Ramesh39 Posted December 2, 2016 Share Posted December 2, 2016 నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. శ్రియ కథానాయిక. హేమామాలిని కీలక పాత్రలో కనిపిస్తారు. క్రిష్ దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేవలం 79 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. చివరి 14 రోజులు.. రోజుకి 16 గంటల చొప్పున ఏకధాటిగా పనిచేశాం. అందుకే అనుకొన్న సమయాని కంటే ముందే సినిమాని సిద్ధం చేయగలిగాం. జార్జియాలో పతాక సన్నివేశాల్ని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలోనూ, హైదరాబాద్ శివార్లలోనూ ప్రత్యేకమైన సెట్స్ రూపొందించాం. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ఓ ప్రత్యేక పాత్రలో అలరిస్తారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. సంక్రాంతికి ‘గౌతమిపుత్ర..’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞాన శేఖర్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పోరాటాలు: రామ్ లక్ష్మణ్ Link to comment Share on other sites More sharing options...
AP_RaituBidda Posted December 2, 2016 Share Posted December 2, 2016 Link to comment Share on other sites More sharing options...
PHANI_NTR Posted December 2, 2016 Share Posted December 2, 2016 Link to comment Share on other sites More sharing options...
vgchowdary Posted December 2, 2016 Share Posted December 2, 2016 Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted December 2, 2016 Author Share Posted December 2, 2016 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.