Jump to content

Lokesh on Assets Valuation


3mar

Recommended Posts

విజయవాడ: తనకు అక్రమఆస్తులు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. విజయవాడలో ఆయన మీడియా సమక్షంలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పారు. తన తండ్రి చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక 1999లో ఆయనకు హెరిటేజ్‌లో ఉన్న వాటాను తనకు రాసిచ్చారని తెలిపారు. అందులో భాగంగా తనకు 11 లక్షల షేర్లు వచ్చాయని తెలిపారు. దాంతో తాను కూడా షేర్లు కొన్నానని లోకేష్ వివరించారు. ఇప్పుడు హెరిటేజ్‌షేర్లు బాగా పెరిగాయన్నారు. షేర్లు మార్కెట్‌ను బట్టీ పెరుగుతూ, తగ్గుతుంటాయని అందువల్ల తామెప్పుడు మార్కెట్ విలువను ప్రకటించలేదని చెప్పారు. తాము ఏ ధరకు అయితే కొనుగోలు చేశామో ఆ ధరను మాత్రమే ప్రకటిస్తున్నామని లోకేష్ వివరించారు. 

 

గత నవంబర్ లో HERITAGE లో అధిక  మొత్తం వాటాను మార్కెట్ విలువ ఆధారంగా FUTURE Group SEBI నిబంధనలు అనుగుణంగా ఏ ధర కి అయితే    కొనుగోలు చేసిందో ఇప్పుడు ఆ ధర ప్రకారం లో HERITAGE లో నాకు మిగిలి ఉన్న 3.5%  వాటా విలువను ప్రకటించడం జరిగింది. 

 

ఈసీ నిబంధనలను ప్రతిపక్షం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. ఆస్తుల ప్రకటనపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటిస్తున్న తొలి రాజకీయ కుటుంబం తమదేనని ఆయన చెప్పారు. 12 కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్‌ ఏనాడైనా అతని ఆస్తులు ప్రకటించారా? అని లోకేష్ ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...