Jump to content

Srisailam development plan


Recommended Posts

శ్రీశైలం ఉభయ పట్టణాభివృద్ధిపై సమీక్ష 
 
  • నగరపంచాయతీగా సున్నిపెంట ఏర్పాటుకు చర్యలు
  • సీఎం నిర్దేశాల మేరకు
శ్రీశైలం, మే 2: శ్రీశైలం ఉభయ పట్టణాల అభివృద్ధిపై సోమవారం దేవస్థానం, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, జిల్లా పంచాయతీ అధికారులు సమీక్షించారు. శ్రీశైలం, సున్నిపెంటల అబివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సీఏం చంద్రబాబునాయుడు శ్రీశైల మహా పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత యంత్రాంగం సీఎం ఆదేశాలను అమలులో నిమగ్నమయింది. ఈ క్రమంలో కలెక్టర్‌ విజయమోహన్‌ ఏప్రిల్‌ 25న శ్రీశైలం, సున్నిపెంట ఉభయపట్టణాల అభివృద్ధి విషయమై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థానం, రెవెన్యూ, ఇరిగేషన్‌, జిల్లా పంచాయతీ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
 
ఇక సోమవారంనాటి సమావేశానికి ఏస్‌ఈ రాంబాబు, దేవస్థానం జేఈవో హరినాథరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శోభస్వరూపరాణి, శ్రీశైలం తహసీల్దార్‌ విజయుడు తదితర అధికారులు హాజరయ్యారు. సున్నిపెంటను నగర పంచాయతీ చేసేందుకు అన్ని గృహాలకు విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ఖాళీ స్థలాలు, గృహాలపై ప్రత్యేక సర్వే జరపాలని నిర్ణయించారు. అలాగే శ్రీశైల క్షేత్రం పరిధిలోనూ దేవస్థానం భూమి, పట్టణంలో నివిస్తున్న కుటుంబాలు, గృహాలపై సర్వే నిర్వహించేందుకు పది ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగా శీశైలంలోని అన్ని గృహాలను సున్నిపెంట తరలించనున్నారు.
 
శ్రీశైల క్షేత్రం టీటీడీ తరహా అభివృద్ధి జరగాలంటే భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయదేవాలయ పరిధిని పూర్తి స్థాయిలో విస్తరించడంతోపాటు ఉద్యానాలు, ఔటర్‌రింగ్‌ రోడ్డు, అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రాథమిక సర్వే ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో జిల్లా, దేవస్థానం ఉన్నతాధికారులు శ్రీశైలం, సున్నిపెంట ఉభయ పట్టణాల అభివృద్ధికి కసరత్తు ప్రారంభించారు.
 

 

Link to comment
Share on other sites

శ్రీశైలానికి బీటీ సోయగం
 
636289987993939924.jpg
  •  పట్టణ తరహాలో క్షేత్ర రహదారులు
  • రూ.4కోట్లతో బీటీగా ప్రధాన రోడ్లు
  •  మరో రూ.12కోట్లతో అంతర్గత రోడ్లకూ టెండర్లు 

శ్రీశైలం: శ్రీశైలంలో ప్రధాన రహదారుల ను పట్టణ తరహాలో తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్ర భుత్వం శ్రీశైలక్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈక్రమంలో దేవస్థానం మా స్టర్‌ పనులను ప్రణాళికబద్ధంగా అమలు చే స్తోంది. మొదటి విడతగా 4కి.మీ.మేర ఉన్న క్షేత్ర ప్రధాన రహదారుల్లో రూ.4కోట్ల అంచనా వ్యయంతో బీటీ నిర్మాణం చేపట్టింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా ప్రారంభించిన రహదారుల బీటీ నిర్మాణం చివరిదశకు చేరింది. ప్రధాన రోడ్లన్నీ బీటీగా రూపుదిద్దుకోవడంతో క్షేత్రానికి పట్టణ తర హా సోయ గం సంతరించుకుంది. రద్దీ రోజుల్లో భక్తులకు, వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా ప్రధాన రోడ్లను పూర్తిస్థాయిలో విస్తరింపజేశారు. రోడ్డు నిర్మాణ పనులు త్వ రగా పూర్తయ్యేందుకు దేవస్థానం ఈవో భరత్‌గుప్తా తగిన చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఆలయ తూర్పు, దక్షిణ ప్రధాన రహదారులతోపాటు శివసదన్‌, మల్లికార్జునసదన్‌, గంగాగౌరి సదన్‌, పాతాళగంగ, దేవస్థానపరిపాలన భవనం రోడ్లను బీటీగా అభివృద్ధి చేశారు. అలాగే మరో రూ.12కోట్లతో క్షేత్రపరిధిలోని అన్ని అంతర్గత రహదారులను కూడా బీటీ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు దేవస్థానం టెండర్లు పిలిచింది. క్షేత్రపరిధిలోని అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను ఔ టర్‌ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేవస్థానం చేపడుతున్న రహదారుల అభివృద్ధిపై భ క్తుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది

Link to comment
Share on other sites

  • 2 weeks later...
నల్లమలలో జంగిల్‌ సఫారీ 636300685685400914.jpg


  • సహజమైన అడవిలో విహారం
  • ఆత్మకూరు సమీపంలో ఏర్పాటు

ఆత్మకూరు, మే 10: ఉత్తరాఖండ్‌లో జిమ్‌ కార్బెట్‌, గుజరాతలో గిర్‌ అడవులు, మధ్యప్రదేశ్‌లో కణ్హా నేషనల్‌ ఫారెస్ట్‌, అసోంలో కజిరంగా... ఇవన్నీ దేశంలో ప్రఖ్యాతి గాంచిన జంగిల్‌ సఫారీలలో కొన్ని! వీటి సరసన మన రాష్ట్రంలోని నల్లమల కూడా చేరనుంది. నల్లమల అడవుల్లో ప్రకృతి అందాలను, వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా ‘జంగిల్‌ సఫారీ’ అందుబాటులోకి వచ్చింది. బుధవారం దీనిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా రూ.92లక్షల వ్యయంతో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో... బైర్లూటి ఎకో టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. పర్యాటకులు 15 కిలోమీటర్ల వరకు సహజమైన అడవిలో పర్యటించేందుకు ప్రత్యేక వాహనాలను, మార్గాలను సిద్ధం చేశారు. ఈ మార్గంలో నల్లమలలోని ప్రాచీన దేవాలయాలు, కోనేరులను కూడా సందర్శించవచ్చు. నీలం సంజీవరెడ్డి, జవహర్‌లాల్‌ నెహ్రూ మొక్కలు నాటిన ప్రదేశాన్ని పర్యాటకులకు చూపిస్తారు. ఇక్కడ పర్యాటకులకు స్థానిక చెంచులే గైడ్‌లుగా వ్యవహరిస్తారు. ఇక... బైర్లూటి అడవిలోనే 2.5 హెక్టార్లలో నాలుగు కాటేజీలు, ఆరు టెంటెడ్‌ గృహాలు, ఒక రెస్టారెంట్‌ నిర్మించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...

పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు

సమీక్షించిన కేంద్ర అధికారులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: పర్యాటకులకు, యాత్రికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ‘ప్రసాద్‌’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పర్యాటక ప్రాంతాలు, దేవాలయాల పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం శ్రీశైలం దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో కేంద్రపర్యాటకశాఖ కార్యదర్శి రష్మి వర్మ, పర్యాటకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మీనాక్షిశర్మల నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర దేవాదాయశాఖ ప్రత్యేక ముఖ్య ప్రధాన కార్యదర్శి జె.ఎస్‌.వి.ప్రసాద్‌, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, దేవస్థానం ఈవో ఎన్‌.భరత్‌గుప్తా, సాంస్కృతిక శాఖ అధికారులు హాజరయ్యారు. శ్రీశైలమహాక్షేత్రంలో ప్రస్తుతం దేవస్థానం భక్తులు, పర్యాటకుల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అవసరాలపై ఈవో భరత్‌గుప్తా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ పథకం ద్వారా సుమారు రూ.40 నుంచి 60 కోట్లు మంజూరయ్యే విధంగా ఈవో ప్రతిపాదనలను కేంద్రపర్యాటకశాఖ కార్యదర్శికి సమర్పించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను శనివారం కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి రష్మి వర్మ, డైరెక్టర్‌ జనరల్‌ మీనాక్షి శర్మ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌.వి ప్రసాద్‌ దర్శించుకున్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
శ్రీశైలం గర్భాలయ ద్వారాలకు సువర్ణ శోభ
14-08-2017 02:10:41
 
636382779209767151.jpg
  • రూ.కోటితో కవచాలు చేయించిన దేవస్థానం
 
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల గర్భాలయ ద్వారాలకు బంగారు కవచాలు తయారు చేయించింది. వృద్ధమల్లికార్జున స్వామివారి ఆలయ ముఖ మండపంలో ఈవో భరత్‌గుప్తా, ఆలయ అర్చకులు, వేదపండితులు... బంగారు ద్వార కవచాలకు ఆదివారం శాస్త్రోక్తంగా సంప్రోక్షణాది పూజలు జరిపారు. సుమారు రూ.కోటి వ్యయంతో స్వామి, అమ్మవార్ల ఉభయ గర్భాలయ ద్వారాల అమరికకు 79 రాగి రేకులకు 2.69 మైక్రాన్ల మందంతో బంగారు పూత వేయించారు. ఇందుకోసం 220 కేజీల రాగి, 1.5 కేజీల బంగారాన్ని వినియోగించినట్లు ఈవో భరత్‌గుప్తా వెల్లడించారు. బంగారు కవచాలపై లింగోద్భవమూర్తి, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, సోమస్కందమూర్తి.. తదితర పరమేశ్వరుడి రూపాలు, పద్మాలంకరణలు, ద్వారపాలక రూపాలను ముద్రించారు. ఉభయ గర్భాలయ ద్వారాలకు బంగారు కవచాలను ఈ నెల 18వ తేదీలోగా అమర్చుతామని ఈవో తెలిపారు.
శ్రీశైలం గర్భాలయ ద్వారాలకు సువర్ణ శోభ
14-08-2017 02:10:41
 
636382779209767151.jpg
  • రూ.కోటితో కవచాలు చేయించిన దేవస్థానం
 
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల గర్భాలయ ద్వారాలకు బంగారు కవచాలు తయారు చేయించింది. వృద్ధమల్లికార్జున స్వామివారి ఆలయ ముఖ మండపంలో ఈవో భరత్‌గుప్తా, ఆలయ అర్చకులు, వేదపండితులు... బంగారు ద్వార కవచాలకు ఆదివారం శాస్త్రోక్తంగా సంప్రోక్షణాది పూజలు జరిపారు. సుమారు రూ.కోటి వ్యయంతో స్వామి, అమ్మవార్ల ఉభయ గర్భాలయ ద్వారాల అమరికకు 79 రాగి రేకులకు 2.69 మైక్రాన్ల మందంతో బంగారు పూత వేయించారు. ఇందుకోసం 220 కేజీల రాగి, 1.5 కేజీల బంగారాన్ని వినియోగించినట్లు ఈవో భరత్‌గుప్తా వెల్లడించారు. బంగారు కవచాలపై లింగోద్భవమూర్తి, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, సోమస్కందమూర్తి.. తదితర పరమేశ్వరుడి రూపాలు, పద్మాలంకరణలు, ద్వారపాలక రూపాలను ముద్రించారు. ఉభయ గర్భాలయ ద్వారాలకు బంగారు కవచాలను ఈ నెల 18వ తేదీలోగా అమర్చుతామని ఈవో తెలిపారు.
Link to comment
Share on other sites

Have been to Srisailam this week ...3 yrs back visit chesinappatiki ippatiki lot of changes...neatness maintain chestunnaru and bio toilets every where...

 

parking okkati solve cheste inka super..ekkada padite akkada parking chesi traffic jam chestunnaru...I hope they have plans for that too because konni constructions dismantle chestunnaru...

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా శ్రీశైలం
అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు
నెల రోజుల్లో పనులకు శ్రీకారం
ప్రసాద్‌ కింద నిధులు కేటాయించిన కేంద్రం
ssrii.jpg

ఈనాడు, అమరావతి: శ్రీశైల మహాక్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. రూ.49.81కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేసింది. ఈ నివేదికపై సంతృప్తి చెందిన కేంద్ర నిధుల మంజూరు, పర్యవేక్షణ కమిటీ కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్‌(పిలిగ్రమేజ్‌ రిజునువేషన్‌ స్పిరిచ్యువల్‌ ఆగ్యుమెంటేషన్‌ డ్రైవ్‌) కింద శ్రీశైలం అభివృద్ధికి రూ.50కోట్లు కేటాయించింది. వచ్చే వారంలో ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి నెలలో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. శ్రీశైలంలో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ఆవశ్యకతకు గల కారణాలను సమగ్ర ప్రాజెక్టు నివేదికలో స్పష్టం చేశారు. అందులో...
* అప్రోచ్‌ రోడ్లు, పర్యాటకులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు, వసతులు అందుబాటులో లేవు.
* శ్రీశైలంలో ఒకటి రెండ్రోజులపాటు పర్యాటకులు ఉండేలా వారిని ఆకర్షించే కార్యక్రమాలు లేవు.

కొత్త ప్రాజెక్టు స్వరూపం...
* ప్రధాన ఆలయాన్ని రూ.16.50 కోట్లతో అభివృద్ధి చేస్తారు. విద్యుద్దీపాల అలంకరణ, లైట్‌, ప్రధాన ఆలయ ఆవరణలో ఎంపిక చేసిన ప్రాంతంలో సౌండ్‌ ప్రదర్శన(ఇందులో శ్రీశైల క్షేత్ర మహత్మ్యం, శివలీలలు వంటివాటిని ప్రధానంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తారు), గ్రానైట్‌తో ఫ్లోరింగ్‌, క్యూలైన్ల ఏర్పాటు.
* పర్యాటకులకు వసతుల కల్పన(ఆహారం, తాగునీటి కేంద్రాలు, ఆధునికంగా రూపొందించిన మరుగుదొడ్లు, పాదచారుల వంతెనలు తదితరాలు).
* యాత్రికులు, భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేకంగా క్యూలైన్ల ఏర్పాట్లు. 8సీట్ల సామర్థ్యంతో మూడు బ్యాటరీ వాహనాలు, ఎక్కడికక్కడ నిండిపోతున్న చెత్తకుండీల స్థానంలో చక్రాల చెత్తబుట్టల(వీల్‌డస్ట్‌బిన్ల) ఏర్పాటు.
* రూ.6.79 కోట్లతో అత్యాధునిక హంగులతో కూడిన యాంఫిథియేటర్‌. రూ.50లక్షల వ్యయంతో వాచ్‌టవర్‌.
* పాతాళగంగ వద్ద తాడు వంతెన(రోప్‌ వే) పొడిగింపు, జెట్టీ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు అక్కడ పర్యాటకులు, భక్తులు కాసేపు గడిపేందుకు ఏర్పాట్లు.
* బస్టాండ్‌ సమీపంలో, బాహ్య(అవుటర్‌ రింగ్‌ రోడ్డు) వలయ రహదారిని ఆనుకుని పార్కింగ్‌ స్థలాల అభివృద్ధి.
* నాలుగు వరుసల్లో ప్రధాన రహదారి, అలాగే అంతర్గత రహదారుల అభివృద్ధి.
* ఇవేగాక శిఖరం, హఠకేశ్వరం, పాతాళగంగ వద్ద అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 year later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...