరిస్తే ఎవరిచట్టాలు వారు చేసుకోవచ్చు. అవసమైనపుపడు కేంద్రాన్ని సంప్రదించవచ్చని చెప్పాం. ఈ ప్రతిపాదనను అంతరాష్ట్ర మండలి సమావేశం ముందుపెడదామని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు’’ అని యనమల పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా హామీని తక్షణం అమలుచేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్లు చెప్పారు. అన్నీ పరిశీలిస్తామని ఆయన సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 15వ ఆర్థ్థికసంఘం విధివిధానాల వల్ల చాలా రాష్ట్రాలు నష్టపోతున్నాయని, వాటిని సవరించాలని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. సముద్రతీరంలో 12 నాటికల్‌ మైల్స్‌లోపు వెలికితీసే చమురు, గ్యాస్‌ ఉత్పత్తులపైన; కృష్ణాజిల్లాలో నాగాయలంకలో వెలికితీస్తున్న గ్యాస్‌ పైనా రాష్ట్రానికి రాయల్టీ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం పన్నుల్లో వాటా రాష్ట్రాలకు 10% పెంచినా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కోత పెట్టడంవల్ల రాష్ట్రాలకు ఇదివరికంటే ఎక్కువ భారం పడుతున్న విషయాన్ని చెప్పామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కాదని కేంద్రం నేరుగా స్థానిక ప్రభుత్వాలతో సంప్రదించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజలపై పడుతున్న పెట్రో ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని యనమల డిమాండ్‌ చేశారు. రాష్ట్రంపై అభివృద్ధి, సంక్షేమ పథకాల భారం ఉన్నందున పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించే పరిస్థ్థితి లేదన్నారు. కేంద్రమే పెట్రోలుపై దిగుమతి, ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

ఇంటింటికి గ్యాస్‌ సరఫరా ప్రాజెక్టు 
కృష్ణా జిల్లాలో త్వరలో ప్రారంభం: మేఘా కంపెనీ

ఈనాడు, అమరావతి: దేశంలో తొలిసారి గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ సరఫరా చేసే ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తుముకూరు, బెల్గాం జిల్లాలలో త్వరలో ప్రారంభించనున్నట్లు మేఘా ఇంజినీరింగ్‌ మెయిల్‌- హైడ్రోకార్బన్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.రాజేశ్వరరెడ్డి ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు పనితీరును పరీక్షించామని, త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరుల్లో ఫిల్లింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని, దీనికి అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ సిద్ధమైందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్‌ సరఫరా చేయడం ద్వారా జీవన ప్రమాణాలను, సమాజంలో ఇన్‌ఫ్రా ఫలాలను నేరుగా అందించేందుకు పర్యావరణ హిత పద్ధతులను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓఎన్‌జీసీ ప్రారంభించిన గ్యాస్‌ కేంద్రం నుంచి 90వేల ఎస్‌సీఎండీ (స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ పర్‌డే) గ్యాస్‌ను ఒక రోజులో పొందేలా త్వరలో ఓఎన్‌జీసీతో ఒప్పందం కుదుర్చుకోనున్నామని వివరించారు.

Link to comment
Share on other sites

నేరుగా వంటింట్లోకే గ్యాస్‌
09-06-2018 01:49:33
 
636641057818390538.jpg
  •  సరఫరాకు ‘మేఘా’ సిద్ధం
  •  తొలుత ఏపీ, కర్ణాటకలకే..
అమరావతి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా వంటింట్లోకి నేరుగా గ్యాస్‌ సరఫరా చేసే ప్రాజెక్టుకు ‘మేఘా ఇంజనీరింగ్‌’ శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా, కర్ణాటకలోని తుంకూరు, బెల్గాం జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. వినియోగదారులకు నేరుగా వంటింటికే గ్యాస్‌ను అందించేలా ‘ఎకో ఫ్రెండ్లీ’ విధానాలను అమలు చేయనున్నది. నిజానికి, ‘మేఘా’ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. త్వరలో అధికారికంగా ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరులో ఫిల్లింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో తూంకూరు, బెల్గాం జిల్లాలోనూ గృహ, వాణిజ్య గ్యాస్‌ సరఫరాకు ‘మేఘా’ సన్నద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్‌ సరఫరా కోసం ఓఎన్‌జీసీ , గెయిల్‌లతో ‘మేఘా’ ఒప్పందం చేసుకుంది. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఇటీవలే వాణిజ్యపరమైన గ్యాస్‌ సర్వీసులను ఓఎన్‌జీసీ ప్రారంభించింది. ఈ కేంద్రం నుంచి 90 వేల స్టాండర్ట్‌ క్యూబిక్‌ మీటర్‌ పెర్‌ డే (ఎన్‌సీఎండీ) పొందేలా ఓఎన్‌జీసీతో మేఘా అవగాహన కుదుర్చుకుంది. ఆ సంస్థ నుంచి అందుకొనే గ్యాస్‌ను ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రధాన కేంద్రం నుంచి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం 571 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వేశారు. ఇప్పటికే కొన్ని ఇళ్లకు గ్యాస్‌ కనెక్షన్లను ‘మేఘా’ ఇచ్చింది. వినియోగదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 1 month later...
2020కల్లా ఇళ్లకు పీఎన్‌జీ
08-10-2018 02:59:35
 
636745643723060720.jpg
  • గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఏపీ
  • పీఎన్‌జీతో మహిళా సాధికారత సాధ్యం
  • టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అమరావతి-విజయవాడ-రాజమహేంద్రవరం-విశాఖపట్నం గ్రీన్‌ కారిడార్‌ కింద ఉన్న జిల్లాల్లో 2020 నాటికల్లా లక్షల ఇళ్లకు పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌-పీఎన్‌జీ) అందించే ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ పంపిణీ సంస్థ ఏపీజీడీసీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇంధనశాఖ అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ.. ఏపీని గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అవసరమైన ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాలని సూచించారు. రానున్న నాలుగేళ్లలో లక్షలాది కుటుంబాలకు వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇబ్బందులను తగ్గించడంతో పాటు వాహనాలు, పరిశ్రమలకు సహజ వాయువును 40 శాతం తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గృహ అవసరాలకు వినియోగించే రాయితీ ఎల్‌పీజీ సిలిండర్ల కంటే పీఎన్‌జీ 10 శాతం తక్కువకే లభిస్తుందని, పైగా వినియోగదారులకు సిలిండర్ల సమస్య ఉండదని తెలిపారు.
 
సంప్రదాయ పెట్రోలు, డీజిల్‌ కంటే వాహనాలకు సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) వాడటం వల్ల చమురు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని వెల్లడించారు. చమురు, ఎల్‌పీజీ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలకు ఊరట కల్పించే మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చెప్పారు. అదృష్టశావత్తూ రాష్ట్రంలో సహజవనరులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న సీఎన్‌జీ... పెట్రోల్‌, డీజిల్‌తో పోల్చితే 35-40 శాతం తక్కువ ధరకే దొరుకుతుందని తెలిపారు. పెట్రో ధరలు రోజువారీ మారుతున్నాయని, సీఎన్‌జీ ధరలు మాత్రం స్థిరంగా ఉంటాయని వెల్లడించారు. గోదావరి జిలాల్లో ఏపీజీడీసీ రూ.2500 కోట్లతో చేపట్టిన సహజవాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ‘మహిళా సంక్షేమానికే నా తొలిప్రాధాన్యం. పైపులైన్ల ద్వారా వంటగ్యా్‌సను నేరుగా ఇళ్లకే, అదీ తక్కువ ధరకే అందించాలన్నదే నా లక్ష్యం. పీఎన్‌జీ ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుంది. లక్షలాది పేద, మధ్య తరగతి కుటుంబాలు లబ్ధి పొందుతాయి. వాణిజ్య అవసరాలకు సహజ వాయువును 35-40 శాతం తక్కువ ధరకే అందించడం వల్ల పారిశ్రామికీకరణ పెరిగి భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని చెప్పారు. గ్యాస్‌ ధర తక్కువే కాకుండా సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహజ వాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు 3-4 ఏళ్లలో పూర్తవుతుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ సీఎంకు తెలిపారు. గోదావరి జిల్లాల్లో 1.2లక్షల గృహాలు, 300 వాణిజ్య సంస్థలను అనుసంధానం చేయాలని ఏపీజీడీసీ లక్ష్యంగా పెట్టుకుందని, 2020కల్లా 35 సీఎన్‌జీ స్టేషన్లు అందుబాటులోకి తెస్తామని వివరించారు.
 
కాకినాడతీరంలో ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ అండ్‌ రీగ్యాసిఫికేషన్‌ యూనిట్‌ (ఎఫ్‌ఎ్‌సఆర్‌యూ)పైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను ప్రముఖ సలహాసంస్థ వర్లీ పార్సన్స్‌ నివేదిక సిద్ధం చేసిందని తెలిపారు. గోదావరి జిల్లాల్లో సుదీర్ఘకాలం పాటు పరిశ్రమలకు అందుబాటు ధరల్లో గ్యాస్‌ సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాకినాడ-శ్రీకాకుళం పైపులైన్ల ప్రాజెక్టులను 2019 కల్లా విశాఖపట్నం వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీశ్‌చంద్ర, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌, ఇంధనశాఖ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

AP lo nikshepaalu anni Gujju gang dochukupothunnaru 20 years nunchi.

Last 4 years nunchi Orissa vaallu complete domination through dhamendra pradhan - orissa, Kakinda Petro complex project raakunda ee BJP vaallu addukunnaru.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...