Jump to content

ఎన్టీఆర్‌ మళ్లీ ద్విపాత్రాభినయం?


Ramesh39

Recommended Posts

మళ్లీ ద్విపాత్రాభినయం? 

71216-brk-sit1.jpg

రెండు పాత్రల్లో నటించడం ఎన్టీఆర్‌కి కొత్తేమీ కాదు. ‘అదుర్స్‌’లో నరసింహ, చారి పాత్రలతో అలరించారు. అన్నీ కుదిరితే మరోసారి ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. దర్శకుడు బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్‌కి బాగా నచ్చిందట. త్వరలోనే ఎన్టీఆర్‌ ఓ నిర్ణయం తీసుకొని స్వయంగా కొత్త సినిమాని ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బాబీ తయారు చేసిన కథలో కథానాయకుడు రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు తెలిసింది. కామెడీ, యాక్షన్‌ మిళితమైన పక్కా మాస్‌ కథతో స్క్రిప్టు సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది. బాబీ ఇదివరకు రవితేజతో ‘పవర్‌’, పవన్‌కల్యాణ్‌తో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో సినిమా ఖాయమైందంటే మాత్రం బాబీ మరో లక్కీ ఛాన్స్‌ సొంతం చేసుకొన్నట్టే

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...