May 16, 20187 yr 26 minutes ago, rama123 said: Nearest beach to Hyderabad. Kcr sea line cheese lopu Manchi business ki scope vundi.
August 30, 20241 yr 1 hour ago, sonykongara said: Macau,goa laaga special zone gaa develop cheyyali...with low taxes on liquor and gambling..nearest good seashore to hyderabad
August 30, 20241 yr Author సూర్యలంకకు వెలుగులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సూర్యలంక పర్యాటక అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టింది. వంద రోజుల ప్రణాళికలో సూర్యలంకను చేర్చింది. Published : 30 Aug 2024 05:26 IST కేంద్రం నుంచి రూ.వంద కోట్ల నిధులు విడుదల న్యూస్‌టుడే-అమరావతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సూర్యలంక పర్యాటక అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టింది. వంద రోజుల ప్రణాళికలో సూర్యలంకను చేర్చింది. వసతుల కల్పనకు నిధులు మంజూరు కావడంతో సూర్యలంకకు మహర్దశ పట్టనుంది. కేంద్రం రూ.వంద కోట్ల నిధులు విడుదల చేయడంతో తీరానికి సమీపంలో పర్యాటక శాఖకు చెందిన ఎనిమిది ఎకరాల్లో కొత్త రిసార్ట్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. జల క్రీడలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు. సూర్యలంక బీచ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన బీచ్. వారాంతాల్లో వేల సంఖ్యలో ప్రజలు కుటుంబసభ్యులు, స్నేహితులతో విహారానికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించటానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. బాపట్ల ప్రగతికి పర్యాటక రంగం ఎంతో కీలకం. ఈ రంగం ఎంత అభివృద్ధి చెందితే ఆ మేరకు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సూర్యలంకలో పర్యాటక రంగాభివృద్ధికి పైసా ఇవ్వలేదు. పర్యాటక శాఖ మంత్రులు వచ్చి సందర్శించి వెళ్లారు. మూడు నక్షత్రాల హోటల్ నిర్మిస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతులు లేవు. పైగా తెదేపా హయాంలో నిర్మించిన విశ్రాంతి గదులను కూల్చివేశారు. పర్యాటకులకు వసతుల కల్పన ఇలా.. బీచ్ వద్ద పర్యాటక శాఖకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ప్రస్తుత రిసార్ట్స్‌లో ఉన్న 30 గదులు సరిపోవటం లేదు. శుక్ర, శని, ఆదివారాలు గదుల కోసం నెల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి కేంద్రం రూ.400 కోట్లు మంజూరు చేయడంతో దీనిలో రూ.వంద కోట్లను సూర్యలంకకు కేటాయించింది. ఈ నిధులతో బీచ్ వద్ద ఎనిమిది ఎకరాల భూమిలో కొత్త రిసార్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. 2000 సంవత్సరంలో నిర్మించిన పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్స్ గదులు దెబ్బతిన్నాయి. గదులను రూ.5 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. జల క్రీడలు, స్పీడ్ బోటింగ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు జెట్‌స్కీలను కేటాయించింది. కొత్తగా స్పీడ్ బోట్లు రానున్నాయి. ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువలో పడవల్లో విహారం ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. పడవల్లో మడ అడవులు, పొగురు ప్రాంతంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు, విదేశాలు హిమాలయాల నుంచి వచ్చే వలస పక్షులను పర్యాటకులను తిలకించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, మహిళలు దుస్తులు మార్చుకోవటానికి గదుల నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించనున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాం - సురేష్, జిల్లా పర్యాటక శాఖాధికారి జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ శింగరకొండ ఆంజనేయస్వామి ఆలయం, మోటుపల్లి ఆలయాలు, రామాపురం, వాడరేవు, సూర్యలంక బీచ్‌లు, నిజాంపట్నం హార్బరు, భట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం మంజూరు చేసిన నిధులతో సూర్యలంకలో రిసార్ట్స్ నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాం.
January 20, 20251 yr Author తీరానికి హరిత తోరణం గోవా.. కేరళ తరహాలో సూర్యలంక బీచ్‌ను హరితమయం చేయాలని కలెక్టర్ జె.వెంకట మురళి ప్రణాళికలు సిద్ధం చేశారు. బీచ్ ఒడ్డున పర్యాటక శాఖకు చెందిన 7.5 ఎకరాల్లో కొబ్బరి, ఖర్జూర మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. By Andhra Pradesh Dist. DeskPublished : 20 Jan 2025 03:41 IST Ee Font size సూర్యలంక వద్ద కొబ్బరి, ఖర్జూర మొక్కల పెంపకం పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం సూర్యలంక తీరం బాపట్ల, న్యూస్‌టుడే: గోవా.. కేరళ తరహాలో సూర్యలంక బీచ్‌ను హరితమయం చేయాలని కలెక్టర్ జె.వెంకట మురళి ప్రణాళికలు సిద్ధం చేశారు. బీచ్ ఒడ్డున పర్యాటక శాఖకు చెందిన 7.5 ఎకరాల్లో కొబ్బరి, ఖర్జూర మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అటవీశాఖ ఆధ్వర్యంలో పచ్చదనం పెంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించి అదనంగా వేల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వసతుల మెరుగుదల స్వర్ణాంధ్ర-2027 విజన్‌లో భాగంగా జిల్లాలో బీచ్‌లు అభివృద్ధి చేసి పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పెట్టుబడులతో కొత్తగా బీచ్ రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌లు, నక్షత్రాల హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. సూర్యలంక, రామాపురం బీచ్‌లను బ్లూఫ్లాగ్ బీచ్‌లుగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు రూపొందించారు. సూర్యలంక బీచ్‌కు ఏటా పది లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. కార్తిక మాసంలో ఒక్క రోజే రెండు లక్షల మంది తరలి రావటం విశేషం. సూర్యలంకలో 15 ఎకరాల పర్యాటక, మత్స్యశాఖ భూములు ఉన్నాయి. హరిత వనాలు పెంచటానికి సూర్యలంక ప్రధాన బీచ్ నుంచి పొగురు వరకు 4 కి.మీ. విస్తరించి ఉన్న రిజర్వు అటవీ భూములు అనుకూలం. బీచ్ రోడ్డుకు ప్రతిపాదనలు పర్యాటకాభివృద్ధి తొలి దశలో సూర్యలంక నుంచి ఓడరేవు వరకు 21 కి.మీ. బీచ్ రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. బీచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. రెండో దశలో సూర్యలంక నుంచి పొగురు, నిజాంపట్నం మీదుగా దిండి వరకు 30 కి.మీ. బీచ్ రోడ్డు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించనున్నారు. త్వరలో బాపట్ల మండలం ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువలో పడవల్లో విహారం ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. రూ.10లక్షల వ్యయంతో.. హరిత ప్రాజెక్టులో భాగంగా సూర్యలంకలోని పర్యాటక శాఖకు చెందిన 7.5 ఎకరాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.పది లక్షలు ఖర్చు చేసి 1120 కొబ్బరి మొక్కలు పెంచనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతి రెండు కొబ్బరి మొక్కల మధ్య ఓ ఖర్జూర మొక్క నాటనున్నారు. వీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టిసారించారు. దీంతో బీచ్ ఒడ్డు హరితమయం కానుంది. సమీప రిజర్వు అటవీ భూముల్లో యూకలిప్టస్, ఇతర మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో 200 హెక్టార్లలో మడ అడవులు పెంచుతున్నారు.
February 14, 20251 yr Author అలల అందం ఆస్వాదించేలా సూర్యలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇక్కడ ఒబెరాయ్ గ్రూప్ రూ.170 కోట్లతో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించనుంది. By Andhra Pradesh Dist. DeskPublished : 14 Feb 2025 05:51 IST Ee Font size సూర్యలంకలో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించనున్న ఒబెరాయ్ గ్రూప్ అందుబాటులోకి వస్తే పర్యాటక రంగానికి ఊపు సూర్యలంక తీరం న్యూస్‌టుడే, బాపట్ల : సూర్యలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇక్కడ ఒబెరాయ్ గ్రూప్ రూ.170 కోట్లతో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించనుంది. గోల్డెన్ శాండ్ బీచ్ స్టార్ హోటల్ నిర్మాణ పనులకు మార్చి నెలాఖరులోగా శంకుస్థాపన చేయనున్నట్లు పర్యాటకశాఖ వర్గాలు పేర్కొన్నాయి. తీరంలో పర్యాటకులకు మౌలిక వసతుల కల్పనకు రూ.90 కోట్లు నిధులు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే ఆతిథ్య, పర్యాటక కేంద్రంగా బాపట్ల అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో 74 కి.మీ. పొడవైన తీర ప్రాంతం ఉంది. సూర్యలంకలో 4 కి.మీ. పొడవులో సహజసిద్ధ అందమైన బీచ్ ఉంది. బీచ్‌కు సమీపంలో 15 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇందులో నుంచి పర్యాటక శాఖకు ఎనిమిదిన్నర ఎకరాలు కేటాయించారు. పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్స్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. రిసార్ట్స్‌లో ప్రస్తుతం ఉన్న 32 గదులు పర్యాటకుల రద్దీకి ఏ మాత్రం సరిపోవటం లేదు. రెండు, మూడు నెలలు ముందుగానే పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్లో గదులు బుక్ చేసుకుంటున్నారు. 90 శాతం పర్యాటకులు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. గదులు సరిపోక చిన్న చిన్న ప్రైవేటు రిసార్ట్స్‌కు వెళుతున్నారు. సూర్యలంకలో పీపీపీ విధానంలో పర్యాటక శాఖకు చెందిన భూమిలో ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణానికి ఐదేళ్ల క్రితమే గత ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. కానీ నిర్మాణ పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒబెరాయ్ గ్రూప్‌తో పర్యాటక శాఖ అధికారులు చర్చించి సూర్యలంకలో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఉగాది నాటికి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 140 గదులతో హోటల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. దీంతో 450 మందికి ఉపాధి లభించనుంది. బీచ్‌కు సమీపంలో నిర్మిస్తున్న హోటల్ నుంచి తీరం అందాలు, సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు పర్యాటకులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాండురంగాపురం పంచాయతీ కొత్త ఓడరేవు సమీపంలో మరో ప్రైవేటు గ్రూపు ఆధ్వర్యంలో బీచ్‌కు అభిముఖంగా ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. ఇదే తీరంలో కొత్త రిసార్ట్స్, మూడు నక్షత్రాల హోటల్ నిర్మాణం చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూర్యలంక నుంచి చీరాల మండలం ఓడరేవు వరకు బీచ్‌రోడ్ నిర్మాణానికి రూ.40 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే ఓడరేవు నుంచి రామాపురం, కఠారివారిపాలెం వరకు బీచ్ రోడ్డు ఉంది. దీనిని రెండు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ కోరిన రూ.90 కోట్ల నిధులు వస్తే మౌలిక వసతులు అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
February 16, 20251 yr Author పర్యాటకుల కష్టాలు చెల్లు సూర్యలంక బీచ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. సుమారు 4 కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఈ సహజ సిద్ధమైన బీచ్ ఉమ్మడిజిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. By Andhra Pradesh Dist. DeskUpdated : 16 Feb 2025 06:14 IST Ee Font size సూర్యలంక బీచ్‌లో పలు సౌకర్యాలు ఈనాడు - అమరావతి సూర్యలంక బీచ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. సుమారు 4 కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఈ సహజ సిద్ధమైన బీచ్ ఉమ్మడిజిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారు సముద్రంలో స్నానాలు చేశాక శుభ్రం చేసుకోవడానికి మంచినీటి పంపులు, దుస్తులు మార్చుకోవడానికి గదులు లేవు. ఆ తడిసిన దుస్తులతో అసౌకర్యంగా తిరుగుముఖం పడుతున్నారని తెలుసుకున్న బాపట్ల జిల్లా పాలనాధికారి జె.వెంకటమురళి జిల్లా గ్రాంటు నుంచి రూ.40 లక్షలు వెచ్చించి పలు సౌకర్యాల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం నెల రోజుల్లోపే దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి పంపుల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టే బాధ్యతను జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించారు. సూర్యలంక నుంచి రెండు, మూడు కి.మీ దూరంలో మంచినీళ్లు పడే ప్రాంతాలు గుర్తించి బోర్లు వేసి అక్కడి నుంచి పైపులైన్ ద్వారా బీచ్‌కు నీళ్లు చేర్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. బీచ్‌కు 2 కిలోమీటర్ల దూరంలో మంచినీళ్లు ఉన్నాయని ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా విభాగం గుర్తించింది. బీచ్‌లో 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి అందులోకి నీళ్లు తరలించి భక్తులు స్నానాలు చేసేందుకు అందుబాటులో ఉంచుతారు. సగటున రోజుకు కనీసం 3-4 వేల మందికి పైగా వస్తారని అంచనా వేసి 80 వరకు ఓపెన్ షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. షవర్ల కింద స్నానం చేయడానికి ఇష్టపడని వారి కోసం క్లోజ్డ్ బాత్‌రూమ్స్ 20 వరకు నిర్మిస్తారు. దుస్తులు మార్పిడికి 30 గదులు ఏర్పాటు చేయబోతున్నారు. స్వచ్ఛాంధ్ర నిధుల కింద మరో 20 వరకు మరుగుదొడ్లు నిర్మించడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తాం రాజధాని అమరావతికి కేవలం 70-80 కి.మీ దూరంలో ఉన్న ఏకైక బీచ్ ఇదే. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలైన డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ వంటివి లేవు. ఆ అసౌకర్యాన్ని గుర్తించి ప్రస్తుతం రూ.40 లక్షలతో యుద్ధప్రాతిపదికన ఆయా వసతుల కల్పనకు ఆదేశించాం. రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. జిల్లా గ్రాంటు నుంచి వెచ్చిస్తున్న ఈ సౌకర్యాల నిర్వహణ బాధ్యతలను స్థానిక పంచాయతీకి అప్పగించాలనే యోచనలో ఉన్నాం. వెంకట మురళి, కలెక్టర్, బాపట్ల
March 27, 20251 yr Author సూర్యలంకకు పర్యాటక హంగులు సూర్యలంక బీచ్‌కు సరికొత్త సొబగులు అద్ది జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. By Andhra Pradesh Dist. DeskPublished : 27 Mar 2025 05:31 IST Ee Font size 2 min read స్వదేశీ దర్శన్-2 ప్రాజెక్టు కింద రూ.88కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు సూర్యలంక తీరం న్యూస్‌టుడే, బాపట్ల: సూర్యలంక బీచ్‌కు సరికొత్త సొబగులు అద్ది జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పరిశుభ్ర బీచ్‌గా తీర్చిదిద్ది మౌలికవసతుల కల్పనతో బ్లూఫ్రాగ్ గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో స్వదేశీ దర్శన్-2 ప్రాజెక్టు కింద రూ.88 కోట్ల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. సూర్యలంక బీచ్‌కు ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు. సహజసిద్ధ సమతలమైన బీచ్ పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. పర్యాటక శాఖకు బీచ్ రిసార్టుల ద్వారా ఏటా రూ.ఐదు కోట్ల ఆదాయం లభిస్తోంది. కొత్త రిసార్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల అభివృద్ధికి గతంలో రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. పర్యాటకశాఖకు కేటాయించిన ఎనిమిది ఎకరాల భూమి దశాబ్దాలుగా ఖాళీగా ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2017లో రూ.కోటితో కొంతమేర బీచ్‌రోడ్డు నిర్మించారు. అయితే పర్యాటకులు సేదదీరడానికి వసతులు లేవు. సముద్రంలో స్నానం చేసిన వారు దుస్తులు మార్చుకోవటానికి గతంలో ఉన్న విశ్రాంతి భవనాలను వైకాపా ప్రభుత్వ హయాంలో కూల్చివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విజన్ 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలో భాగంగా సూర్యలంకను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బీచ్ ముఖద్వారాన్ని తీర్చిదిద్ది పర్యాటకులకు వసతులు కల్పించేలా ఆధునికీకరణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. స్వదేశీ దర్శన్-2 కింద దీన్ని పూర్తిచేస్తే తీరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుంది. వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్టులో భాగంగా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా బీచ్‌కు ఆనుకుని ఉన్న 20ఎకరాల ప్రభుత్వ భూమిలో బడ్జెట్ హోటళ్లు, రిసార్టులు, ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. పిల్లలు ఆడుకోవటానికి వినోద పార్కును అభివృద్ధి చేయనున్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తారు. స్పీడ్ బోటింగ్, స్కూబీ డ్రైవింగ్ ఇతర వినోద క్రీడలు ప్రారంభిస్తారు. బీచ్ నుంచి వాహనాల్లో వెళ్లి నాలుగు కి.మీ. దూరంలోని పొగురు ప్రాంతంలో మడ అడవుల అందాలు, విదేశీ, స్వదేశీ పక్షులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రతిపాదనలు పంపించాం: ప్రఖర్‌జైన్, జేసీ సూర్యలంక బీచ్ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్రానికి పంపించాం. బీచ్‌ను పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. సహజసిద్ధ తీరంలో తగిన వసతులు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
March 27, 20251 yr Author సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు విడుదల బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం రూ.97.52 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. By Andhra Pradesh News TeamPublished : 27 Mar 2025 16:06 IST Ee Font size 1 min read అమరావతి: బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం రూ.97.52 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద బీచ్‌కు నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన దుర్గేశ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి బీచ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు దుర్గేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
March 28, 20251 yr 4 minutes ago, sonykongara said: n 100 cr tho next 1.5 years lo devlopment anukunnattu aithe it will be next level
Create an account or sign in to comment