Ramesh39 Posted November 16, 2016 Share Posted November 16, 2016 నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ కథానాయిక. హేమామాలిని కీలక పాత్రలో కనిపించనున్నారు. వై.రాజీవ్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, శ్రియలపై నృత్య దర్శకురాలు బృంద నేతృత్వంలో ఓ గీతాన్ని తెరకెక్కించారు. దీంతో చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. డిసెంబరు మొదటి వారంలో ప్రచార చిత్రాన్ని, రెండోవారంలో పాటల్నీ విడుదల చేస్తారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ‘‘తెలుగు జాతి గర్వించదగిన వీరుడి కథ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చరిత్ర చెప్పిన విషయాలతో పాటు, మేం పరిశోధించిన అంశాల్నీ తెరపై ఆవిష్కరిస్తున్నాం. యుద్ధ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకొంటాయ’’ని చిత్రబృందం తెలిపింది. Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted November 17, 2016 Share Posted November 17, 2016 Nice Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.