Jump to content

Kodandarama Temple, Vontimitta


Recommended Posts

త్వరలో సీతారామ లక్ష్మణులకు వజ్రకిరీటాలు
ముందుకొచ్చిన  పారిశ్రామికవేత్త
6 కిలోల పసిడితో మహారాష్ట్రలో తయారీకి నిర్ణయం
kdp-brk1a.jpg

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఏకశిలానగరిలో కొలువైన సీతారామ లక్ష్మణులకు వజ్ర కిరీటాలు బహూకరించేందుకు ఒంటిమిట్ట మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబం ముందుకొచ్చింది. తొలుత కోదండరాముడికి మాత్రమే చేయించాలని భావించారు. ఒక్కరికే కాకుండా సీతమ్మ, లక్ష్మణస్వామికి కూడా కానుక ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం ఒక్కో కిరీటం తయారీకి రెండు కిలోల బంగారం వాడుతున్నారు. బంగారంపై వజ్రాలను అమర్చి అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసే బాధ్యతలను మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నగల  తయారీ సంస్థకు అప్పగించారు. ఆకృతి నమూనాలకు రూపకల్పన చేసిన ఆభరణాల తయారీ సంస్థ ప్రతినిధి సోమవారం కోదండ రామాలయానికి తీసుకొచ్చారు. రామయ్య క్షేత్రంలో శిల్పాలు, గోపురాలు, ప్రాకారాలు, రంగమండపం చిత్రాలను తీసుకొన్నారు. ఇదివరకు జగదభిరాముడి కిరీటం నమూనా సిద్ధం చేసి ముంబయి నుంచి ఇక్కడికి వచ్చారు. అది శిరస్సుకు సరిపోలేదు. కొలతల్లో స్వల్ప మార్పు చేయాలని నిర్ణయించారు. శ్రీరామచంద్రమూర్తితో పాటు సీతాదేవి, లక్ష్మణుడికి కిరీటాలు చేయించేందుకు పసిడి, వజ్రాల కోసం రూ.ఆరేడు కోట్లకు పైగా వెచ్చించేందుకు పారిశ్రామికవేత్త ముందుకొచ్చారు. రాములోరి సన్నిధిలో ఇతర ఆభరణాల కొరత ఉంటే వాటిని కూడా కానుకగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని తయారీ సంస్థ ప్రతినిధి తెలిపారు. రంగ మండపంలో ఉన్న అద్భుతమైన శిల్పం శిరస్సుపై ఉన్న కిరీటం తరహాలో చేయిస్తున్నటు సమాచారం.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
ఒంటిమిట్టకు ప్రపంచ స్థాయి గుర్తింపు
బృహత్తర ప్రణాళిక ఆకృతి అద్భుతం
తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌
25ap-state4a.jpg
ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక దివ్యధామంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్టకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని తితిదే పాలక మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ అన్నారు. ఏకశిలానగరి అభివృద్ధి కోసం రూపొందించిన బృహత్తర ప్రణాళిక ఆకృతి అద్భుతంగా ఉందన్నారు. అధునాతన హంగులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. శుక్రవారం ఒంటిమిట్టలో రూ.4.6 కోట్లతో నిర్మించిన యాత్రికుల వసతి సముదాయ భవనాన్ని ప్రారంభించారు. రూ.100 కోట్లతో వివిధ పనులు, సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించగా.. ఇప్పటికే రూ.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కల్యాణ వేదిక మండపం, ప్రాంగణాన్ని రూ.45 కోట్లతో నిర్మించనున్నట్లు వివరించారు. శ్రీరామ పథకం ఏర్పాటుకు రూ.30 కోట్లకు పైగా వెచ్చిస్తామన్నారు. చెన్నై-ముంబయి రైలు మార్గంలో ఉన్న ఒంటిమిట్టలో అన్ని రైళ్లను ఆపాలని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తిరుమల జేఈవో పోల భాస్కర్‌ మాట్లాడుతూ.. 70 వేల మంది భక్తులు కూర్చొని ప్రశాంతంగా సీతారాముల కల్యాణం తిలకించేలా పనులు చేపట్టనున్నట్లు వివరించారు. రోజూ కనీసం రెండు వేల మందికి అన్నదానం చేసేందుకు తితిదే ముందుకు రావాలని ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి కోరారు. తితిదే, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టరు సి.హరికిరణ్‌ తెలిపారు. చెన్నైకు చెందిన భార్గవ్‌ ప్రైవేటు ఆకృతి సంస్థ ప్రతినిధులు వందన, స్వాతి ఆలయ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. కార్యక్రమంలో సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఉన్నతాధికారులు రామనాథ్‌, ప్రకాష్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

రాష్ట్ర వార్తలు

Link to comment
Share on other sites

YSR family 40 years anni padavulu anubhavinchi Ontimitta -Srirama Temple ki emi cheyyaledu. TDP govt. vachhe varaku ee temple gurinchi bayata vaallaku evariki teliyadu antha ghoram.

Jaffa aa aalayanni kabza cheyyaledu ani santosinchali emo.

Link to comment
Share on other sites

కల్యాణ ‘కలశం’.. ‘శ్రీరామ’ వైభవం!
రూ.45 కోట్లతో కల్యాణ వేదిక నిర్మాణం
  ‘కలశం’ ఆకృతితో తొలి నమూనా విడుదల చేసిన తితిదే
  రూ.28 కోట్లతో ‘శ్రీరామం’ ప్రాజెక్టు
  ఒంటిమిట్ట క్షేత్రానికి మహర్దశ
26ap-main13a.jpg

ఈనాడు, కడప: ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్టలో అభివృద్ధి ఆరంభమైంది..  కోదండరామస్వామి ఆలయాన్ని ప్రగతిపథంలో నడిపించే దిశగా ప్రభుత్వం అడుగేస్తోంది. దత్తత సంస్థ తితిదే ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో వసతులు సమకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అందుకు సంబంధించిన బృహత్తర ప్రణాళిక తాజాగా సిద్ధమైంది. చెన్నైకు చెందిన ఓ సంస్థ సిద్ధం చేసిన ఆకృతిని తితిదే విడుదల చేసింది. పూర్ణకుంభ కలశాకృతిలో వేదిక ఉండేలా ప్రాథమిక నమూనా రూపొందించారు. రూ.45 కోట్ల అంచనాతో సిద్ధం చేయగా.. మొత్తం 72 వేల మంది భక్తులు కూర్చునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వీవీఐపీ విభాగంలో 70 మంది, వీఐపీ-1లో 200, వీఐపీ-2లో 275, వీఐపీ-3లో 4,900 మందితో పాటు  భక్తులు 66,555 మంది కూర్చునేలా నిర్మాణం ఉండనుంది.

ముఖ్యమంత్రి హామీతో..: ఒంటిమిట్ట తితిదే ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచీ భక్తులు శాశ్వత వేదిక అవసరాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కల్యాణం జరుగుతుండగా పెను గాలులు, భారీవర్షం ధాటికి పైకప్పు ధ్వంసమై నలుగురు భక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  ఏడాదిలోపు శాశ్వత కల్యాణవేదిక నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తుది నమూనాలు సిద్ధం చేసి ఒకటి రెండు నెలల్లోనే పట్టాలెక్కించనున్నారు.

26ap-main13b.jpg

అదో మహాయజ్ఞమే!: కల్యాణవేదిక తర్వాత ఇక్కడ మరో బృహత్తర నిర్మాణం ‘శ్రీరామం’ ప్రాజెక్టు. రూ.28 కోట్లతో దీన్ని తితిదే నిర్మిస్తోంది. ఇక్కడ రామాయణ ఘట్టాలకు కేంద్రంగా మార్చనున్నారు.  ఒంటిమిట్ట ఆలయానికి సమీపంలోని కొండపై చేపట్టనున్న ‘శ్రీరామం’ ప్రాజెక్టులో రామాయణంలోని ఏడు కాండలకూ ప్రాధాన్యమివ్వనున్నారు. కొండ దిగువన పోతన మెమోరియల్‌ హాలు నిర్మిస్తారు. మధ్యలో భారీ జాంబవంతుని విగ్రహం ఏర్పాటు చేస్తారు. కొండ పైభాగంలో భారీ గోపురాల మధ్యన బృహత్తర సముదాయం నిర్మించనున్నారు. ఈ సముదాయంలో ఒక్కో భాగానికి ఒక్కో కాండం పేరు సార్థకం చేస్తూ.. చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు.

అన్నివిధాలా అభివృద్ధి: ఒంటిమిట్టను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రూ.45 కోట్లు కల్యాణ మండపానికి వెచ్చిస్తున్నాం. రూ.28 కోట్లతో శ్రీరామం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన వసతి, సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించేందుకు చొరవ చూపుతున్నాం.

- పుట్టా సుధాకర్‌ యాదవ్‌, తితిదే ఛైర్మన్‌
Link to comment
Share on other sites

ఏకశిలానగరిలో విశ్రాంతి భవంతి
ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక భవనం
పురావస్తు, తితిదే అధికారులకు గదులు
120 మంది కూర్చునేలా సమావేశ మందిరం
రామాలయం సమీపంలో నిర్మించాలని ప్రతిపాదనలు
kdp-gen2a.jpg

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం కోదండ రామాలయం కొలువైన ఏకశిలానగరి కీర్తిని మరింత ఇనుమడించేలా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని వసతులు కల్పించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు. భవిష్యత్తులో మరింత తేజస్సు తీసుకొచ్చేలా బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. మరోవైపు ఆలయ సందర్శనం, రాములోరి కల్యాణ ఘట్టం తిలకించేందుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యే ముఖ్యమంత్రి సేద తీరేందుకు అధునాతన వసతులతో సుందర భవంతి నిర్మించాలనే ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది. మొన్నటిదాకా విశ్రాంతి గదులు ఎక్కడ నిర్మించాలని తర్జనభర్జనపడ్డారు. స్థల ఎంపిక ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి కోసం ప్రతిపాదించారు. అనుమతి రాగానే మరో భవన సముదాయం అందుబాటులోకి రానుంది.
* ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సమీపంలో ఆగ్నేయ దిశలో ప్రముఖులు బస చేసేందుకు అనువైన భవనాలను నిర్మించాలని తితిదే సాంకేతిక నిపుణులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో అన్నదానం చేసిన స్థలంలో చేపట్టాలని ఎంపిక చేశారు. ఈ మేరకు నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని పురావస్తు శాఖకు నివేదించారు. తొలుత రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గం చెరువు అలుగు పక్కనే ఉన్న గుట్టపై రూ.5 కోట్లతో సీఎం అతిథి భవనం నిర్మించాలని భావించారు. ఇక్కడ ప్రభుత్వ భూమి 18 ఎకరాలకు పైగా ఖాళీగా ఉంది. తటాకం ఎగువన ఎత్తయిన ప్రదేశంలో నిర్మిస్తే ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ భద్రత సమస్య దృష్ట్యా తాజాగా స్థలాన్ని మార్పు చేశారు. రామయ్య సన్నిధికి సమీపంలో ప్రస్తుతం తాత్కాలిక వాహన మండపం ఉంది. ఇక్కడే విశ్రాంతి భవనాన్ని రెండు అంతస్థులను నిర్మించేలా ఆకృతి రూపొందించారు. గ్రౌండ్‌ ఫోర్ల్‌ 696.75 చదరపు మీటర్లు వైశాల్యంలో నిర్మిస్తారు. ఇక్కడ 120 మందితో సమీక్ష నిర్వహించేలా విశాలమైన సమావేశ గదిని నిర్మించనున్నారు. అతిథులకు ప్రత్యేక గదులను చేపట్టనున్నారు. సీఎం నేరుగా ప్రవేశం కోసం దారి వసతి కల్పిస్తారు. ఇక్కడే పచ్చని ఉద్యానవనం ఏర్పాటు చేసి సామూహిక మరుగుదొడ్లు నిర్మించనున్నారు. మొదటి అంతస్తు వైశాల్యం 562.5 చదరపు మీటర్లు. ముఖ్యమంత్రి బస చేయడానికి అనువైన గదులను ఆధునిక సాంకేతికతను జోడించి సుందరంగా తీర్చిదిద్దుతారు. వీవీఐపీలు, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది సేద తీరేలా పనులు చేయనున్నారు. ఈ భవన సముదాయంలోనే తితిదే, పురావస్తు విభాగాల కార్యాలయాలను నిర్వహించేందుకు ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ భవనం నుంచి ఆలయానికి ఐదు నిమిషాల్లోపే చేరుకోవచ్చు. కడప-రేణిగుంట జాతీయ రహదారికి అతి సమీపంలోనే ఉంటుంది. పక్కనే రూ.28 కోట్లతో శ్రీరామం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పూల తోటలు, నక్షత్ర వనం, ఆహ్లాదం పంచే ఆకుపచ్చని వృక్షాలతో ఈ ప్రాంతం కొంగొత్త శోభ అలరాలుతోంది. సీఎం విశ్రాంతి తీసుకునేలా భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించిన మాట వాస్తవమేనని తితిదే ఈఈ, డీఈలు జగన్మోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కి చరవాణిలో ధ్రువీకరించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే పనులు చేపడతామని వివరించారు. చెన్నైకి చెందిన భార్గవ్‌ సంస్థ ఆకృతి రూపకల్పన చేశారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...