Jump to content

Pokiri style realestate danda in Vijayawada


Recommended Posts

తుపాకీ కొసన ఖాకీ తీర్పు.. బెడవాడలో సెటిల్‌మెంట్ ఎస్సై

18-03-2017 00:13:34
636253928159729921.jpg
  • పోకిరి ‘రీల్‌’ సీన్‌ బెజవాడలో రిపీట్‌ 
  • భాగస్థుల గొడవల్లో ఎస్‌ఐ ఓవర్‌యాక్షన్‌ 
  • ఒకరికి కొమ్ముగాసి..మరొకరి కిడ్నాప్‌
  • రియల్టర్‌కు రివాల్వర్‌ గురిపెట్టి..
  • ఖాళీ పేపర్లపై సంతకాలకు బలవంతం
  • మార్కాపురం అడవుల్లో చిత్రహింసలు
  • కళ్లకు గంతలుకట్టి.. 8 రోజులు బందీగా..
  • హైదరాబాద్‌కి తీసుకొచ్చి తీవ్ర వేధింపులు
  • బాధితుడి ఫిర్యాదుతో పోలీస్‌శాఖలో కలకలం
  • ఒకసారి సిట్టింగ్‌లో పాల్గొన్న డీఎస్పీ?
  • ఆ ఖాకీ మార్కాపురం ఎస్‌ఐ అని అనుమానం
  • అన్ని కోణాల్లో దర్యాప్తు: సీపీ గౌతం సవాంగ్‌
విజయవాడ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఓ రియల్టర్‌ను రౌడీ బెదిరిస్తాడు. మమూళ్లు ఇవ్వాలని వార్నింగిస్తాడు. ఆ రియల్టర్‌.. లోకల్‌ సీఐని ఆశ్రయిస్తాడు. ఇద్దరితో సీఐ సిట్టింగ్‌ వేస్తాడు. ‘సీఐ మనవాడే’ అన్న ధీమాతో రౌడీ, ఆ ఇద్దరు కలిసి తనను ఏం చేస్తారోనన్న బెదురుతో రియల్టర్‌ ఉంటా డు. చివరకు, రౌడీని కాల్చేసి.. రియల్టర్‌ కడుతున్న అపార్టుమెంటులో రెండు కోట్లు విలువ చేసే రెండు షాపులను తన భార్య పేరుపై రిజిసే్ట్రషన చేయించుకొంటాడు సీఐ. పోకిరి సినిమాలోని సన్నివేశం ఇది. సేమ్‌ ‘రీల్‌’ సీన్‌.. ‘రియల్‌’గానే విజయవాడలో రిపీట్‌ అయింది. కాకపోతే కాల్పులు, హత్య లు లేవుగానీ.. ఖాకీ క్రౌర్యమంతా కళ్లకు కట్టిన ఘటన ఇది. ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ భాగస్థుల మధ్య వచ్చిన వాటాల గొడవని రివాల్వర్‌ కొసన పరిష్కరించాలని చూసిన ఓ ఎస్‌ఐ ఉదంతం.. పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
 
‘పెద్ద’ సమస్యలో పడ్డారు 
రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ మందగించింది. లాభాలు అడుగంటిపోతుండటంతో, భాగస్వామి నుంచి వేరవ్వాలని రంగారెడ్డి అనుకొన్నాడు. ‘నా దారి నేను చూసుకొంటా’నని రామకోటేశ్వరరావుకి చెప్పాడు. ఈ క్రమంలో వాటాల అంశం ముందుకొచ్చింది. అన్నీ జాయింట్‌గా కొన్న ఆస్తులే. ఎవరు ఏది తీసుకోవాలనేది సమస్యగా మారింది. ‘‘నగదుగా 3 కోట్ల 70 లక్షలు నాకు ఇవ్వు. విశాఖపట్నం సీతమ్మధారలో నువ్వు ఉంటు న్న ఇల్లు నాకు రాసివ్వు. నెక్కల్లులో భూమి నాకు వదిలేయి. మిగతా స్థలాలన్నింటినీ నువ్వే ఉంచు కో’’ అని రంగారెడ్డి ప్రతిపాదించాడు. అందుకు రామకోటేశ్వరరావు అంగీకరించలేదు. పూర్తి లెక్కలు తేలాకే..ఏదైనా మాట్లాడుకుందామన్నాడు. సీతమ్మధారలో ఉన్న ఇంటిపై అటాచ్‌మెంట్‌ ఉందని రామకోటేశ్వరరావు స్పష్టం చేశాడు.
 
చీకట్లో ఖాకీ న్యాయం 
గతనెల 27న రామకోటేశ్వరరావుకు రంగారెడ్డి ఫోన చేశాడు. ఎక్కడున్నావని అడిగారు. ఎన్టీఆర్‌ కాలనీలోని సూర్య మెన్షనలో ఫ్లాట్‌లో ఉన్నానని ఆయన చెప్పాడు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో.. రామకోటేశ్వరరావు చెప్పిన అడ్ర్‌సకి రంగారెడ్డితోపాటు మరో ఆరుగురు వెళ్లారు. రామకోటేశ్వరరావును నిద్రలేపారు. ఆయన బయటకు రాగానే.. వారిలో ఓ వ్యక్తి రివాల్వర్‌ గురిపెట్టాడు. తనను తాను, ప్రకాశం జిల్లాకు చెందిన మార్కాపురం ఎస్‌ఐగా చెప్పుకొని.. తీవ్రస్థాయిలో బెదిరించాడు. రంగారెడ్డి చెప్పినట్టు చేయాలని, పెట్టమన్నదగ్గర సంతకాలు పెట్టాలని హుంకరించాడు. భీతిల్లిపోయిన రామకోటేశ్వరరావు నడుం వద్ద రివాల్వర్‌ నొక్కిపెట్టి అపార్ట్‌మెంట్‌ కిందకు నెట్టుకొచ్చాడు. అక్కడి నుంచి 3 కారుల్లో మార్కాపురం వైపు వెళ్లా రు. రామకోటేశ్వరరావు కళ్లకు గంతలు కట్టేసి దట్టమైన నల్లమల అడవుల్లో తిప్పా రు. ఫారెస్టు అంచుల్లోని పాలకేంద్రంలోకి తీసుకెళ్లి.. తాళ్లతో బంధించారు. 8 రోజులు అక్కడే బందీగా ఉంచారు. రివాల్వర్‌ని గాలిలోకి తిప్పుతూ.. రామకోటేశ్వరరావుని ఎస్‌ఐ బెదిరిస్తుంటే, ఖాళీ స్టాంపు కాగితాలు, తెల్లకాగితాలను రంగారెడ్డి ముందు కు తోశాడు. ఆ ఇద్దరు కలిసి బలవంతంగా సంతకాలు తీసుకొన్నా రు. అక్కడితో వదిలేయలేదు. ఈ నెల 4న రామకోటేశ్వరరావుని కారులో హైదరాబాద్‌కు తరలించారు. కారులో రంగారెడ్డి, ఎస్‌ఐతో పాటు నలుగురు ఉన్నారని.. వారంతా కానిస్టేబుళ్లయి ఉంటారని అనిపించిందని రామకోటేశ్వరరావు తన ఫిర్యాదులో తెలిపాడు. మార్కాపురంలో బందీగా ఉండగా, ఒకసారి డీఎస్పీ వచ్చి.. సెటిల్‌మెంట్‌ చేసుకోండని సూచించి, వెళ్లాడని కూడా బాధితుడు చెబుతున్నాడు. హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆపి, అక్కడి నుంచి వనస్థలిపురం రోడ్డు మీదకు కారును మళ్లించారు. ప్రయాణమంతా రామకోటేశ్వరరావుని ఎస్‌ఐ బెదిరిస్తూనే ఉన్నాడు. ‘‘కోటి... ఇదే నీకు లాస్ట్‌ ఛాన్స. చెప్పినట్టు విను. ఒరిజినల్‌ డ్యాక్యుమెంట్స్‌ ఇచ్చెయ్‌. లేకపోతే నీ భార్యా, పిల్లల్నీ ఇలాగే ఎత్తుకొస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం’’ అని బెదిరించేవాడు. 


అనగనగా ఇద్దరు స్నేహితులు 
కందుల రంగారెడ్డి... హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ వాసి. విజయవాడ ఎన్టీఆర్‌ కాలనీలో ఉంటున్న కలపల రామకోటేశ్వరరావుకు కామనఫ్రెండ్స్‌ ద్వారా స్నేహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి వ్యాపార రంగంలోకి దిగారు. రియల్‌ ఎస్టేట్‌, గ్రానైట్‌ వ్యాపారాలు చేస్తున్నారు. మొత్తం 2 కోట్ల 30 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో అడుగుపెట్టారు. రామకోటేశ్వరరావు వాటా రూ.75 లక్షలు. రంగారెడ్డి వాటా కోటి 35 లక్షలు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న తుళ్లూరు మండలం నెక్కల్లులో ఏడెకరాలు, విశాఖపట్నం జిల్లా అరకు వద్ద గుమ్మకోటలో 28 ఎకరాలు, చిలకలూరిపేటలో 24 ఎకరాలను కొన్నారు. నర్సీపట్నంలోని గుడిపలో గ్రానైట్‌ క్వారీని లీజుకు తీసుకొని..జాయింట్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. 


హైదరాబాద్‌ టు విజయవాడ వయా మార్కాపురం 
రంగారెడ్డి ఉంటున్న హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ లాడ్జిలో రామకోటేశ్వరరావుని బంధించారు. మరునాడు ఓ కాంట్రాక్టర్‌ సమక్షంలో సిట్టింగ్‌ వేశారు. ఆ సమావేశానికి వైజాగ్‌, విజయవాడలోని రామకోటేశ్వరరావు బావలను రప్పించారు. వాళ్లతో ఖాళీ చెక్కులపై రంగారెడ్డి, ఎస్‌ఐ బలవంతంగా సంతకాలు తీసుకొన్నారు. రామకోటేశ్వరరావు ఎంతకీ లొంగకపోవడంతో.. బావలను పంపించివేశారు. ఆయనను దారుణంగా కొడుతూ.. ఆ శబ్దాలను భార్యకి వినిపించి.. భయభాంత్రులకు గురిచేశారు. రామకోటేశ్వరరావు ముందే ఆమెను నోటికొచ్చినట్టు పచ్చిగా దుర్భాషలాడారు. ఆ రోజు సాయంత్రానికి ఆయనను తీసుకొని, తిరిగి మార్కాపురం చేరుకొన్నారు. మళ్లీ తన్ను లు, తిట్లు మొదలుపెట్టారు. ‘‘మేం తీసుకొచ్చినట్టు ఎవరికైనా చెప్పినా.. పోలీసు కంప్లైంట్‌ ఇచ్చినా... నీ భార్యాబిడ్డలు ఉండరు. చూసుకో’’ అని చివరిసారి వార్నింగ్‌ ఇచ్చి, కారులో విజయవాడకు పంపారు. కాగా, ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

 

Link to comment
Share on other sites

Govt notice lokelli aa sannasolla meedha stringent action teesukunte baagunduu

 

 I think this is second such incident I am hearing in the last 6 months. yup, ilanti vaatini mokkalo vundagane tuncheyyali. otherwise, as the prices go higher these activities become worse and eventually kill the growth by scaring outsiders/small players away.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...