sonykongara Posted December 9, 2018 Author Posted December 9, 2018 పోటీలో పల్లోంజీ, ఎస్సెల్, అదానీ విశాఖ మెట్రోకు వడివడిగా అడుగులు మార్చిలో పనులు ప్రారంభం! కొరియా ఎగ్జిం బ్యాంకు నుంచి రూ.4,200 కోట్ల రుణం ఈనాడు - అమరావతి విశాఖ మెట్రో రైలు సాకారం దిశగా మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు మూడు ప్రఖ్యాత సంస్థలు పోటీలో నిలిచాయి. అవి షాపూర్జీ పల్లోంజీ, ఎస్సెల్, అదానీ గ్రూపులు కాగా ఈ మూడు సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి మార్చిలో మెట్రో పనులు ప్రారంభించాలన్న యోచనతో ప్రభుత్వం ఉంది. మొత్తం ఐదు సంస్థలు మొదట ప్రతిపాదనలతో ముందుకొచ్చినా రెండు వివిధ కారణాలతో వెనక్కి తగ్గాయి. మెట్రో రైలుకు చుట్టుపక్కల ఉండే ఈ భూముల్లో షాపింగ్ మాల్స్, నివాస, వాణిజ్య సముదాయాలు వంటివి నిర్మించనున్నారు. వీటిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నది. * మూడు కారిడార్లలో 42.55 కిలో మీటర్ల పొడవునా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) అక్టోబరులో శ్రీకారం చుట్టింది. * పీపీపీ విధానంలో నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుల్లో హైదరాబాద్ తరువాత దేశంలో విశాఖ రెండోది కానుంది. * రూ.8,300 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా రూ.4,200 కోట్ల కోసం కొరియా ఎగ్జిం బ్యాంకు నుంచి రుణం తీసుకోడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ ఒప్పంద దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులతో రెండు డిపోలు, 38 స్టేషన్లు, వంతెనలు ఏర్పాటు చేస్తారు. * టెండర్ దక్కించుకునే బిడ్డర్ మిగిలిన రూ.4,100 కోట్లతో కోచ్‌లు, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు పూర్తి చేసి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత తీసుకుంటారు. ప్రతిపాదిత కారిడార్లు (కి.మీ.) గాజువాక నుంచి కొమ్మాది 30.38 గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ 5.26 తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు 6.91 * విశాఖలో 250 ఎకరాల ప్రభుత్వ భూముల్లో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలను ఏఎంఆర్‌సీ నిర్వహించి వచ్చే ఆదాయంతో కొరియా ఎగ్జిం బ్యాంకు నుంచి తీసుకునే రుణాన్ని దశల వారీగా తిరిగి చెల్లించనున్నది. * విశాఖ విమానాశ్రయం, షీల్ నగర్ మధ్య, హనుమంతువాకలో డిపోల కోసం భూ సమీకరణ ప్రక్రియ ఇటీవలే మొదలైంది. మూడు నెలల్లో భూమి పూజ విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు వచ్చే మూడు నెలల్లో భూమి పూజ చేసేందుకు ముందస్తు ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఐదు సంస్థల నుంచి మొదట ప్రతిపాదనలు వచ్చినా రెండు వెనక్కి వెళ్లాయి. వీటిలో టాటా గ్రూపునకు ఇప్పటికే పుణె మెట్రో రైలు ప్రాజెక్టు రావడంతో రెండోది చేయడం సాధ్యం కాదని భావించారు. మరోసంస్థ ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనందున ప్రాజెక్టు చేపట్టలేమని పేర్కొంది. మిగతా మూడు సంస్థలు వేసే ఆర్థిక బిడ్లలో ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని అందించేదాన్ని ఖరారు చేయనున్నాం. ఆయా సంస్థల కోరిక మేరకు ఆర్థిక బిడ్లు వేసుకోడానికి జనవరి 21 వరకు గడువు పెంచాం. -ఎన్వీ రామకృష్ణారెడ్డి, ఎండీ, ఏఎంఆర్‌సీ
sonykongara Posted December 27, 2018 Author Posted December 27, 2018 మూడేళ్లలో విశాఖ మెట్రో 21న టెండర్లు తెరుస్తారు ఐదు నెలల్లో ప్రాజెక్టు పనులు ప్రారంభం దక్షిణకొరియా బ్యాంకు నుంచి రూ.4200 కోట్ల రుణం ఈనాడు, విశాఖపట్నం: ప్రభుత్వంపై ఎటువంటి భారం పడకుండా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు చేపడుతున్నామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కరికల్ వలవెన్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోనే ప్రత్యేక విధానంలో వెళ్లాలనుకుంటున్నామని, వచ్చే మూడేళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) ఎండీ రామకృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, కమిషనర్లు బసంత్‌కుమార్, హరినారాయణన్, విప్ గణబాబు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వాసుపల్లి గణేష్‌కుమార్, ఎంపీ హరిబాబు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరికలె వలవెన్ మాట్లాడుతూ మెట్రో కారిడార్లకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే లాభాలతో పాటు టికెటింగ్, ప్రచార, ఇతర మార్గాల ద్వారా వనరులను సమకూర్చు కోవాలన్నారు. ప్రాజెక్టుకు రూ.8,300 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో రూ.4200 కోట్లు వయాడక్ట్, ఇతర నిర్మాణాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ పనులను ప్రభుత్వం చేపట్టాల్సి ఉందన్నారు. మిగిలిన రూ.4100 కోట్లతో ట్రాక్ పనులు, విద్యుదీకరణ, కోచ్‌ల తయారీ ప్రయివేటు వ్యక్తులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. జనవరి 21న టెండర్లను తెరుస్తామని, అప్పటికి మరో అయిదు నెలల్లో పనులు ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాజెక్టులో ప్రయివేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయడంతో ప్రభుత్వానికి కొంత భారం తగ్గడంతో పాటు బాధ్యతగా పనిచేసే వ్యక్తులు వస్తారన్నారు. నష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. 30 ఏళ్లపాటు వారే మెట్రోను నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మధ్యలో వచ్చిన లాభాలను పరిశీలించి 11 ఏళ్ల తరువాత ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చేలా షేర్ తీసుకోనున్నట్లు వలవెన్ చెప్పారు. వాణిజ్యం కోసం 250 ఎకరాలు ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తీసుకురాకుండా బయట నుంచి రుణం తీసుకొని, వచ్చే ఆదాయం నుంచి దానిని తిరిగి చెల్లించేలా ప్రణాళిక చేస్తున్నామని ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి అన్నారు. సివిల్ పనుల కోసం రూ.4200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఈ మొత్తాన్ని సమకూర్చేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం 250 ఎకరాల భూమిని ఏఎంఆర్‌సీకి ఉచితంగా అప్పగించిందన్నారు. ఈ భూమిని పూర్తి వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసి తద్వారా వచ్చే ఆదాయంతో రూ.4200 కోట్లు తిరిగి చెల్లిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మ్లెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కొమ్మాది వరకు ఉన్న మెట్రో కారిడర్‌ను ఆనందపురం వరకు పొడిగించాలని ఎండీని కోరారు. విశాఖలో 58 ఎలక్ట్రిక్ బస్సులు.. విశాఖలోని 43 కి.మీ. బీఆర్‌టీఎస్ రోడ్లపై 58 ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రూ.450 కోట్లతో ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. నిర్వహణ సంస్థలే రూ.150 కోట్లతో బస్సులు కొనుగోలు చేసి నడుపుతాయని చెప్పారు. మరో రెండు నెలల్లో ఇది అమల్లోకి వస్తుందన్నారు.
sonykongara Posted December 27, 2018 Author Posted December 27, 2018 మెట్రో రైలు వీలైతే ఆనందపురం వరకు... రెండో దశలో భోగాపురం వరకుప్రతి కిలోమీటరుకు రూ. 250 కోట్ల ఖర్చు‘ఈనాడు’తో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డిఈనాడు, విశాఖపట్నం 42.55 కిలోమీటర్ల పొడవు.. మూడు కారిడార్లు.. రూ. 8,300 కోట్ల బడ్జెట్, 38 స్టేషన్లు, 20 పార్కింగ్ స్థలాలు.. మరో నెల రోజుల్లో టెండర్లు పూర్తి, మూడేళ్లలో నగరం మీదుగా పరుగులు.. ఇదీ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు స్వరూపం. టెండర్ల ప్రక్రియ వచ్చే జనవరి 21 నాటికి కొలిక్కి వస్తుంది. ఆ రోజు టెండర్లు తెరిచి.. ప్రభుత్వ - ప్రయివేటు విధానంలో భాగస్వామ్య సంస్థను అధికారులు ఎంపిక చేస్తారు. అన్ని ఒప్పందాలు పూర్తయ్యాక ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పనులు మొదలవుతాయి. ఓ ప్రత్యేక విధానంలో ప్రభుత్వానికి ఆర్థిక పరమైన భారం కలగకుండా ఈ ప్రాజెక్టును తెరమీదకు తెస్తున్నారు. దీనిపై అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి బుధవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవెన్, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, విష్ణుకుమార్‌రాజు, ఎంపీ హరిబాబు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు గురించి వివరించారు. అనంతరం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... మనకు పైమార్గమే మేలు...విశాఖలో ఏ మార్గంలో మెట్రో రైలు వెళ్తుందో అధ్యయనం చేశాం. రోడ్డు మార్గంలో అయితే ఒక కిలోమీటరుకు రూ. 100 కోట్ల వరకు ఖర్చవుతుంది. భూగర్భంలో నిర్మిస్తే ఒక్కో కిలోమీటరుకు రూ. 450 నుంచి రూ. 500 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైనుంచి అయితే రూ. 250 కోట్ల వరకు అవుతుంది. వచ్చే ఆదాయానికి, నిర్మాణ వ్యయానికి భూమి మీద వెళ్లేలా నిర్మిస్తే సరిపోతుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పైమార్గమే మేలని నిర్ణయించాం.. ఇక్కడ ప్రతీ కిలోమీటరుకు అడ్డరోడ్లు తగులుతున్నాయి. ఇలా ఉంటే ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. 38 స్టేషన్లు, 20 పార్కింగ్ స్థలాలుమెట్రో ప్రాజెక్టు కోసం 38 స్టేషన్లు నిర్మించాలి. కొమ్మాది నుంచి గాజువాక మధ్యలో 27, తాటిచెట్లపాలెం - చినవాల్తేరు మధ్య 6, గురుద్వారా - పోస్టాఫీసు మధ్య 5 వరకు స్టేషన్లు వస్తాయి. ప్రయాణికులు రెండు వైపులా వచ్చి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, మెట్ల మార్గాలు నిర్మిస్తాం. ఒక్కో స్టేషన్ వద్ద 600 నుంచి 800 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది. అవసరమైన భూమిని సేకరించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోకు ప్రస్తుతం పార్కింగ్ సమస్యగా మారింది. ఇలాంటి లోపాలను దృష్టిలో ఉంచుకొని మెట్రో మార్గాల్లో 20కి తక్కువ లేకుండా పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేస్తాం. ప్రాజెక్టుకు 93 ఎకరాలు అవసరంమెట్రో రైలు మార్గం దాదాపు ప్రభుత్వ భూముల మీదుగానే వెళ్తుంది. మొత్తం 93 ఎకరాలు అవసరం. ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. రహదారి మధ్యలోంచి మెట్రో మార్గం వెళ్తుంది. దీనికి జాతీయ రహదారి సంస్థ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. రైల్వే శాఖ నుంచి ఏడెకరాలు సేకరించాలి. ఇవ్వడానికి ఆ శాఖ అధికారులు సానుకూలంగా ఉన్నారు. పోర్టు నుంచి 35 ఎకరాలు తీసుకోవాలి. పోర్టు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ స్థలాల్లో స్టేషన్లు, మెట్రో కోచ్‌ల మరమ్మతు, నిర్వహణ నిమిత్తం రెండు డిపోలు నిర్మిస్తాం. ఒక డిపోను హనుమంతువాక వద్ద, మరో డిపో విమానాశ్రయానికి దగ్గర్లో ఏర్పాటు చేస్తాం. ఆనందపురం వరకు...మెట్రో ప్రాజెక్టును 42.55 కిలోమీటర్ల పొడవున మూడు కారిడార్లలో నిర్మించాలని నిర్ణయించాం. ఇందులో పెద్దది కొమ్మాది నుంచి గాజువాక కారిడార్. దీని పొడవు 30.8 కిలోమీటర్లు. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు కారిడార్ పొడవు 5.25, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు కారిడార్ పొడవు 6.5 కిలోమీటర్లు. గాజువాక - కొమ్మాది కారిడార్‌ను ఆనందపురం వరకు విస్తరించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆనందపురం, తగరపువలసవైపు జనాభా పెరిగిందని, గృహ నిర్మాణాలు, ప్రాజెక్టులు వచ్చాయని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రస్తావించారు. టెండర్లు ఒక నెల ఆలస్యమైనా దీన్ని కూడా కలపాలని ఆయన కోరారు. దీనిపై ఆలోచిస్తాం. రద్దీ పెరిగితే ప్రజావసరాల దృష్ట్యా కారిడార్‌ను పొడిగించాల్సి ఉంటుంది. కొమ్మాది నుంచి ఆనందపురం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం ఉంది. దీన్ని కూడా ప్రాజెక్టులో కలిపితే అదనంగా మరో రూ. 1500 కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రతిపాదనకు భాగస్వామి సంస్థ సానుకూలంగా ఉంటే ముందుకెళ్తాం. అయినా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే రెండో దశలో అక్కడి వరకు ప్రాజెక్టును పొడిగించాల్సి ఉంది. ఏఎంఆర్‌సీకు 250 ఎకరాలునగర పరిధిలో మెట్రో రైలు కార్పొరేషన్‌కు 250 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. ఈ భూమికి, మెట్రో రైలు ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేదు. ప్రాజెక్టు కోసం తీసుకోనున్న రూ. 4,200 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడం కోసం ఈ భూమిని తగిన ఆదాయవనరుగా మార్చుకుంటాం. ప్రత్యేక బిడ్డింగ్ నిర్వహించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టౌన్‌షిప్‌లు, మాల్స్, భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులను తెస్తాం. సాధ్యమైనంతవరకు ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసి ఆ అప్పు తీరుస్తాం. గాజువాక - కొమ్మాది మెట్రో లైనును ఆనందపురం వరకు పొడిగించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అవసరమైతే టెండర్ల ప్రక్రియను ఓ నెల వాయిదా వేసయినా కలపాలంటున్నారు. ఇందుకోసం అదనంగా రూ. 1500 కోట్లవుతుంది. ఈ అంశాన్ని పరిశీలిస్తాం... -అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ ఎన్.వి. రామకృష్ణారెడ్డి
Chaitu87 Posted December 27, 2018 Posted December 27, 2018 Modalupettakunda extension gurinchi enduku. Elections lopu start chesthe baavuntundi at least
sonykongara Posted March 6, 2019 Author Posted March 6, 2019 విశాఖ మెట్రోకు రూ.4,100 కోట్ల రుణం కొరియా ఎగ్జిం బ్యాంకు ప్రతినిధుల బృందం నేడు రాష్ట్రానికి ఈనాడు-అమరావతి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. నిర్మాణేతర పనులకు రూ.4,100 కోట్ల రుణం సమకూర్చేందుకు కొరియా ఎగ్జిం బ్యాంకు ముందుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఆపరేషనల్ డైరెక్టర్ యాంగ్ డాంగ్ చోలే ఆధ్వర్యంలో మరో ముగ్గురి ప్రతినిధుల బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డితో సమావేశం కానున్నారు. రుణ మంజూరుపై విధివిధానాల గురించి ప్రధానంగా చర్చించి అవగాహనకు రానున్నారు. 42.5 కిలోమీటర్ల పొడవునా మూడు కారిడార్లలో ఏర్పాటుచేసే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో రూ.4,200 కోట్ల అంచనాలతో నిర్మాణ పనుల నిర్వహణకు ఐదు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. అదానీ గ్రూపు, షాపూర్జీ పల్లోంజీ, టాటా, ఎస్‌ఎల్ గ్రూపు, ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఈ నెల 7న ఆర్థిక బిడ్లు వేయనున్నాయి. ఈలోగా ప్రభుత్వం తరఫున నిర్మాణేతర పనులకు రూ.4,100 కోట్లను కొరియా ఎగ్జిం బ్యాంకు నుంచి తీసుకోనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయం 2018 సెప్టెంబరు 19న కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖకు రాసిన లేఖపై కొరియా ఎగ్జిం బ్యాంకుకు అక్టోబరు 5న కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. విశాఖ మెట్రోకు నిర్మాణేతర పనులకు రూ.4,100 కోట్ల రుణాన్ని 0.15 శాతం నుంచి 1.5 శాతం వడ్డీకి అందించే విషయాన్ని పరిశీలించాలన్న కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ సూచనపై బ్యాంకు సానుకూలంగా స్పందించింది. మెట్రో పనులకు గురువారం టెండర్లు వేసే 5 సంస్థల్లో ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే ఓ సంస్థను వేగంగా ఖరారు చేయాలని మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు యోచిస్తున్నారు. కొరియా ఎగ్జిం బ్యాంకు రుణం అధికారికంగా ఖరారైన వెంటనే పనులను ప్రారంభించాలని భావిస్తున్నారు.
sonykongara Posted March 7, 2019 Author Posted March 7, 2019 మెట్రోకు సకాలంలో రుణం అందించండి కొరియా ఎగ్జింబ్యాంకు ప్రతినిధులతో సీఎస్ ఈనాడు, అమరావతి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సకాలంలో రుణం మంజూరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ కొరియా ఎగ్జిం బ్యాంకు ప్రతినిధుల బృందాన్ని కోరారు. మెట్రో రైలుకు రూ.4,100 కోట్ల రుణం మంజూరుకు ముందుకొచ్చిన ఎగ్జిం బ్యాంకు తరఫున ఆపరేషనల్ డైరెక్టర్ యాంగ్ డాంగ్ చోలే నేతృత్వంలో ప్రతినిధుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠ, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డిలను సచివాలయంలో బుధవారం కలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం అత్యంత ఆసక్తిగా ఉందని, రుణ విడుదలకు ముందస్తు అనుమతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదికలోని అంశాలను ప్రస్తావించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now