Jump to content

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్?


sonykongara

Recommended Posts

1 minute ago, niceguy said:

Vallu ichina empty bottle istharu..anduke Haribabu gaadu chetha drama start cheyinchaaru..lite thiskoni come out of NDA..

march 5th varaku time ichina edina isthaaru ane nammakam ledu..current trend prakaram nothing will be on papers..

Chusthunte alane vundhi.. 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Another example: Busy ga vunna division nunchi teesukelli inko divisions ki pampatam

suffer ayyedi telugu people.

AP BJP leaders another chance to get it

 

 

విశాఖ స్టేషన్‌లో బోగీలాట 
 అందుబాటులో లేని 100 కోచ్‌లు.. ఇతర డివిజన్లకు మళ్లింపు 
తక్కువ బోగీలతో, భారీ రద్దీతో నడుస్తున్న వాల్తేరు రైళ్లు 
vsp-top1a.jpg

ఇదో దోపిడీ.. 
ఖుర్దారోడ్‌ డివిజన్‌కు చెందిన పూరి - చెన్నై (22859/60) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వారపు రైలు ఇది. ఒకపక్క విశాఖ రైళ్లకు బోగీల కొరత పీడిస్తుంటే.. అధికారులు ఇక్కడున్నవాటిని తీసుకెళ్లి ఆ రైలుకు అమర్చారు. ఇలా 2 శీతల బోగీలు సహా 6 బోగీల్ని తగిలించి గత రెండు నెలలైంది. ఇలాగే మరికొన్ని బోగీలను ఖుర్దారోడ్‌, సంబల్‌పూర్‌ డివిజన్ల రైళ్లకు తగిలించి నడుపుతున్నారు.

విశాఖపట్నం:విశాఖ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలవాపైపు వెళ్తున్న రైళ్లన్నీ కిక్కిరిసి ఉంటున్నాయి. ఇక్కడి నుంచి అదనపు రైళ్లను నడిపేంత డిమాండ్‌ ఉంది. అదేం చిత్రమో.. రైల్వే అధికారులు ఇక్కడి బోగీలను తీసుకెళ్లి పక్క డివిజన్ల పరిధిలోని రైళ్లకు తగిలిస్తున్నారు. దీంతో విశాఖ స్టేషన్‌కు దాదాపు వంద బోగీల కొరత ఏర్పడింది.

ఎలా అంటే... : విశాఖలోని న్యూకోచింగ్‌ కేర్‌ (డిపో)కు నిరంతర ప్రయాణాల కోసమని 741 బోగీల్ని (కోచ్‌లను) కేటాయించారు. నిబంధనల ప్రకారం మరో 8 శాతం అదనంగా కలిపి 800 బోగీలను వాల్తేరు డివిజన్‌కు అందించారు. గత ఏడాదికాలంగా సుమారు వందకుపైగా బోగీలను వాల్తేరు డివిజన్‌ కొరతగా చూపిస్తూ వస్తోంది. గత జనవరి నుంచే చూస్తే రోజువారీ వినియోగానికి 670 నుంచి 712 లోపే బోగీలు అందుబాటులో ఉన్నట్టు గణాంకాలు చూపించింది. తాజాగా ఇది 699గా ఉంది. మరి మిగిలినవి ఏమయ్యాయని ఆరా తీస్తే.. వీటిని మరమ్మతు చేసేందుకు భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌ వ్యాగన్‌వర్క్‌ పీవోహెచ్‌ వర్క్‌షాప్‌కు పంపినట్టు తేలింది. సాధారణంగా ప్రతి నెలా మరమ్మతుల కోసం వెళ్లడం రివాజే. అయితే అలా వెళ్లినవన్నీ తిరిగి రావటం లేదు. నెలకు 30, 40 దాకా బోగీలను పంపుతోంటే వెనక్కి వస్తున్నవి 15 నుంచి 30 మధ్యలో ఉంటున్నాయి. అక్కడ మిగిల్చుకున్న వాటిని ఇతర డివిజన్లలో రద్దీ కారణం చూపించి పంపేస్తున్నట్టు రైలే విభాగాలు వెల్లడించాయి. వాల్తేరు డివిజన్‌లో సుమారు 100 బోగీల కొరతతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని తూర్పుకోస్తా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అటు నుంచి స్పందనే లేదు.

కొన్నిరూట్లకు కోతలు..: శీతల, స్లీపర్‌, జనరల్‌, లగేజీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ బోగీల కొరత ఉంది. 215 స్లీపర్‌ బోగీలకుగాను 190 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో రిజర్వేషన్‌ సీట్ల కోసం వాల్తేరు డివిజన్‌ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. హాల్టింగ్‌కు వచ్చే రైళ్ల బోగీల్ని యుద్ధప్రాతిపదికన తీసి ఇతర రైళ్లకు అమరుస్తున్నారు. ఒక్కోసారి వాటికి మరమ్మతులు అవసరమైనా.. అవి అపరిశుభ్రంగా ఉన్నా.. పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇటీవల కాలంలో అపరిశుభ్రత, బోగీల్లో ఇతర సమస్యలపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావటానికి ఇదే కారణం. పైగా ఇలా పెట్టెలను మార్చే క్రమంలో కనీసం అరగంట నుంచి 3 గంటలకు పైగా రైళ్లకు ఆలస్యమవుతోంది. గత కొన్ని రోజులుగా విశాఖ - హజ్రత్‌ నిజాముద్దీన్‌ సమతా ఎక్స్‌ప్రెస్‌ విశాఖ నుంచి 4 గంటల ఆలస్యంగా బయల్దేరుతోంది. విశాఖ - అమృత్‌సర్‌ హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ - ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లాంటి దూరప్రాంత రైళ్లన్నీ బోగీల మార్పిడితో ఆలస్యంగా బయలుదేరుతున్నాయి.

మరోవైపు కోచ్‌ల కొరత కారణంగా అధికారులు పలు రైళ్లకు కోతలు పెడుతున్నారు. సామాన్యులు ప్రయాణించే విశాఖ - పలాస, విశాఖ - రాయపూర్‌, విశాఖ - కోరాపూట్‌లాంటి రైళ్లలో జనరల్‌ కోచ్‌లకు కోతలు పెట్టారు. కేకేలైన్‌లో తిరుగుతున్న ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌లకు లగేజీ బోగీల్ని పంపించట్లేదు.

ప్రత్యేక రైళ్ల మాటే లేదు..: మరోపక్క అదనపు రైళ్లను నడపడంలోనూ వాల్తేరు డివిజన్‌ తీరు విమర్శలపాలవుతోంది. గత డిసెంబరు జనవరి నెలల్లో శబరిమల భక్తులకు, గతేడాది దీపావళి, దసరా, ఈ ఏడాది సంక్రాంతి పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపలేకపోయింది. కనీసం రద్దీ రైళ్లకు అదనపు బోగీల్ని కూడా వేయలేకపోయింది. ఈ పరిస్థితిపై రైల్వే అధికారుల్ని సంప్రదించినప్పుడు.. కోచ్‌ల కొరత వాస్తవమేనని, ప్రతీ సమావేశంలోనూ జోన్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...