Jump to content

ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు గిత్త!


Recommended Posts

రాజసపు గిత్త రంకేసింది! 

ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు గిత్త! 

pks-gen6a.jpg

 సంతమాగులూరు: విశ్వ విఖ్యాత.. ఒంగోలు గిత్త. వీపుపై మూపురంతో మేరు పర్వతం లాంటి ధేహ దారుఢ్యం. ముచ్చట గొలిపే అందమైన శరీరాకృతి. ప్రతి అడుగులో రాచఠీవి ఉట్టిపడే రాజసం ఒంగోలు గిత్త సొంతం. బ్రెజిల్‌ దేశీయులు మన జాతి గిత్తను రూ. లక్షలు పెట్టి కొనుగోలు చేసి విమానంలో తరలించుకుపోయి అక్కడ ఈ సంతతిని అభివృద్ధి చేసి విశ్వవ్యాప్తం చేశారు. మన ప్రాంతంలో వ్యవసాయంలో రైతుకు అన్నింటా వెన్నుదన్నుగా నిలిచిన ఒంగోలు జాతి గిత్తల సంతతి, ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణ ఆగమనంతో క్రమేపి అంతరించే పోయే స్థితికి చేరుకుంటోంది. ఈ తరుణంలో ఆర్థికస్థితి గలిగిన కొద్ది మంది రైతులు బండలాగుడు బల ప్రదర్శనల పేరుతో రాజసపు గిత్తల ఆనవాళ్లను నేడు సజీవంగా ఉంచుతున్నారు. ఖర్చును లెక్కచేయక నేటికీ ఒంగోలు గిత్తలను కాపాడుకుంటూ వస్తున్న ఔత్సాహిక పెంపకందార్ల కృషిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

భళారే బలప్రదర్శన.. 

సంతమాగులూరు రైతు కొండారెడ్డి వెంకటకోటిరెడ్డి పెంచుతున్న ఒంగోలు జాతి పందెపు ఎడ్లు బండలాగుడు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాయి. ఈ ఏడాదిలో 12 చోట్ల పాల్గొన్న బల ప్రదర్శనలో 10 చోట్ల బహుమతులు కైవసం చేసుకున్నాయి. జాక్‌పాట్‌ విభాగంలో పోటా పోటీగా నిలుస్తున్నాయి. ఈ ఎడ్ల జతను రూ. 5.5 లక్షలకు ఆయన కొనుగోలు చేశారు. నిత్యం వీటి పోషణ, పరిసరాలు పరిశభ్రంగా ఉంచడం, తర్ఫీదు, మందుల వాడకం, తదిరాలకు రోజుకు జతకు రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.60 వేలు, ఏడాదికి రూ.7.20 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీనికితోడు పోటీలకు వెళ్లిన ప్రతిసారీ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు రానుబోను ఖర్చవుతోంది. పోటీల్లో గెలిస్తే రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు బహుమతులు వస్తాయి. పెట్టే ఖర్చులో వచ్చే బహుమతి విలువ కొంతమేరకే. అయినా ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి సంతతిని పెంచడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వారు పోషిస్తున్నారు. పోటీల్లో గెలిచినప్పుడు వచ్చే ఆనందమే రూ.కోట్ల విలువకు సమానంగా ఆయన భావిస్తున్నారు. ఇప్పటికైనా ఒంగోలు జాతి పశు సంపద అభివృదద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరుకుంటున్నారు.

ప్రతి పోటీలో ప్రత్యేకతే.. 

పాతమాగులూరు రైతు చీరబోయిన కోటేశ్వరావు పెంచుతున్న ఒంగోలు జాతి పందెపు గిత్తలు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న ప్రతి పోటీలో ప్రథమ స్థానం సాధించి ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ ఏడాది 20 చోట్ల పాల్గొన్న బల ప్రదర్శనలో అన్ని చోట్ల ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆరు పళ్ల విభాగంలో ఎదురులేని పందెపు ఎడ్లివి. ఈ ఎడ్ల జతను రూ.14 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ జాతి కోడెలు పుట్టిన తర్వాత రెండున్నరేళ్లు పాల పళ్ల దశ నుంచి బండలాగుడు బల ప్రదర్శనకు సిద్ధం చేస్తారు. అనంతరం పదేళ్లపాటు వివిధ విభాగాల్లో బండలాగుడు బలప్రదర్శలకు పనికొస్తాయి. ప్రపంచంలో ఎక్కడాలేని బలమైన జాతి అంతరించిపోకూడదని, వాటిపై ఇష్టంతో అధిక వ్యయ ప్రయాసలున్నా వీటిని పెంచుతున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. పశు సంవర్థక శాఖ ఈ జాతిని అభివృద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానానికి అవసరమైన ఆవుల సంతతిని వృద్ధిచేసి ఒంగోలు జాతి గిత్తల ద్వారా బ్రీడ్‌ చేయడం ద్వారా మేలు జాతి పశు సంపదను వృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

ఖమ్మం, మధిర ప్రాంతాల్లో వృద్ధి... 

సంతమాగులూరు రైతు మూరం వెంకట కోటిరెడ్డి పెంచుతున్న రాజసపు గిత్తలు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న పోటీల్లో బహుమతుల పంట పండించాయి. ఈ ఏడాది 18 చోట్ల పాల్గొన్న బండ లాగుడు బల ప్రదర్శనలో 10 చోట్ల బహుమతుల పంట పండించాయి. రెండు, నాలుగు, ఆరు పళ్ల విభాగంలో సత్తా చాటాయి. పందెపు ఎద్దుల పోషణలో విశిష్టానుభవం ఉన్న పోషకుని పర్యవేక్షణలో చంటి బిడ్డ కంటే మిన్నగా వీటిని సంరక్షిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తల సంతతి అభివృద్ధి కేంద్రం ప్రకాశం జిల్లాలో లేక పోవడం విచారకరమైన పరిస్థితిగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, మధిర, పెనుగంచిప్రోలు ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి గిత్తల్ని కొనుగోలు చేసి పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి రైతులు ఆవులతో వ్యవసాయం చేస్తుండటం వల్ల అవి ఎదకు వచ్చిన సమయంలో ఒంగోలు జాతి ఆబోతులను వినియోగించడం ద్వారా అక్కడ వృద్ధి చెందుతున్నాయని ఆయన వివరించచారు. అక్కడి నుంచి కోడెదూడల్ని జిల్లాకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. బ్రెజిల్‌ దేశస్థులు ఈ జాతి పిండాన్ని కృతిమంగా అభివృద్ధి చేసి ఇతర దేశాలకు ఒక్కో పిండాన్ని రూ.లక్షల్లో అమ్ముతున్నారని తెలిపారు. గతంలో ఆవు చూడు మోస్తే ఆవు కడుపులో అర్థ సేరు బంగారముందని భావించే వారు. అదే పరిస్థితి పనరావృతం కావడానికి ప్రభుత్వ పరంగా పశు సవర్థక శాఖ తరపున జిల్లా కేంద్రంలో ఒంగోలు జాతి పశు సంతతి అభివృద్ధి కేంద్రం, ప్రతి మండలానికి ఒంగోలు జాతి ఆబోతును అందించాలని ఆయన కోరారు.

ఒంగోలు జాతి పశు సంపద విస్తృతి అవశ్యం 

రెండేళ్లుగా జిల్లా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. సాగుకు సాగర్‌ జలాలు విడుదలకాక పోవడం పశుగ్రాసం దొరకని దుర్భర పరిస్థితుల్లో సైతం జిల్లా వ్యాప్తంగా ఆర్థిక స్థితి కలిగిన పెద్ద రైతులు 50 జతలకు పైగా ఒంగోలు జాతి పందెపు గిత్తల్ని పెంచుతున్నారు. మన జిల్లాతోపాటు గుంటూరు, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో బండలాగుడు బల ప్రదర్శనలపై మక్కువతో ఒంగోలు జాతి ఎడ్లను పెంచే రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ జాతి కేవలం బల ప్రదర్శనకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయానికీ కీలకంగా మార్చుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రైతు ఇంట ఒంగోలు జాతి ఆవుల పశు సంతతి అభివృద్ధి అయ్యేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమూ ఉంది.

Link to comment
Share on other sites

గిత్తల ర్యాంప్‌ షో సూపర్బ్‌
 
636038878230341060.jpg
  •  దేశీ ఆవులు, గిత్తలపై అవగాహనకు బుల్‌ షో 
  •  ఒంగోలు గిత్తను పరిరక్షించుకోండి 
  •  ‘బుల్‌ షో’లో బ్రెజిల్‌ ప్రతినిధుల వెల్లడి 
హైదరాబాద్‌ సిటీ, అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): కళ్లు చెదిరే అందాలు... జిగేల్‌మనిపించే వసా్త్రలు... క్యాట్‌ వాక్‌ వయ్యారాలు!! సాధారణంగా ర్యాంప్‌ వాక్‌పై మనకు కనిపించే దృశ్యాలివి. కానీ ఇక్కడ క్యాట్‌ వాక్‌లు లేవు.. కవ్వించే అందాలు అంతకన్నా లేవు. అయినా ప్రతి ఒక్కరి చూపూ ర్యాంప్‌ మీదనే.! దర్పం ఒలకబోస్తూ ఠీవిగా ర్యాంప్‌ మీదకు వచ్చిన ఆ జీవాలపైనే!! ‘మనదే..’ అంటూ ఆనందం.. ‘అవునా’ అంటూ ఆశ్చర్యం.. ఇలా ఎన్నెన్నో భావాలు..! వీటన్నిటికీ వేదికంది.. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన బుల్‌ షో. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఇక్కడ ‘జాతీయ గిత్తల ర్యాంప్‌ షో’ను సోమవారం రాత్రి నిర్వహించారు. తెలంగాణాకు చెందిన తూరుపు గిత్తల ర్యాంప్‌ వాక్‌తో ప్రారంభమైన ప్రదర్శన కేరళకు చెందిన వెంచుర్‌, పుంగనూరు గిత్త, ఒంగోలు, దేవరకోట, గిర్‌ (గుజరాత్‌), కాంక్రేజ్‌ (గుజరాత్‌) జాతుల ప్రదర్శనతో వేడుకగా జరిగింది. మొత్తం 10 జాతులకు చెందిన 19 గిత్తలను ఇక్కడ ప్రదర్శించారు. ర్యాంప్‌పై రాజసాన్ని ప్రదర్శించడంలో ఏ మాత్రం తొణకని గిత్తలకు అవార్డులను అందజేశారు.
 
రక్షించుకునే బాధ్యత మీదే
2bull1.jpgనవ్యాంధ్రను ‘క్షీరాగారం’గా మార్చేందుకు కావాల్సిన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెజిల్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అరుదైన ఒంగోలు జాతి గిత్తలను అంతరించి పోకుండా కాపాడుకోవాలన్నారు. కృత్రిమ గర్భధారణ విషయంలో ఏపీ ఇంకా అభివృద్ధి చెందాలని బ్రెజిల్‌కు చెందిన నొగారియో తెలిపారు. బ్రెజిల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ రెండో క్షీర విప్లవం సాధించే అవకాశం ఉందని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. కేవలం పెయ్యదూడలు మాత్రమే జన్మించేలా కొత్త టెక్నాలజీని ఏపీలో తీసుకురానున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా మేలు జాతి పశు సంతతి అభివృద్ధికి తోడ్పాటు అందించేలా నకరికల్లులోని బఫెలో బ్రీడింగ్‌ సెంటర్‌ రూపుదిద్దుకోనుందని స్పీకర్‌ చెప్పారు.
 
విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చలు షురూ
ఏపీకి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌-2029పై సోమవారం చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ అధ్యక్షతన శాఖల వారీగా ఈ చర్చలు జరిగాయి. తొలిగా వ్యవసాయశాఖకు సంబంఽధించి సమావేశం జరిగింది. దీనిలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక అంశాలపై చర్చించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...